అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ లో సహాయ సంచాలకులుగా పని చేస్తున్న వి.రామాంజ నేయులుకు ఇటీవల ఉప సంచాలకులుగా పదోన్నతి లభించింది.గత పదేళ్ళుగా రాష్ట్ర సచివాలయంలో డిపిఆర్ఓగా, సహాయ సంచాలకులుగా సేవలు అందిస్తున్న ఆయనకు సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ వారి కార్యాలయంలో ఉప సంచాలకులుగా పదోన్నతి కల్పించి రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగం(పబ్లిసిటీ సెల్) లో విధులు నిర్వహించేందుకు అవకాశం కల్పించారు.ఈ అవకాశం కల్పించినందుకు రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్యులు కొలుసు పార్థసారథి వారికి,సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకులు కెఎస్.విశ్వనాధ్ వారికి రామాంజనేయులు కృతజ్ఞతలు తెలిపారు.
విశాఖపట్నం ఆంధ్ర విశ్వకళా పరిషత్ నుండి భూగోళశాస్త్రము, జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విభాగాల్లో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశారు. 1996లో గ్రూప్-బి సర్వీసుల ద్వారా సహాయ పౌరసంబంధాల అధికారిగా ఎంపికై కాకినాడ జిల్లా పౌరసంబంధాల అధికారి వారి కార్యాలయంలో ఎపిఆర్ఓ, డివిజినల్ పిఆర్ఓ,డిపిఆర్ఓగా 19 సంవత్సరాల పాటు సేవలందించారు.రాష్ట్ర విభజన అనంతరం 2016లో విజయవాడ రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ వారి కార్యాలయానికి బదిలీపై వచ్చి కొంతకాలం పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యుల కార్యాలయంలో పని చేశారు. గత పదేళ్ళుగా రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పని చేయడంతో పాటు 11 మంది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల వద్ద కూడా సేవలు అందిస్తున్నారు.
Prajavartha Online Telugu News