Breaking News

Tag Archives: AMARAVARTHI

ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని కలిసిన హోంమంత్రి అనిత

-రాష్ట్రంలో శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై చర్చ -పాయకరావుపేట నియోజకవర్గ అభివృద్ధి పనులపై చొరవ చూపాలని హోంమంత్రి వినతి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తో హోంమంత్రి వంగలపూడి అనిత మంగళవారం సమావేశమయ్యారు. మంగళగిరిలోని ఉపముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన సమావేశంలో రాష్ట్రంలోని శాంతిభద్రతలు, దీపావళి ముందస్తు భద్రతా ఏర్పాట్లపై ప్రధానంగా చర్చించారు. ఈ సందర్భంగా హోం మంత్రి అనిత మాట్లాడుతూ .. ఎక్కడ ప్రమాదం జరిగినా అప్రమత్తంగా ఉండేలా 185 అగ్నిమాపక స్టేషన్లను ఏర్పాటు చేయడమే …

Read More »

జనగణనతో పాటు బీసీ గణన కూడా చేయాలి

-సీఎం చంద్రబాబుకు బీసీ సంఘాల నేతల వినతి -వరద బాధితులకు రూ.10 లక్షల విరాళం అందజేత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2025 నుండి దేశ వ్యాప్తంగా జరగనున్న జనగణనలో బీసీ జనగణన కూడా చేపట్టాలని బీసీ సంఘాల నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. బీసీ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, ఏపీ అధ్యక్షులు కేసన శంకర్ రావు నేతృత్వంలో బీసీ ప్రతినిధుల బృందం సీఎంను ఉండవల్లి నివాసంలో కలిసి 10 అంశాలతో కూడిన వినతపత్రాన్ని అందించింది. అమరావతి రాజధానిలో …

Read More »

శ్రీసిటీ పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమైన రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రి టి.జి భరత్

-రాష్ట్ర నూతన పారిశ్రామిక విధానం 4.0 పై వివరణ -పారిశ్రామికాభివృద్ధిలో భాగస్వామ్యులు కావాలని పిలుపు శ్రీసిటీ, నేటి పత్రిక ప్రజావార్త : నూతన పారిశ్రామిక విధానంతో రాష్ట్రాన్ని ప్రపంచంలోనే అగ్రగామి పెట్టుబడుల కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లక్ష్యం లో భాగస్వామ్యులు కావాలంటూ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖా మంత్రి టి.జి.భరత్ శ్రీసిటీలోని పరిశ్రమల ప్రతినిధులకు పిలుపునిచ్చారు. మంగళవారం శ్రీసిటీలో పరిశ్రమల ప్రధాన కార్యనిర్వాహకులు (సీఈఓలు), ఇతర ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన, రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన పారిశ్రామిక విధానం-4.0 …

Read More »

ఇంటర్ విద్యార్థిని మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు

-బద్వేల్ ఘటనలో నిందితుడిని వెంటనే శిక్షించేందుకు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా విచారణ -నేరస్తుడికి మరణ శిక్ష స్థాయి శిక్ష పడేలా చూడాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశం -మహిళలపై అఘాయిత్యాలు చేసేవారికి ఈ శిక్ష ఒక హెచ్చరికగా ఉండాలన్న సిఎం చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లా బద్వేల్ లో యువకుడు పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇంటర్ విద్యార్థిని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర విచారం వ్యక్తం …

Read More »

రాజధాని అమరావతికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం

-అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు…కానీ రూ.లక్ష కోట్లవుతాయని పదేపదే గత పాలకుల అబద్ధాలు. -రాష్ట్రాభివృద్ధి కోసమే విజన్ 2047… 420లకు నా విజన్ అర్థంకాదు -విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తాం… -కర్నూలులో హైకోర్టు బెంచ్, పరిశ్రమలు ఏర్పాటుతో అభివృద్ధి చేస్తాం -ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు -అమరావతిలో రాజధాని పున:నిర్మాణ పనులను ప్రారంభించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అమరావతి రాజధానికి మళ్లీ ప్రాణప్రతిష్ట చేశాం. వారసత్వంగా వచ్చిన భూములను భవిష్యత్ తరాల కోసం ఇచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారు, అమరావతి …

Read More »

చంద్రబాబు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం

-రాష్ట్ర్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజధాని అమరావతి పనులు పున:ప్రారంభంపై రాష్ట్ర్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత హర్షం వ్యక్తంచేశారు. సీఎం చంద్రబాబునాయుడు నేతృత్వంలో స్వర్ణాంధ్ర ఆవిష్కృతం కావడం తథ్యమని ఆమె ధీమా వ్యక్తంచేశారు. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఆంధ్రుల కలల రాజధాని అమరావతి అని, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా రాజధాని నిర్మాణంపై ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారన్నారు. …

Read More »

అవినీతిరహిత గ్రామ పాలనకు పెద్ద పీట

-ప్రజలకు సంబంధించిన సమస్యలు వినడానికి నా కార్యాలయ తలుపులు తెరిచే ఉంటాయి -కూటమిలో ఉన్న మనం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి నిలుపుదాం… అందరి నమ్మకాన్ని నిలబెట్టుకొందాం -జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్  -పార్టీ కేంద్ర కార్యాలయంలో పవన్ కళ్యాణ్ సమక్షంలో జనసేన పార్టీలో చేరిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, ఇతర పార్టీల నాయకులు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ‘లంచం అనే మాట వినపడకుండా, ఎవరి నోట పలకని విధంగా పాలనలో మార్పు తీసుకురావాలన్నదే నా ఆకాంక్ష. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి అనేది …

Read More »

సేవా సంస్థలో విష సర్పాలు!

-కోట్లాది రూపాయల ఆస్తుల కోసం మూడు సంస్థల కుయుక్తులు -ప్రశ్నార్థకంగా ‘క్యాంపస్ ఛాలెంజ్’ చిన్నారుల భవిష్యత్తు -చిన్నారుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ విజయనగరం, నేటి పత్రిక ప్రజావార్త : అభాగ్యులైన చిన్నారుల కోసం నిర్వహించబడుతున్న ఓ సేవా సంస్థ మనుగడ ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని సిటిజెన్ ఫోర్స్ ఫౌండేషన్ సీఎండీ పి. రమేష్ బాబు ఆందోళన వ్యక్తం చేశారు. నగరంలోని ఓ హోటల్లో శనివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, జిల్లాలోని పూసపాటిరేగ మండలం కోనాడ జంక్షన్ …

Read More »

భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల

-వివిధ జిల్లాల్లో రోడ్లపై గుంతలు పూడ్చే పనులకు మరో రూ. 290 కోట్లు -టెండర్ ప్రక్రియ పూర్తి చేసి వర్షాలు తగ్గిన వెంటనే పనులు ప్రారంభించాలి -ఆర్.ఓ.బీలపూర్తికి భూసేకరణ కోసం నిధుల విడుదల -రూ.65 వేల కోట్లతో జరుగుతున్న నేషనల్ హైవే పనులను టార్గెట్ పెట్టుకుని పూర్తి చేయాలి -రోడ్లు & భవనాల శాఖ సమీక్షలో అధికారులకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశం అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : భారీ వర్షాలు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు రూ.186 కోట్లు విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి …

Read More »

ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళికను వేగవంతంగా అమలుచేయండి : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో 100 రోజుల కార్యాచరణ ప్రణాళిక కింద ఆర్ధికేతర మరియు స్వల్ప కాలంలో పరిష్కరించ గలిగిన అంశాలను వేగవంతంగా పూర్తి చేసేందుకు వెంటనే ఆయాశాఖలు తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ ఆదేశించారు.100 రోజుల కార్యాచరణ ప్రణాళిక అమలుపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో వైద్య,ఆరోగ్య, హోం, జిఏడి, న్యాయ, దేవాదాయ ధర్మాదాయ, ప్రణాళిక, ఎక్సైజ్, జల వనరులు, మైన్స్ అండ్ జియాలజీ, ఇంధన, వ్యవసాయ, సహకార, పశుసంవర్ధక, …

Read More »