అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర అల్పపీడనంగా మారింది. ఇది ఉత్తర దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరాల్లో సోమవారం నాటికి వాయుగుండంగా మారనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత మూడు రోజుల్లో పశ్చిమ వాయవ్య దిశగా కదులుతూ ఉత్తర ఒడిశా, ఝార్ఖండ్, ఉత్తర ఛత్తీస్ గఢ్ మీదుగా ప్రయాణించే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు, ఆది, సోమవారాల్లో కోస్తా జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని …
Read More »Tag Archives: AMARAVARTHI
విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు
-మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ప్రశంస -ముంపు గ్రామాల్లో రూ 5 కోట్లతో సిమెంట్ రోడ్లు నిర్మిస్తాం -అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ -దక్షిణ చిరువోలులంక వరద బాధితులకు టీడీపీ ఎన్నారై బొబ్బా గోవర్ధన్ సహాయంతో మధ్యాహ్న భోజనం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విపత్తును ఎదుర్కోవటంలో సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు అని మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ అన్నారు. శనివారం అవనిగడ్డ మండలం రామచంద్రాపురం పాలిటెక్నిక్ కళాశాలలో పునరావాసం పొందుతున్న దక్షిణ చిరువోలులంక వరద బాధితులను మాజీ ఎంపీ నారాయణ, అవనిగడ్డ …
Read More »7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటన
-ప్రజలను ఆదుకుంటామని భరోసా కల్పించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 7వ రోజు వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించి ప్రజలను ఆదుకుంటామని భరోసానిచ్చారు. శనివారం విజయవాడలోని భవానీపురం, సితార సెంటర్, చిట్టి నగర్, ఎర్రకట్ట, మ్యాంగో మార్కెట్, సింగ్ నగర్ తదితర వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు. బాధిత ప్రజల కష్టాలను స్వయంగా పరిశీలించారు. నీటి ప్రవాహాలు చూసారు. సింగ్ నగర్ లో వరద నీరు తగ్గకపోవడంతో ప్రొక్లెయినర్ ఎక్కి మారుమూల ముంపు ప్రాంతాలకు వెళ్లి ప్రజలతో …
Read More »సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుంటున్నాం..
– డిజిటల్ సాధికారతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తాం – ప్రజాభిప్రాయం ఆధారంగా మరింత మెరుగైన సేవలు. – పెద్దఎత్తున పారిశుద్ధ్య కార్యక్రమాలు జరుగుతున్నాయి. – 7,100 మంది రాత్రింబవళ్లు పనిచేస్తున్నారు. – అంటు వ్యాధులు ప్రబలకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నాం. – ఉచితంగా బస్సు సర్వీసులను నడుపుతున్నాం. – 6 వస్తువుల నిత్యవసర సరుకుల ప్యాకేజీ ప్రతిఒక్కరి హక్కు. – వరద ప్రభావిత ప్రజలు గట్టిగా అడిగి తీసుకోండి – ఏ పనిచేసినా ఒక పద్ధతి ప్రకారం చేస్తాననే పేరు నాకుంది – సాయమందించడం సమష్టి …
Read More »బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ వ్యూ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ముంపు ప్రాంతాల్లో ఏరియల్ పర్యటన జరిపారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి హెలికాఫ్టర్ ద్వారా బయలుదేరి ముంపు ప్రాంతాలను పరిశీలించారు. మధ్యాహ్నం 2.15 గంటల నుంచి గంటన్నరపాటు ముఖ్యమంత్రి ఆయా ప్రాంతాలను పరిశీలించారు. ముందుగా బుడమేరు డ్రైన్ కు గండ్లు పడిన ప్రాంతాలను పరిశీలించారు. భారీ వరద, గండ్లు కారణంగా ఏయే ప్రాంతాలు నీటమునిగాయి అనేది పరిశీలించారు. బుడమేరు ప్రవాహాలు, వరద ఎటునుంచి ఎటు వెళ్తుంది అనేది పరిశీలించారు. …
Read More »పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహించిన రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : పర్యావరణ పరిరక్షణలో భాగంగా రాష్ట్ర శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలుగు రాష్ట్ర ప్రజలకు పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి పూజను ప్రోత్సహిస్తూ, ఎక్స్‌లో పోస్ట్ చేశారు. “మట్టిలో పరమాత్మను దర్శించే అద్భుతమైన తత్వదర్శనం, యోగదర్శనం పార్థివ గణపతి పూజలో ఉన్నది గనుక . వినాయక చవితికి గణపతిని మట్టితో తయారు చేయాలని పురాణాది శాస్త్రాలు సూచిస్తున్నాయి. అలాగే, ప్రజలకు పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించడంలో భాగస్వాములు కావాలని విజ్ఞప్తి చేశారు. “కావున, …
Read More »విజయవాడ వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించిన రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్
-వరద బాధితులు అందరినీ ప్రభుత్వం ఆదుకుంటుంది -చంద్రబాబు నేతృత్వంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ముమ్మర చర్యలు -అవివేకంతోనే జగన్ అర్థంపర్థం లేని ఆరోపణలు -వరద బీభత్సాన్ని కేంద్ర బృందం స్వయంగా పరిశీలించింది అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో బుడమేరు ఉగ్రరూపంతో ముంపుకు గురై తీవ్ర నష్టాన్ని చవిచూసిన బాధితులందరినీ ప్రభుత్వం ఆదుకుంటుందని రాష్ట్ర న్యాయ,మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎం డి ఫరూక్ భరోసా ఇచ్చారు. శుక్రవారం అజిత్ సింగ్ నగర్ లో వరద బీభత్సంతో ఐదవ రోజు కూడా …
Read More »అడవుల విధ్వంసానికి పాల్పడితే కఠిన చర్యలు..
-దేవరపల్లి, మారేడుమిల్లి ఘటనల్లో ఇప్పటికే అధికారుల సస్పెండ్.. -నిష్పక్షపాతంగా విచారణ.. తుది నివేదిక రాగానే చర్యలు.. -చిరంజీవ్ చౌదరి, ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అటవీశాఖపై మీడియాలో వస్తున్న వార్తలకు ప్రిన్సిపల్ ఛీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ చిరంజీవ్ చౌదరి స్పందించారు. 22.02.2024న PCCF & HOFF జారీ చేసిన సూచనల ప్రకారం, DFO, ఫ్లయింగ్ స్క్వాడ్, రాజమండ్రి వారు తన బృందంతో కలిసి 28.02.2024 నుండి 07.03.2024 వరకు రంపచోడవరం డివిజన్ లో నిర్దిష్ట …
Read More »ఆకస్మిక వరదలు, భారీ వర్షాలతో తీవ్ర నష్టం
-కేంద్రం సంపూర్ణ సహకారాన్ని అందించేందుకు సిద్ధంగా ఉంది -విపత్తును ఎదుర్కోవడంలో ప్రభుత్వం సమర్థవంతంగా పని చేసింది. -వరద సహాయక చర్యల్లో ముఖ్యమంత్రి, ఆయన బృందం అవిశ్రాంతంగా పని చేసింది -కేంద్రం తెచ్చిన ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన గత ప్రభుత్వం నిర్వీర్యం చేసింది -రాష్ట్ర ప్రభుత్వం ముందున్న ఆర్థిక కష్టాలు మాకు తెలుసు -ప్రధానమంత్రి, హోం మంత్రితో చర్చించి రాష్ట్రానికి న్యాయం చేస్తాం -కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ -కేంద్ర మంత్రికి ఆకస్మిక వరదలు, భారీ వర్షాల వల్ల జరిగిన …
Read More »బుడమేరు ముంపు ప్రాంతాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన
-గండ్లుపడిన ప్రాంతాలను పరిశీలించిన సీఎం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుడమేరు వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించారు. ఉదయం కలెక్టరేట్ లో వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు సిఎంను కలిసి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ఇచ్చారు. వారి నుంచి విరాళాలు తీసుకున్న అనంతరం సిఎం ఎనికేపాడు వెళ్లారు. అక్కడ నుంచి పొలాల మీదుగా ప్రయాణించి రైవస్ కాలువ, ఏలూరు కాలువ దాటి వెళ్లి బుడమేరు మంపు ప్రాంతాన్ని పరిశీలించారు. ఏలూరు కాలువపై పంటుపై ప్రయాణించి అవతలి …
Read More »