Breaking News

ఏపీకి తిరిగి ఊపిరి పోసిన కూటమి పాలన

-ఐదేళ్ల వైసీపీ అరాచకం నుంచి.. రూ.5కే కడుపు నింపే స్థితికి
-ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో వంద రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలపై ప్రచారం
-ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలుస్తాం
-ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామ: రాష్ట్రంలో ఎన్డీయే అధికారంలోకి వచ్చి వంద రోజుల వుతున్న సందర్భంగా ఈ నెల 20 నుంచి ‘ఇది మంచి ప్రభుత్వం’ నినాదంతో మంత్రులు, ఎమ్మెల్యేలు ఆరు రోజులపాటు ఇంటింటికీ వెళ్లి ప్రజల్ని కలవనున్నామని ఎన్టీఆర్ జిల్లా నందిగామ శాసన సభ్యులు తంగిరాల సౌమ్య పేర్కొన్నారు. గురువారం ఒక ప్రకటనలో మాట్లాడుతూ, చంద్రబాబు సారథ్యంలోని ఎన్డీయే ప్రభుత్వం తొలి వందరోజుల్లో అమలు చేసిన సంక్షేమ పథకాన్ని, చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్ని వారికి వివరిస్తామన్నారు. ఆరు ముఖ్యమైన అంశాలతో కరపత్రాన్ని రూపొందించారని, ప్రభుత్వ లోగోతోనే కరపత్రాన్ని సిద్ధం చేశారన్నారు. “సంక్షోభంలోనూ సంక్షేమం సాధించి, అభివృద్ధికి రెక్కలు తొడిగి, మొదటి వంద రోజుల్లోనే ‘ఇది మంచి ప్రభుత్వం’ అని ప్రజల చేత అనిపించుకుంటోంది కూటమి ప్రభుత్వం” అని పేర్కొ న్నారు. ప్రస్తావించిన ఆరు ముఖ్యాంశాలు.

* 16,437 పోస్టుల భర్తీకి మెగా డీఎస్సీ ప్రకటించడం ద్వారా నిరుద్యోగ యువతకు అండ

* పింఛను మొత్తాన్ని ఒకేసారి రూ.1000 పెంచి… రూ.4వేలు చేయడంతో పాటు, ఎన్డీయే అధికారంలోకి వచ్చిన మొదటి నెలలో ఒక్కొక్కరికీ రూ.7 వేల చొప్పున అందజేశాం. ఒకేరోజు 65.18 లక్షల మందికి ఇంటింటికీ వెళ్లి రూ.4,408 కోట్లు పంపిణీ చేశాం. దేశంలోనే ఇదో తిరుగులేని సంక్షేమ చరిత్ర.

* ప్రతినెలా ఒకటో తేదీనే ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నాం. ధాన్యం కొనుగోలు బకా యిలు రూ.1,674.47 కోట్లు చెల్లించి అన్నదాతను ఆదుకున్నాం. స్థానిక సంస్థలకు రూ.1,452 కోట్లు ఇచ్చి పంచాయతీలకు ప్రాణం పోశాం.

* పేదలకు పూటకు రూ.5కే ఆకలి తీర్చే 100 అన్నక్యాంటీన్లను పునఃప్రారంభించాం. ‘ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను రద్దుచేసి ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాం.

* విజయవాడ నగరం వరదల్లో విలవిల్లాడుతున్నప్పుడు చంద్రబాబు పది రోజులపాటు బస్సులోనే ఉంటూ, నిద్రాహారాలు మాని ప్రజల్ని ఓ తండ్రిలా కాపాడారు.

తాను పది రోజులు బస్సులోనే పడుకొని పనిచేసి ఆదర్శంగా నిలిచారు. ఆయన శ్రమ రాష్ట్రం లోపలా… బయటా అన్ని వర్గాల ప్రజల ప్రశంసలు పొందిందని తగిరాల సౌమ్య ఈ సందర్భంగా వివరించారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *