తెనాలి, నేటి పత్రిక ప్రజావార్త :
రక్షించండి! రక్షించండి!! ప్రజా స్వామ్యాన్ని రక్షించండి!. బ్రతుకుదాం! బ్రతికిద్దాం!! బ్రతికించడం కోసం బ్రతుకుదాం! బ్రతికితే దేశం కోసం చస్తే దేశం కోసం అనే నినాదంతో నంది వెలుగు తెనాలి ప్రధాన రహదారి మార్గంలో గల ఆటోనగర్ లోని ఉమా సిల్వర్ వర్క్ షాపునుందు గాంధీ దేశం ట్రస్ట్ వ్యవస్థాపకులు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ సత్యాగ్రహా రిలే నిరసన దీక్ష చేశారు. బుధవారం ఆమేరకు ఆర్ ఆర్ గాంధీ నాగరాజన్ మాట్లాడుతూ 77 ఏళ్ళ స్వతంత్ర్య భారత దేశంలో ప్రతినెలా 30వ తెదీన గాంధీ మృతి చెందిన రోజును స్మరించుకుంటూ వివిద ప్రజాహిత కార్యక్రమాలు ద్వారా ప్రజలను చైతన్యపరిచే కార్యమాలు నిర్వహిస్తూ గాంధీ వేషదారణతో ముందుకు సాగుతున్నారు. ఆమేరకు ఆయన తొలుత గాందీ, అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కళ్లకు గంతులు కట్టుకుని మోకాళ్ళపై నిలిచి రిలే నిరాహార దీక్షచేశారు. ఆ దీక్షనుద్దేశించి ఆయన మాట్లాడుతూ స్త్రీలకు స్వతంత్ర్యం నేటికీ లేదని బావితరాలు భవిష్యత్ సమాజ, స్త్రీరక్షణ లేని సమాజం సమాజం కానేకాదని ఆ తరహా విధానాలను ప్రోత్సహించే రీతిగా నాయకులు మారాలని విన్నవించారు. నేటికీ స్త్రీలు బానిసత్వంలోనే మగ్గుతున్నారని వెల్లడించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్త్రీల రక్షణ కొరకు బలమైన చట్టాలు తేవాలని కోరారు. అన్ని రంగాలలో స్త్రీలకు సమాన హక్కులు ఉండేలా చట్టాలు తీసుకురావాలని పేర్కొన్నారు. సమాజ హితం కోసం స్త్రీల సంక్షేమం కొరకు తాను దేశవ్యాప్తంగా ఉద్యమాలు చేయనున్నట్లు వెల్లడించారు. ప్రత్యేక ప్రచార రథం ద్వారా పలు ప్రాంతాల్లో పర్యటించే ఆలోచన ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్టు మహిళా అధ్యక్షురాలు ఆర్.ఎన్.శివరంజని, ట్రస్ట్ ఏపీ బాధ్యురాలు బంగారు భారతి తదితరులు పాల్గొన్నారు.
Tags tenali
Check Also
బడ్జెట్ భేష్ : మంత్రి సవిత
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్ సభలో ప్రవేశపెట్టిన ఆర్థిక బడ్జెట్ …