విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంట్రల్ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బోండా ఉమా ఆశీస్సులతో ఈరోజు డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అంచ కోదండపాణి కుమార్తె అంచా సాహితీ నాయుడు పుట్టినరోజు సందర్భంగా మన డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వెంకటాయపాలెం వెళ్లే రూటు నారా లోకేష్ ఏరియా లో ఈరోజు అన్నదాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో అధ్యక్షురాలు సంసాని విజయలక్ష్మి, ఉపాధ్యక్షురాలు గుబ్బల జ్యోతిశ్వరి, కోశాధికారి యర్రపు అభిలాష్, కార్యదర్శి సంసాని హేమ లక్ష్మి, నేను చేసే ప్రతి కార్యక్రమంలో నాకు తోడుగా ఉండి ముందుకు నడుస్తున్న వీళ్ళకి మమ్మల్ని నమ్మి వాళ్ళ పాప పుట్టినరోజుని మన డొక్కా సీతమ్మ ట్రస్ట్ ఆధ్వర్యంలో నడిపించిన అంచ కోదండపాణి గారికి డొక్కా సీతమ్మ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు, టిడిపి సెంట్రల్ మహిళా అధికార ప్రతినిధి అవుటుపల్లి విజయ కుమారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.
Prajavartha Online Telugu News