Breaking News

Tag Archives: amaravathi

ప్రత్యేక కార్పొరేషన్తోనే మాజీ సైనికుల సమస్యలు పరిష్కారం… : మోటూరు శంకరరావు

ప్రొద్దుటూరు, నేటి పత్రిక ప్రజావార్త : ప్రత్యేక కార్పొరేషన్ ద్వారా మాజీ సైనికుల సమస్యలు పరిష్కారమౌతాయని మాజీ సైనికోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోటూరు శంకరరావు తెలిపారు. గురువారం పొద్దుటూరు జరిగిన స్టేట్ అసోసియేషన్ సభ్యత్వం కారక్రమానికి విచ్చేసిన ఆయన మాజీ సైనికోద్యోగుల సంఘం సభ్యత్వ నమోదులో మాట్లాడుతూ ఇన్నే ళ్లుగా ఎన్ని ప్రభుత్వాలకు మాజీ సైనికోద్యోగుల సమస్యలు చెప్పి నా పట్టించుకోలేదన్నారు. నారాలోకేష్ పాదయాత్ర సందర్భంగా సమస్యలు ఆయన దృష్టికి తెచ్చామన్నారు. ఎన్నికల ముందు ఆయన ఇచ్చిన హామీ మేరకు మాజీ సైనికోద్యోగులకు ప్రత్యేక …

Read More »

రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్ పర్శన్,సభ్యుల నియామకానికి ధరఖాస్తులు ఆహ్వానం

-ధరఖాస్తులు పంపేందుకు చివరి తేది డిశంబరు 11 -తే. 15.03.2024 నాటి మునుపటి నోటిఫికేషన్ ప్రకారం దరఖాస్తు చేసుకున్న వారు కూడా ప్రస్తుత ఈ నోటిఫికేషన్ ప్రకారం మళ్లీ దరఖాస్తు చేసుకోవాలి -రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కర్నూల్ లోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ కు చైర్ పర్శన్ మరియు ఒక సభ్యుడు(జుడీషియల్)మరో సభ్యుడు(నాన్ జుడీషియల్)నియామకానికి అర్హులైన అభ్యర్ధుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి (పొలిటికల్) ఎస్.సురేశ్ కుమార్ …

Read More »

మహాత్మా జ్యోతి బా పూలే సమాజానికి అందించిన సేవలు ఎనలేనివి : సిఎస్ నీరబ్ కుమార్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సమాజంలో కుల వ్యవస్థ నిర్మూలన,స్ర్తీ విద్యను ప్రోత్సహించడం వంటి పలు సామాజిక అంశాల్లో మహాత్మా జ్యోతి బా పూలే అందించిన సేవలు ఎనలేనివని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ పేర్కొన్నారు.జ్యోతిబా పూలే వర్ధంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయం మొదటి భవనంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని పూలే చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ అంటరానితనం మరియు కుల వ్యవస్థ నిర్మూలన, మహిళలు,అణగారిన కులాల ప్రజలకు విద్యను అందించడంలో …

Read More »

జల్ జీవన్ మిషన్ పథకాన్ని సమర్థంగా అమలు చేస్తాము… సహకరించండి

-ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కి విజ్ఞప్తి చేసిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : దేశంలోని ప్రతి ఇంటికీ స్వచ్ఛమైన తాగు నీరు ఇవ్వాలనే బలమైన సంకల్పంతో రూపొందించిన జల్ జీవన్ మిషన్ పథకం లక్ష్యాలను ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం గాలికొదిలేసిందని, కేంద్ర ప్రభుత్వ ఆశయాలకు అనుగుణంగా జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రణాళికాబద్ధంగా ముందుకు తీసుకువెళ్తామని ఉప ముఖ్యమంత్రివర్యులు  పవన్ కళ్యాణ్ ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ కి తెలియచేశారు. జల్ జీవన్ మిషన్ …

Read More »

వైద్య కళాశాలల్లో ఖాళీల భర్తీ ని వేగవంతం చేయాలి

-వైద్య విద్యా బోధ‌న‌లో ప్ర‌మాణాల్ని పెంచాలి -వైద్య విద్యార్థుల హాజ‌రు శాతంపై ప్రిన్సిపాళ్లు దృష్టి సారించాలి -స‌మ‌ర్ధులైన వైద్యుల్ని స‌మాజానికి అందించాలి -కళాశాలకు జాతీయ స్థాయి ర్యాంకింగ్ లపై శ్ర‌ద్ధ పెట్ట‌క‌పోవ‌డం ప‌ట్ల మంత్రి ఆవేద‌న -ప్ర‌భుత్వ మెడిక‌ల్ కాలేజీల ప్రిన్సిపాళ్ల‌తో వ‌ర్చువ‌ల్‌గా వైద్య , ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్‌ యాదవ్‌ స‌మీక్ష అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ప్ర‌భుత్వ వైద్య కళాశాల‌ల్లో ఖాళీ పోస్టుల భ‌ర్తీ ప్రక్రియ‌ను వేగ‌వంతం చేయాల‌ని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ ఉన్న‌తాధికారుల్ని …

Read More »

మారిటైమ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్

-మారిటైమ్ పాలసీ -2024 లక్ష్యం -సుదీర్ఘతీర ప్రాంతాన్ని సద్వినియోగం చేద్దాం : ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా APని మారిటైమ్ హబ్‌గా తీర్చిదిద్దాలని, దీనిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. 1,053 కి.మీ పొడవైన తీరప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచ స్థాయి సముద్ర తీర రాష్ట్రంగా మారిటైమ్ పాలసీని రూపొందించాలని అన్నారు. బుధవారం సచివాలయంలో దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని ‘‘వరల్డ్ క్లాస్ మారిటైమ్ …

Read More »

ఎన్టీఆర్ కాలనీలలో సీసీటీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం చేయాలి…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : హోంమంత్రి వంగలపూడి అనితతో ఏపీ టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కుమార్, ఏపీ టిడ్కో ఎండీ సునీల్ కుమార్ మంత్రి క్యాంప్ కార్యాలయంలో సమావేశమయ్యారు. 40వేలకు మించి నివాసముండే టిడ్కో గృహాల సమీపంలో పోలీస్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని హోంమంత్రికి వినతిపత్రం సమర్పించారు. 10వేల మంది నివసించే టిడ్కో గృహాల పరిధిలో పోలీస్ అవుట్ పోస్టులు పెట్టాలని కోరారు. అసాంఘీక కార్యకలాపాలకు ఆస్కారం లేకుండా అన్ని ఎన్టీఆర్ కాలనీలలో సీసీటీవీలను ఏర్పాటు చేసి నిఘా వ్యవస్థను పటిష్టం …

Read More »

‘ఈగల్’ పేరుతో యాంటి నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ : హోంమంత్రి వంగలపూడి అనిత

-ప్రతి జిల్లాలో నార్కోటిక్ కంట్రోల్ సెల్, నార్కోటిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు -ముఖ్యమంత్రి చేతులమీదుగా ఈగల్ 1972 టోల్ ఫ్రీ నంబర్ ఆవిష్కరణ -జాయింట్ టాస్క్ ఫోర్స్ ద్వారా గంజాయి రవాణా మార్గాలపై డేగకన్ను -గంజాయి సాగు, సరఫరాపై ఉక్కుపాదం మోపుతాం -గంజాయి, డ్రగ్స్ గమ్యస్థానాలను లేకుండా చేస్తాం -ప్రజలను చైతన్యపరచి డ్రగ్స్ వాడకాన్ని నిరోధిస్తాం -అత్యాధునిక టెక్నాలజీ వినియోగంతో గంజాయి,డ్రగ్స్ నియంత్రణకు అడుగులు -‘మహా సంకల్పం’ పేరుతో భారీ అవగాహన సదస్సుల నిర్వహణకు కసరత్తు -స్లోగన్స్, ప్లెడ్జ్ లతో రాష్ట్ర, జిల్లా, మండల, …

Read More »

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాని కలుసుకున్న స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపస్పీకర్ రఘురామ కృష్ణ రాజు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు, ఉపస్పీకర్ రఘురామ కృష్ణ రాజు నేడు ఢిల్లీ పార్లమెంట్ హౌస్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా అయ్యన్న పాత్రుడు, రఘురామ కృష్ణ రాజు, త్వరలో జరుగనున్న 16వ ఆంధ్ర ప్రదేశ్ శాసనసభ నూతన సభ్యుల అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు ఓం బిర్లా ని ఆహ్వానించారు. ఓం బిర్లా  ఆ ఆహ్వానాన్ని గౌరవంగా స్వీకరించి, ప్రతిపాదిత అవగాహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి …

Read More »

మైనారిటీ విద్యార్థులకు డిఎస్ సి -2024 కు ఉచిత కోచింగ్

-మైనారిటీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు -రాష్ట్ర న్యాయ, మైనారిటి సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని మైనార్టీల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ బద్ధంగా చర్యలు తీసుకోవడమే కాకుండా అమలు చేస్తున్నదని రాష్ట్ర న్యాయ,మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. గతంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో డీ ఎస్ సి -2024 ను కూటమి ప్రభుత్వం నిర్వహించబోతున్నదని తెలిపారు. ఇందులో భాగంగా డీఎస్ సి …

Read More »