విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉపాధ్యాయ అర్హత పరీక్షలలో భాగంగా ఐదో రోజు అనగా 07/10/2024 తేదీన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు విభాగంలో ఉపాధ్యాయ అర్హత పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షలలో మొత్తం 32875మందికి గాను 28267 మంది అభ్యర్థులు అనగా 85.98 శాతం మంది హాజరయ్యారు. ఉదయం 69 సెంటర్లలో జరిగిన సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల అర్హత పరీక్షకు 16525 మందికి గాను 14042 మంది అనగా 84.97 శాతం మంది హాజరయ్యారు. అదేవిధంగా మధ్యాహ్నం 68 సెంటర్లలో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయుల పరీక్షలకు 16350 మందికి గాను 14231 మంది అనగా 87.04 శాతం మంది హాజరయ్యారు. ఐదవ రోజు జరిగిన ఉపాధ్యాయ అర్హత పరీక్షలు ప్రశాంతం గా ముగిసాయి. ఇంగ్లీష్ మరియు హిందీ స్కూల్ అసిస్టెంట్ భాషోపాధ్యాయుల సౌలభ్యం కొరకు ప్రాథమిక కీ మరియు రెస్పాన్స్ షీట్లను వెబ్సైటు (https://aptet.apcfss.in/)లో అందుబాటులో వుంచడమైనది. వీటిపై ఏవైనా అభ్యంతరాలు వున్నట్లైతే 9వ తేదీ వరకు అభ్యర్థులు తమ అభ్యంతరాలను పై వెబ్సైట్ ద్వారా మాత్రమే తెలియజేయాలి అని ఏపీ టెట్ కన్వీనర్ శ్రీ ఎం.వి. కృష్ణా రెడ్డి గారు ఒక ప్రకటనలో తెలియజేసారు .
Tags vijayawada
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …