-సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చిన మంత్రి ఫరూక్
అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో నిరుద్యోగ మైనారిటీ యువత కోసం రాష్ట్రస్థాయి మెగా జాబ్ మేళా ను ఈనెల 11వ తేదీ శనివారం నిర్వహిస్తున్నట్లు మైనారిటీ,న్యాయశాఖల మంత్రి ఎన్ఎండి ఫరూక్ తెలిపారు. మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఇస్లాం పేట లోని షాజహూర్ ముసాఫిర్ ఖానాలో ఉదయం 9 గంటల నుండి జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. నిరుద్యోగ మైనారిటీ యువత కోసం, ఉద్యోగ, ఉపాధి కల్పనకు ప్రఖ్యాతిగాంచిన 60 నుండి 70 మల్టీ నేషనల్ సంస్థలు, డోమెస్టిక్ కంపెనీలు పాల్గొంటున్నట్లు మంత్రి తెలిపారు. ఐటి , బ్యాంకింగ్ , ఫైనాన్స్, హెల్త్ కేర్,లాజిస్టిక్స్, రిటైల్ తదితర రంగాలలో వివిధ స్థాయిలలో 2500 నుండి 3500 మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే జాబ్ మేళా ముఖ్య ఉద్దేశమని తెలిపారు.10 వ తరగతి నుండి పీజీ దాకా చదివిన నిరుద్యోగులంతా పాల్గొని సద్వినియోగం చేసుకోవాలని మంత్రి ఫరూక్ పిలుపునిచ్చారు.
Prajavartha Online Telugu News