Breaking News

Tag Archives: amaravathi

సీఎం వైఎస్‌ జగన్‌ను కలిసిన నూతన రాజ్యసభ సభ్యులు…

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ను రాజ్యసభకు కొత్తగా ఎన్నికైన ఎంపీలు బీద మస్తాన్‌రావు, ఆర్‌.కృష్ణయ్య, ఎస్‌.నిరంజన్‌ రెడ్డి కలిసారు. రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్‌ అధికారి నుంచి డిక్లరేషన్‌ తీసుకున్న అనంతరం సీఎం క్యాంప్‌ కార్యాలయంలో ముఖ్యమంత్రిని కలిసి నూతన రాజ్యసభ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Read More »

గ్యాస్‌ లీక్‌ఘటనపై సీఎం ఆరా

-అస్వస్థతకు గురైన వారికి మంచి వైద్యం అందించాలని ఆదేశాలు -ఘటన స్థలాన్ని సందర్శించాల్సిందిగా స్థానిక మంత్రికి ఆదేశం -గ్యాస్‌ లీకుపై దర్యాప్తునకు ముఖ్యమంత్రి ఆదేశం అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : విశాఖపట్నం సమీపంలోని అచ్యుతాపురంలో అమ్మోనియా గ్యాస్‌ లీక్, బ్రాండెక్స్‌లో పనిచేస్తున్న మహిళలకు అస్వస్థత ఘటనపై అధికారులనుంచి వివరాలు కోరిన సీఎం. ఘటనకు దారితీసిన కారణాలను వివరించిన సీఎంఓ అధికారులు. సంబంధిత జిల్లా కలెక్టర్‌ వెంటనే వెళ్లి సహాయ కార్యక్రమాలను పర్యవేక్షించారని వెల్లడించిన అధికారులు. గ్యాస్‌ లీక్‌ను కూడా నియంత్రించారని తెలిపిన అధికారులు. …

Read More »

నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన నలుగు సభ్యులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటిస్తూ వారికి దృవీకరణ పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన …

Read More »

నాణ్య‌మైన వైద్యం జ‌గ‌న‌న్న ల‌క్ష్యం

-ప్ర‌భుత్వం ఉన్న‌త ఆశ‌యంతో ప‌నిచేస్తోంది -అధికారులు చిత్త‌శుద్ధితో ప‌నిచేస్తేనే ప్ర‌జ‌ల‌కు మేలు -ఎన్ ఎహెచ్ ఎం ల‌క్ష్యాలు పూర్తికావాలి -అన్ని విభాగాల్లోనూ ఏపీనే ముందుండాలి -ప్ర‌భుత్వ ఆస్ప‌త్రుల్లో స‌మ‌స్య‌లు ఉండ‌టానికి వీల్లేదు -క్షేత్ర‌స్థాయి సిబ్బంది నిర్ల‌క్ష్యం వీడేలా చూడండి -వైద్య సేవ‌ల విష‌యంలో ప్ర‌జ‌లు వంద శాతం సంతృప్తి చెందాల‌న్న‌దే ల‌క్ష్యం -రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఆదేశాలు -ఎన్ హెచ్ ఎం విభాగం ఉన్న‌తాధికారుల‌తో ప్ర‌త్యేకంగా స‌మావేశ‌మైన మంత్రి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రికీ …

Read More »

త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు : పరిశ్రమల మంత్రి గుడివాడ అమర్ నాథ్

-ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం -జిల్లాకొక సంబంధాల అధికారి (రిలేషన్ షిప్ మేనేజర్) నియామాకానికి ఆదేశం -పరిశ్రమల శాఖ సమీక్షా సమావేశంలో మంత్రి అమర్ నాథ్ అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : త్వరలో ఏపీ సత్తా చాటేలా పారిశ్రామికవేత్తలు, అసోసియేషన్ లతో రంగాలవారీ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేయాలని మంత్రి గుడివాడ అమర్ నాథ్ ఆదేశించారు. ఈడీబీ నిర్వహిస్తోన్న కీలక ప్రాజెక్టులపై ఆయన గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఏ పరిశ్రమకు ఎటువంటి ఇబ్బంది కలిగినా వెంటనే స్పందించి పరిష్కారం …

Read More »

సూపర్‌స్టార్‌ కృష్ణకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన సీఎం జగన్‌

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రముఖ నటుడు సూపర్‌ స్టార్‌ కృష్ణకు ట్విటర్‌ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ‘అభిమానుల ప్రేమాభిమానాలు, దేవుడి ఆశీస్సులతో మీరు ఇలాంటి పుట్టిన రోజులు మరిన్ని జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ సీఎం జగన్‌ ట్వీటర్‌లో పేర్కొన్నారు.

Read More »

నిత్యావసర వస్తువుల ధరల పర్యవేక్షణకు త్వరలో అందుబాటులోకి ప్రత్యేక యాప్ : సిఎస్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ రైతు బజారులు,రిటైల్ మార్కెట్లో నిత్యావసర వస్తువులు, కూరగాయల ధరల స్థితిగతులను ఎప్పటికప్పుడు మానిటర్ చేసేందుకు వీలుగా వారం రోజుల్లోగా ప్రత్యేక యాప్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.సమీర్ శర్మ వెల్లడించారు.ఈమేరకు మంగళవారం అమరావతి సచివాలయం నుండి వివిధ నిత్యావసర వస్తువులు,కూరగాయల ధరల సిత్థిగతులపై సంబంధిత శాఖల అధికారులతో ఆయన సమీక్షించారు.ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రైతు బజారుల్లో వివిధ రకాల కూరగాయలు,వంటనూనెలు సహా ఇతర నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో అందుబాటులో …

Read More »

ఎస్సీ గురుకులాలకు అదనపు హంగులు

-రూ.65 కోట్లతో సోలార్ ప్యానళ్లు -రూ.7 కోట్లతో సీసీ కెమెరాలు -పెదవేగి,కొలసానిపల్లిలలో స్పోర్ట్స్ అకాడమీలు -బీవోజీ సమావేశంలో నిర్ణయాలు -మంత్రి మేరుగు నాగార్జున వెల్లడి అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాంఘిక సంక్షేమ గురుకులాలలో అన్ని సమస్యలు పరిష్కరించడానికి, అలాగే మరిన్ని హంగులను సమకూర్చడానికి చర్యలు తీసుకోవాలని బీవోజీ సమావేశంలో నిర్ణయించడం జరిగిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి మేరుగు నాగార్జున వెల్లడించారు. ఎస్సీ గురుకులానికి చెందిన బోర్డ్ ఆఫ్ గవర్నర్స్ (బీవోజీ) 70 వ సమావేశం మంగళవారం తాడేపల్లిలోని …

Read More »

ఆత్మకూరు ఉప ఎన్నికకు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ల డాటా ఎంట్రీకి అవకాశం

-రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆత్మకూరు ఉప ఎన్నికలో పోటీ చేసే అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా నామినేషన్ ఫార్ము, అఫిడవిట్ లో వ్యక్తిగత సమాచారాన్ని పొందుపర్చేందుకు మరియు నామినేషన్లు దాఖలు చేయడానికి అపాయింట్మెంట్, ప్రచార కార్యక్రమాల నిర్వహణకు అనుమతులను పొందే అవకాశాన్ని భారత ఎన్నికల సంఘం అవకాశం కల్పించిందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా తెలిపారు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు www.suvidha.eci.gov.in పోర్టల్ ద్వారా …

Read More »

సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం

-రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీ,బి.సి., మైనారిటీ వర్గాల వారి సంక్షేమం, అభివృద్దికి మరియు అన్ని రంగాల్లో వారికి సముచిత స్థానం కల్పించేందుకు తమ ప్రభుత్వం అమలు చేస్తున్న పలు పథకాలను, కార్యక్రమాలను ప్రజలకు వివరించేందుకు ఈ నెల 26 నుండి ఐదు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర విజయవంతం అయ్యిందని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున అన్నారు. …

Read More »