Breaking News

Tag Archives: amaravathi

పారిశ్రామిక అవసరాలకు మిగులు ఇథనాల్ విక్రయంపై మార్గదర్శకాలు పరిశీలన

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఉత్పత్తి అవుతున్న మిగులు ఇథనాల్‌ను ఔషధ, పెయింట్స్, రసాయన పరిశ్రమలు తదితర పారిశ్రామిక అవసరాలకు వినియోగించేలా తగిన మార్గదర్శకాలు రూపొందించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఈ అంశంపై గనులు, భూగర్భశాఖ మరియు ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అధ్యక్షతన సచివాలయంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులతో సమావేశం జరిగింది. సమావేశంలో ఇథనాల్ తయారీదారుల సంఘం ప్రతినిధులు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇథనాల్ ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పెరిగినప్పటికీ, ఇథనాల్ బ్లెండెడ్ పెట్రోల్ (EBP) కార్యక్రమం కింద …

Read More »

కడపలో కరోనాకు అడ్డుకట్ట వేయండి

-కలెక్టర్, డీఎంహెచ్ వోకు ఫోన్లో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశం -కేసులు నమోదైన ప్రాంతాల్లో కొవిడ్ నిబంధనలు అమలు చేయండి -రద్దీ ప్రాంతాల్లో మాస్క్ ధరించడం తప్పనిసరి చేయండి -వియత్నాంలో కడప వారి దుర్మరణంపై మంత్రి సవిత దిగ్భ్రాంతి -బాధిత కుటుంబానికి అండగా ఉంటాం -ఎప్పటికప్పుడు విదేశాంగ అధికారులతో మాట్లాడుతున్నాం : మంత్రి సవిత అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : కడప జిల్లాలో కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా అడ్డుకట్ట వేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత ఆదేశించారు. అదే సమయంలో …

Read More »

ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో భాగస్వాములు కావాలని కొరియా పరిశ్రమకు ఐటీ మంత్రి ఆహ్వానం

సియోల్, నేటి పత్రిక ప్రజావార్త : కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ భాగస్వామ్యంతో, దక్షిణ కొరియాలోని సియోల్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హెచ్‌ఆర్‌డి, ఐటీఈ&సీ మరియు ఆర్‌టీజీఎస్ శాఖల మంత్రి నారా లోకేష్ తో ఒక ప్రత్యేక ఇంటరాక్టివ్ సెషన్‌ను మరియు 31వ సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ 2026 కొరియా రోడ్‌షోను నిర్వహించింది. ఆంధ్రప్రదేశ్-కొరియా వాణిజ్యం, పెట్టుబడులు మరియు సాంకేతిక భాగస్వామ్యాలను బలోపేతం చేసే అవకాశాలను అన్వేషించడానికి ఈ సెషన్‌లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సియోల్‌లోని భారత రాయబార కార్యాలయం, రిపబ్లిక్ ఆఫ్ …

Read More »

క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలు

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో శుక్రవారం జరిగిన 1389 వ (52వ) క్యాబినెట్ సమావేశంలో పలు అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాల్గవ భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖామాత్యులు  కొలుసు పార్థసారధి మీడియాకు వివరించారు. సోషల్ మీడియా దుర్వినియోగాన్ని ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు – రాష్ట్ర స్థాయి ప్రత్యేక వ్యవస్థల ఏర్పాటు, సమగ్ర చట్టపరమైన చర్యలకు ప్రభుత్వం సిద్ధం నేడు జరిగిన …

Read More »

రాష్ట్రoలో మరో 100 ఎంబీబీఎస్ సీట్లకు ఎన్ఎoసీ గ్రీన్ సిగ్నల్

-కడప, నెల్లూరు ప్రభుత్వ వైద్య కళాశాలలకు 75, 25 చొప్పున అదనపు సీట్లు మంజూరు అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్య విస్తరణకు మరో కీలక ముందడుగు పడింది. 2026-27 విద్యా సంవత్సరానికి అదనంగా కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 75, నెల్లూరులోని ఏసీఎస్‌ఆర్ ప్రభుత్వ వైద్య కళాశాలలో 25 ఎంబీబీఎస్ సీట్ల పెంపునకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్‌ఎంసీ) లెటర్ ఆఫ్ పర్మిషన్ (ఎల్‌ఓపీ) మంజూరు చేసింది. దీంతో రాష్ట్రానికి మొత్తం 100 అదనపు ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి …

Read More »

నేడు విజయవాడలో మైనారిటీ యువత కోసం రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా

-సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడలో నిరుద్యోగ మైనారిటీ యువత కోసం రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా ను ఈనెల 11వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు మైనారిటీ,న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాం పేట లోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రఖ్యాతిగాంచిన 60 నుండి 70 మల్టీ …

Read More »

సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం

-సీఎం చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపిన మంత్రి డిఎస్ బీవీ స్వామి -ఎక్సలెన్సీ సెంటర్లలో విద్యార్థులకు ఇంటర్ తో పాటు ఐఐటీ, నీట్, జేఈఈ కి ఉచిత శిక్షణ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సాంఘిక సంక్షేమ ఆధ్వర్యంలో మూడు ఎక్సలెన్సీ సెంటర్ల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలపడం పట్ల రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సహచర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన పత్రిక …

Read More »

క్యాబినెట్ సమావేశంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయ వృద్ధి పై రవాణా శాఖ మంత్రి మండిపల్లిని అడిగిన సీఎం చంద్రబాబు

-సీఎం చంద్రబాబు నాయకత్వంలో కమర్షియల్ వాహనాల నమోదులో గణనీయ వృద్ధి చోటు చేసుకుందని మంత్రి వివరణ. -చంద్రబాబు దిశానిర్దేశంతో ఈవీ రంగంలో సానుకూల మార్పులు -ప్రభుత్వ ప్రోత్సాహక విధానాలతో పెరిగిన ఈవీ వాహనాల నమోదు… రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలో ఈ వివాహనాల నమోదు సంఖ్య గణనాయక పెరగడంపై సీఎం చంద్రబాబు నాయుడు మంత్రి మండపల్లి రాంప్రసాద్ రెడ్డిని అడగగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు నాయుడు కి వివరణ …

Read More »

ఖరీఫ్‌కు సమృద్ధిగా ఎరువుల నిల్వలు

– బఫర్ స్టాక్‌తో ప్రభుత్వం అప్రమత్తం – రాష్ట్రవ్యాప్తంగా ఎరువుల సరఫరా కొనసాగుతోంది – రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు : మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు అమ‌రావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త : ఖరీఫ్‌ సీజన్‌లో రైతులకు అవసరమైన యూరియా, డీఏపీతో పాటు అన్ని రకాల ఎరువులను ప్రభుత్వం సమృద్ధిగా అందుబాటులో ఉంచిందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం జులై 10వ తేదీ నాటికి 3.70 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా, 0.90 లక్షల మెట్రిక్ టన్నుల …

Read More »

డిప్యూటి డైరెక్టర్ గా రామాంజనేయులుకు పదోన్నతి

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ లో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న వి.రామాంజ నేయులుకు ఇటీవల ఉప సంచాలకులుగా పదోన్నతి లభించింది.గత పదేళ్ళుగా రాష్ట్ర సచివాలయంలో డిపిఆర్ఓగా, సహాయ సంచాలకులుగా సేవలు అందిస్తున్న ఆయనకు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ వారి కార్యాలయంలో ఉప సంచాలకులుగా పదోన్నతి కల్పించి రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగం(పబ్లిసిటీ సెల్) లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి …

Read More »