Breaking News

నాలుగు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన నలుగు సభ్యులు వి.విజయ సాయిరెడ్డి, బీద మస్తాన్ రావు, ఎస్.నిరంజన్ రెడ్డి మరియు ఆర్.కృష్ణయ్య ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. శుక్రవారం అమరావతి శాసన సభ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి మరియు రాష్ట్ర శాసన మండలి ఉప కార్యదర్శి పి.వి. సుబ్బారెడ్డి ఆంధ్రప్రదేశ్ కోటాలో నాలుగు రాజ్యసభ స్థానాలకు ఈ నలుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు ప్రకటిస్తూ వారికి దృవీకరణ పత్రాలను అందజేశారు. ఆంధ్రప్రదేశ్ శాసన సభకు ఎన్నిక కాబడిన సభ్యులచే రాజ్యసభకు నలుగురు (4) సభ్యుల ఎన్నికకు వై.ఎస్.ఆర్.సి.పి.కి చెందిన ఈ నలుగురు సభ్యులు మాత్రమే నామినేషన్లను దాఖలు చేయడం వల్ల సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం అయ్యింది. ఈ నెల 1 వ తేదీన నామినేషన్ పత్రాల పరిశీలన పూర్తవ్వడం మరియు నామినేషన్ల ఉపసంహరణ చివరి రోజైన నేటి మధ్యాహ్నం 3.00 గంటల లోపు అభ్యర్థిత్వ ఉపసంహరణ నోటీసులు ఎటు వంటివి అందకపోవడంతో ఈ నలుగురు సభ్యుల ఎంపిక ఏకగ్రీవం అయినట్లుగా ప్రకటిస్తూ దృవీకరణ పత్రాలను అందజేయడం జరిగింది.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *