Breaking News

సమాజంలో మార్పు జర్నలిస్టులతోనే సాధ్యం

– హెచ్ ఆర్ టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు

విజయవాడ, ఏప్రిల్ 7: సమాజంలో మార్పు తేవటం జర్నలిస్టులకే సాధ్యమని హెచ్ఆర్టి గ్రూప్ చైర్మన్ తొండెపు హనుమంతరావు అన్నారు. ఏపీయూడబ్ల్యూజే అనుబంధ విజయవాడ ప్రెస్ క్లబ్ ఆధునికీకరణకు ఇతోధికం గా సాయం చేసిన హనుమంతరావు గారిని మంగళవారం యూనియన్ నేతలు మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఆయన వెంట తొండెపు శ్రీనివాస్ ఉన్నారు ఈ సందర్భంగా హనుమంతరావు మాట్లాడుతూ సమాజంలో జరుగుతున్న మార్పులను పసిగట్టి అధ్యయనం చేసి ప్రజల పక్షాన నిలబడుతున్నది మీడియా మాత్రమే అని కొనియాడారు. సానుకూల దృక్పథంతో ప్రతి ఒక్కరూ ముందుకెళ్ళినప్పుడే అభివృద్ధి సాధ్యమంటూ అమరావతి రాజధాని నిర్మాణ పనులపై తన ఉద్దేశాన్ని తెలియజేస్తూ వ్యాఖ్య చేశారు. కాలానుగుణంగా జరుగుతున్న మార్పులపై మాట్లాడారు. అనంతరం యూనియన్ నేతలు ఆయనకు చిరు సత్కారం చేశారు.
కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు అధ్యక్షుడు చావా రవి, కార్యదర్శి దారం వెంకటేశ్వరరావు, సీనియర్ జర్నలిస్ట్ ఎస్ కే బాబు, సామ్నా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, యూనియన్ నేతలు జీ రఘురాం, శివరామకృష్ణ, శ్రీనివాస్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు

-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *