Breaking News

పెండింగ్ బీమా క్లెయిమ్‌ల‌ను త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాలి

– బాధితుల‌కు సాయ‌మందించ‌డంలో బీమా కంపెనీల కృషి ప్ర‌శంస‌నీయం.
– రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వ‌ర‌ద ప్ర‌భావిత ప్రాంత ప్ర‌జ‌ల వాహ‌నాలు, వివిధ ఆస్తి న‌ష్టాల‌కు సంబంధించి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌ల కృషి ప్ర‌శంస‌నీయ‌మ‌ని.. ఇంకా పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల‌ను కూడా త్వ‌రిత‌గ‌తిన ప‌రిష్క‌రించాల‌ని బీమా సంస్థ‌ల‌కు రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా సూచించారు.
శుక్ర‌వారం ఎన్‌టీఆర్ జిల్లా క‌లెక్ట‌రేట్ శ్రీ పింగ‌ళి వెంక‌య్య స‌మావేశ మందిరంలో రెవెన్యూ శాఖ ప్ర‌త్యేక ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ఆర్‌పీ సిసోడియా.. ర‌వాణా శాఖ క‌మిష‌న‌ర్ మ‌నీష్ కుమార్ సిన్హాతో క‌లిసి బీమా సంస్థ‌ల ప్ర‌తినిధుల‌తో స‌మావేశం నిర్వ‌హించారు. బీమా సంస్థ‌ల వారీగా న‌మోదైన క్లెయిమ్‌లు, ప‌రిష్క‌రించిన క్లెయిమ్‌లు, పెండింగ్‌లో ఉన్న క్లెయిమ్‌ల‌పై చ‌ర్చించారు. 12,632 మోటార్ వాహ‌నాల క్లెయిమ్‌లు, 2,794 ఆస్తుల క్లెయిమ్‌ల‌తో క‌లిపి మొత్తం 15,426 క్లెయిమ్‌లు న‌మోదు కాగా 605 ఉప‌సంహ‌ర‌ణ‌, 325 తిర‌స్క‌ర‌ణ‌కు గురైన క్లెయిమ్‌లు పోనూ 14,496 నిక‌ర క్లెయిమ్‌ల్లో ఆన్ అకౌంట్‌, అండ‌ర్ ఆక్ష‌న్‌తో సహా 97.16 శాతం మేర సెటిల్‌మెంట్ చేయ‌డం జ‌రిగింద‌ని ర‌వాణా శాఖ అధికారులు వివ‌రించారు. రూ. 136.52 కోట్ల మేర చెల్లింపులు చేసిన‌ట్లు తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆర్‌పీ సిసోడియా మాట్లాడుతూ గౌర‌వ ముఖ్య‌మంత్రి బీమా క్లెయిమ్‌ల ప‌రిష్కారంపై మొద‌ట్నుంచీ ప్ర‌త్యేకంగా దృష్టిసారించార‌ని.. క్లెయిమ్‌ల ప‌రిష్కారంలో బీమా సంస్థ‌లు మెరుగైన ప‌నితీరు క‌న‌బ‌ర‌చాయ‌ని, ఇదే స్ఫూర్తితో పెండింగ్‌లో ఉన్న ద్విచ‌క్ర‌, త్రిచ‌క్ర‌, ప్రైవేటు కారు, ట్యాక్సీ, వాణిజ్య వాహ‌నాల‌తో పాటు కుటుంబాలు, దుకాణ‌దారులు, ఎస్ఎంఈ, ఎంఎస్ఎంఈ ఆస్తుల న‌ష్టాల‌కు సంబంధించిన క్లెయిమ్‌ల‌ను కూడా త్వ‌రిగ‌తిన ప‌రిష్క‌రించాల‌ని సూచించారు. స‌మావేశంలో డీఆర్‌వో వి.శ్రీనివాస‌రావు, విజ‌య‌వాడ డీటీసీ సీహెచ్ మోహ‌న్‌, డీటీసీ (ఐటీ) ఎం.పురేంధ్ర‌, బీమా కంపెనీల ప్ర‌తినిధులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

Check Also

యువతకు వినూత్న మరియు భవిష్యత్తు నైపుణ్యాలపై సీడ్ యాప్ సంస్థ లో వర్క్‌షాప్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : పరిశ్రమతో రాష్ట్ర యువతను మమేకం చేసే లక్ష్యంతో వారికి శిక్షణ అందించి మెరుగైన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *