అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రూపొందిస్తున్న డ్రోన్ పాలసీ దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ పాలసీగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఏపీ డ్రోన్స్ కార్పొరేషన్ సంస్థ ఐదేళ్లలో చేపట్టాల్సిన లక్ష్యాలతో రూపొందించిన ఏపీ డ్రోన్ పాలసీ-2024-2029 ముసాయిదా పాలసీపై సచివాలయంలో మంగళవారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమీక్షించారు. రాష్ట్ర పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ కార్యదర్శి ఎస్. సురేష్‌కుమార్, ఏపీ డ్రోన్ కార్పొరేషన్ ఎండీ కె. దినేష్ కుమార్‌లు ఈ పాలసీ గురించి ముఖ్యమంత్రికి …
Read More »Tag Archives: AMARAVARTHI
గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష
-డిసెంబరులో లక్ష గృహ ప్రవేశాలు నిర్వహించేందుకు సన్నాహాలు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త గృహ నిర్మాణ శాఖపై సీఎం చంద్రబాబు నాయుడు సమీక్ష నిర్వహించారు. 2029 నాటికి అర్హులైన అందరికీ ఇళ్లు నిర్మించే లక్ష్యంతో పని చేయాలని సీఎం అన్నారు. రాష్ట్రంలో పీఎంఏవై 2.0 పథకం ప్రారంభించేందుకు కేంద్రంతో ఎంఓయూ కుదుర్చుకునేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం ఏర్పాటయ్యాక పీఎంఏవై అర్బన్ కింద 58,578 ఇళ్లు, పీఎంఏవై గ్రామీణం కింద 17,197 ఇళ్లు నిర్మించినట్లు అధికారులు సీఎంకు వివరించారు. లక్ష ఇళ్లు …
Read More »శ్రీవారిని దర్శించుకున్న హోంమంత్రి వంగలపూడి అనిత
-అనంతరం టీటీడీ ఈవో శ్యామలరావుతో హోంమంత్రి సమావేశం -నక్కపల్లిలోని ఉపమాక శ్రీకల్కి వేంకటేశ్వరస్వామి ఆలయాభివృద్ధిపై చర్చ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తిరుపతి శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. ఆలయంలోకి వెళ్లిన హోంమంత్రికి టిటిడి అధికారులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వదించారు. టీటీడీ అధికారులు శేష వస్త్రం కప్పి స్వామివారి తీర్థ ప్రసాదాలను హోంమంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ పాలనలో రాష్ట్ర ప్రజలంతా …
Read More »మూలపేట పోర్టు ప్రాంతంలో రూ.10 వేల కోట్లతో పారిశ్రామికాభివృద్ధి
-ఇంటికో పారిశ్రామికవేత్త రావాలి -టెక్కలి లేదా పలాసలో విమానాశ్రయం -ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో వెల్లడించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు శ్రీకాకుళం/ఈదుపురం, నేటి పత్రిక ప్రజావార్త : మూలపేట పోర్టు ఏర్పాటు తర్వాత ఈ ప్రాంతంలో పది వేల కోట్ల రూపాయలతో పరిశ్రమ ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం నియోజకవర్గం ఇచ్చాపురం మండలం ఈదుపురం గ్రామంలో దీపం-2 ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని శనివారం ఆయన లాంఛనంగా ప్రారంభించిన …
Read More »దీపావళి శుభాకాంక్షలు తెలిపిన మంత్రి నాదెండ్ల మనోహర్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రజలందరికీ దీపావళి శుభాకాంక్షలు. దుష్టశక్తులను పారద్రోలి కొత్త జీవితానికి స్వాగతం పలికే వెలుగుల రోజే దీపావళి పండగ..ఈ దీపావళి రోజున ప్రజలందరి జీవితాల్లో కష్టాల చీకట్లు తొలగిపోయి సంతోషాల వెలుగులు ప్రసరించాలని కోరుకుంటున్నాను. ఓ చిన్న దీపం ఆవిరవుతూ అందరికీ వెలుగు ఇస్తుందన్న ప్రేరణతో అందరం ముందుకు సాగుదాం.. చీకటిని తరిమేసి వెలుగులు నింపే పండుగగా, చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా దీపావళిని ఘనంగా జరుపుకుందాం.. దీపాల శోభతో ముంగిళ్లు మురవాలని, సిరి సందపదలతో …
Read More »తూర్పుగోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి ఇద్దరు మృతి చెందడం దిగ్భ్రాంతికరం
-హోంమంత్రి వంగలపూడి అనిత -బాధిత కుటుంబాలకు ప్రభుత్వపరంగా అండగా ఉంటాం: హోంమంత్రి -విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం సూర్యారావుపాలెంలో బుధవారం జరిగిన ఘోర ప్రమాదంపై హోంమంత్రి వంగలపూడి అనిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గ్రామ శివారులోని బాణాసంచా తయారీ కేంద్రంపై పిడుగుపడి పేలుడు సంభవించి ఇద్దరు మహిళలు మృతి చెందడం విషాదకరమన్నారు. మృతి చెందిన కుటుంబాలకు హోం మంత్రి తన ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేశారు. …
Read More »జల్ జీవన్ మిషన్ పనులు పరుగులు తీయించాలి
-ఆర్.డబ్ల్యూ.ఎస్. విభాగం ఎస్.ఈ., ఈ.ఈ.లతో నవంబర్ 8న వర్క్ షాప్ -జల్ జీవన్ మిషన్ పనులపై సమీక్షలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన నీరు అందించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తోందనీ, జల్ జీవన్ మిషన్ పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను ఇందు కోసం సద్వినియోగం చేసుకొందామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, ఆర్.డబ్ల్యూ.ఎస్. శాఖ మంత్రి పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బుధవారం …
Read More »రవాణా అధికార్లు యూనిఫామ్ లేకుండా రోడ్డు పై కనబడితే కఠిన చర్యలు తప్పవు మంత్రి వెల్లడి.
-కడప ఆర్టీవో కార్యాలయంలోని బ్రేక్ ఇన్స్పెక్టర్ విజయ భాస్కర్ రాజు పై తక్షణ చర్యలకు అధికారులను ఆదేశించిన రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -రవాణా శాఖకు కీర్తి తెచ్చేలా విధులు నిర్వహించాలని మంత్రి హితవు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అధికారై ఉండి అక్రమ వసూళ్లు పాల్పడటం హ్యేయమని, అధికారిని ప్రశ్నించడం పట్ల డ్రైవర్ల ఆవేదన అర్ధమవుతుందని, కడప ఆర్టీవో ఆఫీస్ లో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న విజయ భాస్కర్ రాజు అక్రమ డ్రైవర్లు వద్ద వసూళ్లకు …
Read More »వరదల్లో నష్టపోయిన వాహనదారుల బీమా చెల్లింపులను 15 రోజుల్లో మొత్తం పూర్తి చేయాలి
-బెజవాడకు భవిష్యత్తులో వరద రాకుండా శాశ్వత పరిష్కారం -బుడమేరు వరద నివారణ కు డీపీఆర్ సిద్ధం చేయండి -అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బుడమేరు వరదల్లో దెబ్బతిన్న వాహనదారులకు బీమా చెల్లింపులకు సంబంధించి పెండింగులో ఉన్న దరఖాస్తులను 15 రోజుల్లోపు పూర్తి చేయాలని బీమా సంస్థల ప్రతినిధులను, ప్రభుత్వ అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. రాష్ట్రంలో ఇటీవల వచ్చిన వరదలకు సంబంధించి చేపట్టిన సహాయక చర్యలు, బాధితులకు పంపిణీ చేసిన పరిహారంపై అధికారులతో సచివాలయంలో బుధవారం …
Read More »గవర్నర్ అబ్దుల్ నజీర్ ని కలిసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజ్ భవన్ కు వెళ్లి కలిశారు. తన సతీమణి భువనేశ్వరితో కలిసి రాజ్ భవన్ కు వెళ్లిన చంద్రబాబు..గవర్నర్ దంపతులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవల అస్వస్థకు గురైన గవర్నర్ సతీమణి సమీరా నజీర్ గారి ఆరోగ్య పరిస్థితిని గురించి సీఎం చంద్రబాబు, భువనేశ్వరి అడిగి తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
Read More »