అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు కృషోన్నతి యోజన కింద వ్యవసాయ,అనుబంధ రంకాల్లోని పధకాలన్నిటినీ ఒకే గొడుగు కిందకు తెచ్చి అమలు చేసేందుకు సంబంధించి కన్సాలిడేటెడ్ వార్షిక కార్యాచరణ ప్రణాళిక-2024-25 అమలుపై రాష్ట్ర స్థాయి సాంక్షనింగ్ కమిటీ సమావేశం బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి అధ్యక్షతన జరిగింది.రాష్ట్రీయ కృషి వికాసయోజన, కృషోన్నతి యోజన కింద 2024-25లో వార్షిక కార్యాచరణ ప్రణాళిక కింద 1193 కోట్ల రూపాయల కేంద్ర,రాష్ట్రాల ప్రభుత్వాల …
Read More »Tag Archives: AMARAVARTHI
త్వరలో భారత్‌లో ఎయిర్ టాక్సీ సేవలు
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఏవియేషన్ స్టార్టప్ జాబీ ప్రపంచంలో మొట్టమొదటి ఎయిర్ టాక్సీని ప్రారంభించబోతోంది. కంపెనీ 2025 నాటికి దుబాయ్‌లో ఫ్లయింగ్ టాక్సీ సర్వీస్‌ను ప్రారంభించనుంది. మరోవైపు ఇంట్‌గ్లోబ్ ఏవియేషన్స్, ఆర్చర్ ఏవియేషన్ సంయుక్తంగా దేశంలో ఎయిర్ టాక్సీ సేవలను ప్రారంభిస్తున్నాయి. ఢిల్లీలో ఎయిర్ టాక్సీ సర్వీస్ 2026 నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ముంబై, బెంగళూరులో కూడా ప్రారంభించే యోచనలో ఉంది.
Read More »ఉపాధిహామీ,స్వచ్ఛభారత్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్లు నిర్మాణం చేయాలి
-ఇసి అనుమతితో ఉపాధి హామీ పనులను పెద్దఎత్తున చేపట్టండి -ఉపాధి హామీ పనుల్లో వాటర్ కన్జర్వేషన్ పనులకు అధిక ప్రాధాన్యతనివ్వాలి -తాగునీరు,విద్యుత్ సరఫరా సమస్యలు తలెత్తితే తక్షణం పరిష్కరించండి -సిఎస్ డా.కెఎస్.జవహర్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉపాధిహామీ,స్వచ్చ భారత మిషన్ అనుసంధానంతో వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం పెద్దఎత్తున చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి జిల్లా కలక్టర్లను ఆదేశించారు.తాగునీరు,ఉపాధి హామీ పనులు,విద్యుత్ సరఫరా పరిస్థితులపై మంగళవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో …
Read More »మహిళలపై దాడుల సంస్కృతిని ఖండించాలి… : గజ్జల వెంకటలక్ష్మి
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాజకీయాల్లో ముందెన్నడూ లేనివిధంగా తమకు ఓట్లేయలేదనే కక్షతో మహిళలపై దాడులకు దిగిన సంస్కృతిని ప్రతీ ఒక్కరూ ఖండించాలని గజ్జల వెంకటలక్ష్మి చైర్పర్సన్ మహిళా కమిషన్ అన్నారు. పల్నాడు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన ఎస్సీ, బీసీ మహిళలు తమపై జరిగిన దాడిని మహిళా కమిషన్ దృష్టికి ఫిర్యాదు రూపంలో తీసుకురావడం జరిగిందన్నారు. ఈ ఘటనపై మహిళా కమిషన్ చైర్ పర్సన్ గజ్జల వెంకటలక్ష్మి స్పందించారు. బాధితులకు రక్షణ కల్పించాలని, నిందితులకు కఠిన శిక్షలు పడేలా చర్యలు …
Read More »అరుణాచలేశ్వరుని సేవలో మంత్రి ఆర్.కె.రోజా!
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : గిరిప్రదక్షిణ చేసుకొని అరుణాచలేశ్వరుని మంత్రి ఆర్.కె.రోజా దర్శించుకున్నారు. పేదలకు ప్రేమతో సేవ చేసే వారికెప్పుడూ భగవంతుడు తోడుగా ఉంటాడు! అరుణాచలేశ్వరుని ఆశీస్సులతో జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని నేను మళ్ళీ మూడవ సారి ఎమ్మెల్యేగా గెలిచి “హ్యాట్రిక్” సాధించి ప్రజలకు మరింత సేవ చేసే అవకాశాన్ని కలిగించాలని కోరుకొన్నాను!నాలుగేళ్ళుగా నగరిలో నాపై కోవర్టులతో కలిసి కుట్రలు చేశారు, దుష్ప్రచారం చేశారు.. కానీ అభివృద్దే లక్ష్యంగా పనిచేశాను! జనం నాకు అండగా నిలిచారు! నా విజయానికి వెన్నుదన్నుగా నిలిచారు! …
Read More »తెలంగాణ ఎప్‌సెట్‌లో ఏపీ విద్యార్థులు టాప్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : తెలంగాణ ఎప్‌సెట్-2024లో ఏపీ విద్యార్థులు సత్తా చాటారు. ఇంజినీరింగ్ విభాగంలో సతివాడ జ్యోతిరాదిత్య (పాలకొండ), గొల్లలేఖ హర్ష (కర్నూలు), మురసాని సాయియశ్వంత్ రెడ్డి (కర్నూలు), పుట్టి కుషాల్‌కుమార్ (అనంతపురం), ధనుకొండ శ్రీనిధి (విజయనగరం) టాప్-10లో ఉన్నారు. అగ్రికల్చర్-ఫార్మసీ విభాగంలో అలూరు ప్రణీత (మదనపల్లి), నాగుదాసరి రాధాకృష్ణ (విజయనగరం), సోంపల్లి సాకేత్ రాఘవ (చిత్తూరు) టాప్-10లో ఉన్నారు.
Read More »‘వరల్డ్ టెలీకమ్యూనికేషన్ & ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం 2024
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) స్థాపన & 1865లోని మొట్టమొదటి అంతర్జాతీయ టెలిగ్రాఫ్ కన్వెన్షన్ ఒప్పందానికి గుర్తుగా, ప్రతి సంవత్సరం మే 17న ‘వరల్డ్ టెలికమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ సొసైటీ’ దినోత్సవం నిర్వహిస్తారు. ఈ సంవత్సరం నేపథ్యాంశం ‘సుస్థిరాభివృద్ధి కోసం డిజిటల్ ఆవిష్కరణ’. స్థిరమైన అభివృద్ధి సాధించడంలో, డిజిటల్ అంతరాలను తగ్గించడంలో టెలికమ్యూనికేషన్స్, సమాచార సాంకేతికతలు పోషించే కీలక పాత్రను ఇది చాటి చెబుతుంది. కేంద్ర కమ్యూనికేషన్స్ మంత్రిత్వ శాఖ పరిధిలోని టెలికమ్యూనికేషన్స్ విభాగానికి చెందిన క్షేత్రస్థాయి …
Read More »సీమ చింత కాయ
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీమ చింత (గుబ్బ కాయలు) లేదా పిథెసెల్లోబియం డుల్సే (శాస్త్రీయ నామం) లేదా కికార్ (రాజస్థాన్‌లో పిలుస్తారు) అనేది మైమోజేసీ కుటుంబానికి చెందిన చెట్టు. దీని ఫలములు చూడుటకు చింతకాయలవలె ఉంటాయి. ఇది ఇంగ్లీషు వారి నుండి దిగుబడి అయినదిగా భావిస్తుండుట వలన దీనిని సీమచింతగా వ్యవహరిస్తారు. దీని కాయలు నల్లని రంగుకల గింజలు కలిగి ఉంటాయి.. నల్లని గింజల చుట్టూ ఉండే తెల్లని తియ్యటి పప్పు ను అందరూ ఇష్టంగా తింటారు. ఆంగ్లంలో ఈ ముళ్ళ …
Read More »ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్:స్పెషల్ సియస్ ఎం.టి.కృష్ణ బాబు
-వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా ప్రతిజ్ఞ చేయించిన కృష్ణ బాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : “ప్రజలలో ఆరోగ్యకరమైన అలవాట్లపై అవగాహన పెంపోందించి వారిలో హైపర్టెన్షన్ (రక్తపోటు) నివారణకు కృషి చేస్తాం” అని వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖాధిపతులు , అధికారులు, వైద్య నిపుణులతో స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎం.టి.కృష్ణ బాబు ప్రతిజ్ఞ చేయించారు. మంగళగిరి ఎపిఐఐసి భవనంలోని 6 వ ఫ్లోర్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆరోగ్యకరమైన అలవాట్లతో హైపర్టెన్షన్ కు చెక్ పెట్టొచ్చని ఈ సందర్భంగా …
Read More »వైద్య కళాశాలల్లో 29మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : వైద్య విద్యా డైరెక్టరేట్(DME) ఆధ్వర్యంలో వైద్య కళాశాలల్లో ఖాళీగా ఉన్న 29 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సభ్య కార్యదర్శి ఎం. శ్రీనివాసరావు నేడొక ప్రకటనలో తెలిపారు. శాశ్వత ప్రాతిపదికన (Regular Basis) డైరెక్ట్ మరియు లేటరల్ ఎంట్రీ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనున్నట్టు ఆయన తెలిపారు. ఫేజ్ -2 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో బ్రాడ్ స్పెషాలిటీలలో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తామని పేర్కొన్నారు. …
Read More »