అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఎస్.ఎస్.సి స్పాట్ వాల్యుయేషన్ నందు ఈ సంవత్సరం ప్రవేశపెట్టిన ట్యాబ్ ఆధారిత మూల్యాంకన విధానంలో ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆ సమస్యలను పరిష్కరించాలని రాష్ట్రోపాధ్యాయ సంఘం ఆం.ప్ర. రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, లంకలపల్లి సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ట్యాబ్ ఆధారిత మూల్యాంకనంలో అనేక సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయని, దీనివలన మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమై ఉపాధ్యాయులు రాత్రి 9, 10 గంటల వరకు స్పాట్ కేంద్రంలో గడపవలసి వస్తుందని తెలిపారు. నాణ్యమైన ట్యాబ్ లను అందించి, వేగవంతమైన నెట్వర్క్ సదుపాయం కల్పించినప్పుడే ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం విజయవంతమవుతుందని తెలిపారు. కనుక ఈ సంవత్సరం ట్యాబ్ ఆధారిత మూల్యాంకనం రద్దు చేయాలని లేదా పైలెట్ ప్రాజెక్టుగా ఒకటి రెండు సబ్జెక్టులకు మాత్రమే పరిమితం చేయాలని, స్పెషల్ అసిస్టెంట్ల పని భారం తగ్గించి వారికి చెల్లించే రెమ్యూనరేషన్ పెంచాలని, స్పెషల్ అసిస్టెంట్లను అదనంగా నియమించి ట్యాబ్ ఆధారిత మార్కుల నమోదుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి మూల్యాంకన కేంద్రాలలోని సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.
Tags AMARAVARTHI
Check Also
36 ఏళ్ల స్టీల్ ప్లాంట్ చరిత్రలో ఇలాంటి ఘటన జరగలేదు
-బాధిత కుటుంబాలకు అండగా ఉంటాం -మృతుల కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం -కుటుంబంలో ఒకరికి ప్లాంట్ లో …
Prajavartha Online Telugu News