Breaking News

మండలంలో పర్యటించని ప్రత్యేక అధికారులపై చర్యలు : మండల ప్రత్యేకాధికారులకు జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరిక

నూజివీడు, నేటి పత్రిక ప్రజావార్త :
మండలంలో పర్యటించని మండల ప్రత్యేక అధికారులపై చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టరు జె.నివాస్ హెచ్చరించారు. వ్యవసాయం, గృహ నిర్మాణం, కోవిడ్ నియంత్రణ, స్పందన ధరఖాస్తుల పరిష్కారం, తదితర అంశాలపై గురువారం స్థానిక తాహశీల్దారు కార్యాలయం నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టరు సమీక్షించారు. ఈ సందర్భంగా వీరులపాడు మండల ప్రత్యేక అధికారి అయిన నెడ్ క్యాప్ అధికారిని కలెక్టరు వివరాలు అడగగా గురువారం విజయవాడలో సమీక్షా సమావేశం కారణంగా మండల పర్యటనకు రాలేదని, విజయవాడ రూరల్ మండలం నుండి వీడియో కాన్ఫరెన్సు హాజరవుతున్నారని వీరులపాడు మండల అధికారులు తెలియజేశారు. అయినప్పటికీ సదరు అధికారి వీడియో కాన్ఫరెను ఏ ప్రదేశం నుండీ హాజరు కాకపోవడంపై కలెక్టరు ఆగ్రహం వ్యక్తం చేస్తూ సదరు అధికారి నుండి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. ఈ విషయంలో అధికారి నిర్లక్ష్యం అని తేలితే చర్యలు తీసుకుంటానని కలెక్టరు హెచ్చిరించారు. మండల ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలంలోని గ్రామాలలో సోమవారం, గురువారం తప్పనిసరిగా పర్యటించి, గ్రామ సచివాలయాలు ఆకస్మిక తణిఖీ, గృహ నిర్మాణాల పురోగతి పరిశీలిన, రైతుల సమస్యల పరిష్కారం వంటి ప్రధానమైనవి పరిశీలించి, ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని గతంలోనే ఆదేశించడం జరిగిందని, ఇందులో ఎటువంటి అలసత్వానికి తావులేదన్నారు. ఏదైనా అత్యవసర సమావేశం ఉండి, మండల పర్యటనకు వీలుకుదరకపోతే అధికారులు తన నుండి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలన్నారు. ఖరీకు రైతులను పూర్తిస్థాయిలో సన్నద్ధం చేసి, రైతులకు విత్తనాలు, ఎరువులు రైతు భరోసా కేంద్రాల ద్వారా అందేటట్లు చూడాలన్నారు. గ్రామాలలో జరుగుతున్న రైతు చైతన్యయాత్రలు సక్రమంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని, సమస్యపై నైనా రైతు భరోసా కేంద్రాలకు వచ్చే రైతుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు.

పేదల ఇళ్ల గ్రౌండింగ్ నూరుశాతం ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలి : కలెక్టరు
నవరత్నాల కార్యక్రమంలో భాగంగా పేదలందరికీ ఇళ్లు పధకంలో స్థలాలు అందించిన ప్రతీ లబ్దిదారుడి ఇళ్ల నిర్మాణం ఈ నెలాఖరులోగా ప్రారంభం కావాల్సిందేనని కలెక్టరు నివాస్ స్పష్టం చేశారు. లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుకూలమైన పరిస్థితులు కల్పించాలని, ఇసుక, సిమ్మెంట్, ఐరన్, ఇటుకలు వంటి నిర్మాణ సామాగ్రికి ఎటువంటి కొరతా లేకుండా గృహ నిర్మాణ శాఖ, తదితర శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో ఇళ్ల నిర్మాణం చేపడుతున్న లేఅవుట్లలో 20 మంది చొప్పున లబ్దిదారులను ఒక గ్రూపుగా ఏర్పాటుచేసి, మేస్త్రీలను అప్పించి ఇళ్ల నిర్మాణ పనులు వేగవంతంగా జరిగేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కోవిడ్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా ప్రతీ గ్రామంలోనూ ఫీవర్ సర్వే పూర్తి స్థాయిలో జరగాలన్నారు. వాలంటీర్లు వారి పరిధిలోని ఇళ్లల్లో జ్వర సంబంధిత లక్షణాలతో ఉన్న వారికి వెంటనే కరోనా టెస్టులు నిర్వహించాలన్నారు. పాజిటివ్ సోకిన వారికి వెంటనే ఐసోలేషన్ సౌకర్యంతో వైద్య సహకారం అందించాలన్నారు. స్పందన కార్యక్రమం అందిన ధరఖాస్తులను నిర్ణీత సమయంలోగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నిర్ణీత సమయం దాటినా పరిష్కారానికి చర్యలు తీసుకోని అధికారులపై చర్యలు తీసుకుంటానని కలెక్టరు హెచ్చరించారు. సమావేశంలో ఆర్ డివో కె. రాజ్యలక్ష్మి, హౌసింగ్ డిఇ భాస్కర్, తాహశీల్దారు యం . సురేష్ కుమార్, ఎంపిడివో జి.రాణి, ప్రభృతులు పాల్గొన్నారు.

Check Also

మద్దిరాలపాడు పర్యటనలో…

ఒంగోలు, నేటి పత్రిక ప్రజావార్త : మద్దిరాలపాడు పర్యటనలో భాగంగా తాళ్లూరి జగ్గయ్య (67), పార్వతి దంపతుల ఇంటికి ముఖ్యమంత్రి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *