Breaking News

కాంట్రాక్ట‌రు క్యాంపు సైటుల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌లు క‌ట్టుదిట్టం చేయండి

అమరావతి, నేటి పత్రిక ప్రజా వార్త :
రాజ‌ధాని అమ‌రావ‌తిలో నిర్మాణ ప‌నులు చేప‌డుతున్న గుత్తేదారు క్యాంపు సైటుల్లో భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను క‌ట్టుదిట్టం చేయాల‌ని అమ‌రావ‌తి అభివృద్ధి సంస్థ‌(ఏడీసీ) ఛైర్‌ప‌ర్స‌న్ మ‌రియు మేనేజింగ్ డైరెక్ట‌ర్ శ్రీ‌మ‌తి డి.ల‌క్ష్మీపార్థ‌సార‌థి వారు ఆదేశాలు జారీచేశారు. తుళ్లూరు ఆర్వీఆర్ క్యాంపు సైటు వ‌ద్ద ఆదివారం ట్రాలీ లారీలో జ‌రిగిన అగ్నిప్ర‌మాద స్థ‌లాన్ని ఆమె సోమవారం అధికారుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. ఆర్వీఆర్ ప‌నుల కోసం యంత్రాన్ని తీసుకువ‌చ్చిన ట్రాలీ లారీని దిగుమ‌తి అయిన వెంట‌నే ఎందుకు పంపించివేయాల‌ని సంబంధిత గుత్తేదారుల‌ను ప్ర‌శ్నించారు. గుత్తేదారు క్యాంపు సైటులలో క‌నీస భ‌ద్ర‌తా చ‌ర్య‌లు చేప‌ట్టక‌పోవ‌టం ప‌ట్ల ఆమె ఒకింత ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. స‌మ‌ర్థులైన కాప‌లా సిబ్బందిని నియ‌మించ‌క‌పోవ‌టం వ‌ల్లే అనుకోని సంఘ‌ట‌నలు జ‌రుగుతున్నాయ‌న్నారు. సీసీ కెమోరాల నిఘాలో క్యాంపు సైటులు ఉండాల‌న్నారు. ఎండాకాలంలో తీసుకోవాల్సిన భ‌ద్ర‌తా చ‌ర్య‌ల‌ను గుత్తేదారు సంస్థ‌లు తీసుకునేలా ఎప్ప‌టిక‌ప్పుడు ప‌ర్య‌వేక్షించాల‌ని ఏడీసీ ఛీఫ్ ఇంజినీర్లు బి.న‌ర‌సింహ‌మూర్తి, సీహెచ్‌.ధ‌నుంజ‌య‌ల‌ను ఆదేశించారు. అధిక సామ‌ర్థ్యం క‌లిడిన వాట‌ర్ మోటార్ల‌ను క్యాంపు సైటుల్లో ఏర్పాటు చేసి ప్ర‌మాదాల‌కు తావులేకుండా జాగ్ర‌త్త‌లు తీస‌కోవాల‌ని అధికారుల‌కు ఆమె ఆదేశాలు జారీచేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఆర్టీజీఎస్ సీసీటీవీ360… న‌మ్మికైన నేస్తం

-ప్ర‌జ‌ల భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తున్న స‌ర్వైలెన్సు వ్య‌వస్థ‌ -రోజుల వ్య‌వ‌ధిలోనే ముగ్గురు బాల‌ల ఆచూకీ క‌నుగొన్న సీసీకెమెరాలు -య‌ల‌మంచిలిలో ఇద్ద‌రు, …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *