Breaking News

Tag Archives: AMARAVARTHI

సార్వత్రిక ఎన్నికలకు పటిష్టమైన ఏర్పాట్లు చేయాలి

-జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించిన సి.ఇ.ఓ. ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో త్వరలో జరుగనున్న సార్వత్రిక ఎన్నికలను పటిష్టంగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా జిల్లా ఎన్నికల అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో ఆయన మీడియో కాన్పరెన్సు నిర్వహించి ఎన్నికల సంసిద్దత, ఓటర్ల జాబితా నవీకరణకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఈ సందర్బంగా ఆయన …

Read More »

మహిళలకు సాధికారత కల్పించింది జగనన్న ప్రభుత్వమే : హోంమంత్రి తానేటి వనిత

-ద్వారకా తిరుమల మండల స్థాయి వైఎస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న హోంమంత్రి ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ప్రతి సంక్షేమ కార్యక్రమం మహిళల పేరు మీదనే ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ముఖ్యమంత్రి మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తున్నారని హోంమంత్రి, విపత్తు నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత అన్నారు. ఏలూరు జిల్లా గోపాలపురం నియోజకవర్గం ద్వారకా తిరుమల మండలాల్లో నాలుగో విడత వైఎస్సార్ ఆసరా సంబరాలు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఆమె పాల్గొన్నారు. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా …

Read More »

మాది మహిళా పక్షపాత ప్రభుత్వం : హోంమంత్రి తానేటి వనిత

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : తమది మహిళా పక్షపాత ప్రభుత్వమని, తల్లి కడుపులోని బిడ్డ నుండి వృద్ధురాలి వరకు అనేక సంక్షేమ పథకాల ద్వారా లబ్ది చేకూరుతోందని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. శుక్రవారం నల్లజర్లలో జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాల నందు జరిగిన మండల స్థాయి వైఎస్సార్ ఆసరా సంబరాల్లో ఆమె ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. మండలంలో 1621 డ్వాక్రా గ్రూపులకు 16208 మంది డ్వాక్రా మహిళలకు 15 కోట్ల 38 లక్షల …

Read More »

రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌.జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో తీసుకున్న పలు కీలక నిర్ణయాలను అమరావతి సచివాలయం పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులకు వివరించిన రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలు, బి.సి.సంక్షేమం మరియు సినిమాటోగ్రపీ శాఖ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాల కృష్ణ… 1. మహిళా సాధికారతకు, స్వావలంబనకు వెన్నుదన్నుగా నిలుస్తూ… ఫిబ్రవరి 16 నుంచి నాలుగో విడత వైఎస్సార్‌ చేయూత కార్యక్రమం. ఫిబ్రవరి 16 నుంచి రెండు వారాలపాటు జరగనున్న …

Read More »

దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఎన్నికలు నిర్వహిస్తాం…

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : 2024 సార్వత్రిక ఎన్నికలు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనా పేర్కొన్నారు. దివ్యాంగులు అందరికీ ఓటు హక్కు ఉండాలి, వారు సానుకూల వాతావరణంలో ఓటు వేసేందుకు అన్ని వసతులు ఉండాలి అనే నినాదంతో ఎన్నికల కమిషన్ పని చేస్తోందన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ వద్దా ర్యాంపులు ఏర్పాటు చేసే ప్రక్రియ తుది దశకు చేరుకుందన్నారు. ‘హోమ్ ఓటింగ్’ …

Read More »

వర్కుషాపు రహదారి ప్రమాదాల క్లెయిమ్ ల-లీగల్ పెరస్పెక్టివ్ బెస్టు ప్రాక్టీసెస్ పై అవగాహన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రహదారి ప్రమాదాల క్లెయిమ్ లు పరిష్కారంలో లీగల్ పెరస్పెక్టివ్ మరియు బెస్ట్ ప్రాక్టీసులకు సంబంధించి సుప్రీం కోర్టు గోహర్ మహ్మద్ వర్సెస్ ఉత్తరప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ,ఇతరుల విషయంలో ఇచ్చిన తీర్పుపై స్టేకు హోల్టర్లకు అవగాహన కల్పించేందుకు మంగళవారం కరకట్ట రోడ్డులో మంతెన సత్యనారాయణ ఆశ్రమాన్నిఆనుకుని గల చిగురు చిలడ్రన్స్ విలేజ్ లో ఏర్పాటు చేసిన వర్కు షాపును ఎపి స్టేట్ లీగల్ సర్వీసెస్ అధారిటి ఎగ్జిక్యూటివ్ చైర్మన్ మరియు రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎవి.శేషసాయి …

Read More »

ప్రజలకు మేలైన సేవలు అందించండి :  అధికారులకు హోం మంత్రి తానేటి వనిత ఆదేశం

ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు అందరూ బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర హోంమంత్రి, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ద్వారకాతిరుమలలో కళ్యాణ మండపంలో మంగళవారం మండలం మండల స్థాయి అధికారులు, సచివాలయ సిబ్బంది, నాయకులతో హోంమంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ సమస్యలపై సత్వరమే చర్యలు తీసుకునేలా అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భం గా హోం మంత్రి తానేటి వనిత మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలోనూ …

Read More »

మీ కుటుంబానికి మంచి జరిగితేనే మళ్లీ ఆశీర్వదించండన్న ఏకైక ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి : హోంమంత్రి తానేటి వనిత

ద్వారకా తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : జగనన్న ప్రభుత్వ పాలనలో మీకు గానీ, మీ కుటుంబంలో గానీ ఎవరికైనా మంచి జరిగిందని అనుకుంటేనే మళ్లీ తమ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని ధైర్యంగా చెప్పిన దమ్మున్న ఏకైక నాయకుడు ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. మంగళవారం ద్వారకా తిరుమల లో కాపు కళ్యాణ మండపంలో నిర్వహించిన ద్వారకా తిరుమల మండలం వైఎస్సార్సీపీ ఆత్మీయ సమావేశానికి హోంమంత్రి అధ్యక్షత …

Read More »

వైసీపీలో కొత్త హుషారు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాబోయే ఎన్నికల దృష్ట్యా ఉమ్మడి కృష్ణాజిల్లా వైసీపీలో కొత్త హుషారు కనపడుతోంది. నిన్నటి వరకూ అలకబూనిన మల్లాది విష్ణు కూడా పార్టీ నిర్ణయమే శిరోధార్యమని ప్రకటించడంతో బెజవాడలో మళ్లీ సత్తా చాటుతామని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తంచేస్తున్నారు. ఈనెల 30 జిల్లా పార్టీ కేడర్‌తో సీఎం జగన్‌ నిర్వహించే సమావేశానికి సైతం భారీగా తరలివెళ్లేలా కసరత్తు చేస్తున్నారు. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ కంచుకోటగా ఉన్న ఉమ్మడి కృష్ణా జిల్లాలో గత ఎన్నికల్లో వైసీపీ దూసుకుపోయింది. ఈసారి …

Read More »

నల్లజర్ల మండలస్థాయి వైసీపీ సమావేశం నిర్వహించిన హోంమంత్రి తానేటి వనిత

నల్లజర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ప్రజలకు, తమకు మధ్య ఎలాంటి మధ్యవర్తులు అవసరం లేదని… నాయకులకు, కార్యకర్తలకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా తమతో డైరెక్ట్ గా మాట్లాడవచ్చు అని రాష్ట్ర హోం మరియు విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి డాక్టర్ తానేటి వనిత తెలిపారు. ప్రజలందరికీ ఎప్పుడూ అందుబాటులో ఉంటానని, ఎలాంటి సమయంలోనైనా తమ దృష్టికి సమస్యను తీసుకుని రావచ్చునన్నారు. శనివారం నల్లజర్లలో స్థానిక ప్రియాంక కన్వెన్షన్ లో నిర్వహించిన నల్లజర్ల మండలం వైఎస్సార్సీపీ విస్తృత స్థాయి సమావేశానికి హోంమంత్రి అధ్యక్షత వహించారు.  …

Read More »