Breaking News

నీటి సంరక్షణకు ‘జలధార’ ఉద్యమం

  • రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత
  • రాష్ట్ర వ్యాప్తంగా వంద రోజుల కార్యాచరణ
  • కాలువలు, చెరువుల్లో పూడికతీతలు, మరమ్మతులు
  • ప్రతి ఎకరాకూ నీరందిస్తాం
  • నీటి బొట్టుతో సంపద సృష్టి.. ఇదే చంద్రబాబు లక్ష్యం
  • అమరావతిపై విషం కక్కుతున్న జగన్
  • ఇది తప్పు అన్నందుకు పెట్రేగిపోతున్న జగన్ బ్యాచ్
  • మీడియా సంస్థలు, ప్రజలపై వైసీపీ దాడులు గర్హనీయం
  • చూస్తూ ఊరుకునేది లేదు : మంత్రి సవిత హెచ్చరిక
  • శ్రీసత్యసాయి జిల్లా చాలకూరులో జలధార కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సవిత
  • మహిళా రైతు కూలీలతో కలిసి వేరుశనగ పంటను వెలికితీసిన మంత్రి సవిత

సోమందేపల్లి/శ్రీసత్యసాయి, నేటి పత్రిక ప్రజా :
నీటితోనే సంపద సృష్టించొచ్చాలనేది సీఎం చంద్రబాబు సంకల్పమని, అందుకనే ప్రతి నీటి బొట్టునూ సద్వినియోగం చేసుకోవాలన్న లక్ష్యంతో జలధార కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీత, మరమ్మతులు, ఇంకుడు గుంతల నిర్మాణం వంటి పనులను ఈ కార్యక్రమంలో చేపట్టనున్నారు. రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలకు రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో కలిసి వంద రోజుల ప్రణాళికలను రూపొందించారన్నారు. శ్రీసత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం చాలకూరు గ్రామం సమీపంలోని చెరువులో సోమవారం ఏర్పాటు చేసిన జలధార కార్యక్రమంలో మంత్రి సవిత పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రంలో నీటి సంరక్షణకు పెద్ద ఎత్తు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా నీటి సంరక్షణకు 100 రోజుల పాటు జలధార ప్రత్యేక కార్యక్రమానికి శ్రీకారం చుట్టారన్నారు. ఈ కార్యాచరణ ద్వారా రాష్ట్రంలో నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపుదలతో ప్రతి ఎకరాకూ సాగునీరందించాలన్నది ప్రధాన ఉద్దేశమన్నారు. వంద రోజుల పాటు సాగే ఈ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చెరువులు, సాగునీటి కాలువల్లో పూడికతీతలతో పాటు మరమ్మతులు, ఇంకుడు గుంతలు తవ్వుతామన్నారు. ప్రతి నీటి బొట్టునూ ఒడిసిపట్టి, భూగర్భ జలాలను పెంచడం, తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే విధానాన్ని (డ్రిప్ ఇరిగేషన్) ప్రోత్సహించడం, చెరువుల్లోని మట్టిని పొలాలకు తరలించడం, పంట కుంటల నిర్మించడం వంటి కార్యక్రమాలను చేపడుతున్నామన్నారు. నీటి సంరక్షణను ఉద్యమం చేపట్టామని, రైతులు, సాగునీటి సంఘాల భాగస్వామ్యంతో నీటి సంరక్షణ ఉద్యమం చేపట్టామన్నారు. రాష్ట్రాన్ని కరవు రహిత ప్రాంతంగా తీర్చిదిద్దాలన్నదే కూటమి ప్రభుత్వం ప్రధాన ఉద్దేశమన్నారు.

పెట్రేగిపోతున్న వైసీపీ బ్యాచ్
అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంట్ ఆమోదించడం, ఆ వెంటనే రాష్ట్రపతి గెజిట్ నోటిఫికేషన్ విడుదల కావడంతో జగన్, ఆయన పార్టీ నేతలు సహించలేకపోతున్నారని మంత్రి సవిత మండిపడ్డారు. మావిగన్ అంటూ అమరావతిపై జగన్ మరోసారి విషం కక్కారన్నారు. రాజధానిపై పూటకో మాట, గంటకో మాట ఆడుతుండడంతో ప్రజలు జగన్ పై తీవ్రంగా విరుచుకుపడుతున్నారన్నారు. అమరావతిపై కుట్రలు పన్నడం తప్పు అని చెప్పడంతో, వైసీపీ బ్యాచ్ సహించలేకపోతోందన్నారు. మీడియా సంస్థలపైనా, ప్రజలపైనా దాడులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రజాభీష్టానికి అనుగుణంగా వ్యవహరించాల్సిందేపోయి, జగన్, ఆయన అనుచరులు చేస్తున్న దౌర్జన్యాలను, దాడులను చూస్తూ ఊరుకునేది లేదని మంత్రి సవిత హెచ్చరించారు.

వేరుశెనగ రైతులతో ముచ్చట
జలధార కార్యక్రమం అనంతరం చెరువు పక్కనే ఉన్న వేరు శనగ పంట భూములను మంత్రి సవిత పరిశీలించారు. ఎంతమేర సాగు చేశారు… పంట దిగుబడి గురించి రైతులను అడిగి తెలుసుకున్నారు. రైతుల సంక్షేమానికి సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించేలా చర్యలు తీసుకొంటున్నారన్నారు. అన్నదాత సుఖీభవ నిధులతో డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు అందజేస్తున్నారన్నారు. రూ.30 వేల కోట్లతో రాయలసీమను హార్టీకల్చర్ హబ్ గా అభివృద్ధి చేస్తున్నారని, రాయసీమలో సాగునీటి ప్రాజెక్టులకు నిధులు వెచ్చిస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. కూటమి ప్రభుత్వ పాలనపై రైతులు సంతృప్తి వక్తంచేయడంతో మంత్రి ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *