Breaking News

Tag Archives: indrakiladri

ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులపై సమీక్ష నిర్వహించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి పై దుర్గా మల్లేశ్వర స్వామి దేవస్థానం లో చేయవలసిన అభివృద్ధి కార్యక్రమాలను పశ్చిమ శాసనసభ్యులు యలమంచిలి సత్యనారాయణ (సుజన చౌదరి) పరిశీలించారు. ఆలయ ఈవో కేఎస్ రామారావు , ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈవో కార్యాలయంలో ఎమ్మెల్యే సుజనా మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూపొందించిన దుర్గగుడి మాస్టర్ ప్లాన్ ను పరిశీలించామని ఆలయ అభివృద్ధికి అవసరమయ్యే సలహాలను, సూచనలను పరిగణలోకి తీసుకుంటామన్నారు. అధికారుల, ప్రజాప్రతినిధుల …

Read More »

అమ్మ వారి కి 10 లక్షల బంగారు హారం బహుకరించిన పంకజ్ రెడ్డి

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నెల్లూరు జిల్లాకు చెందిన వ్యాపారవేత్త పంకజ్ రెడ్డి, సరిత దంపతులు పది లక్షల రూపాయలు విలువైన బంగారు హారం అమ్మవారికి బహుకరించారు. వస్తు విలువను నిర్ధారించే… ధ్రువీకరణ పత్రం, హారం శనివారం ఆలయ కార్య నిర్వహణ అధికారి కె.ఎస్ రామారావుకు అందజేశారు. అనంతరం దాతలకి వేద పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఆలయ పిఆర్ఓ డి వి వి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

Read More »

శ్రీ రాజరాజేశ్వరీ దేవి అవతార విశిష్టత…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఆశ్వయుజ శుద్ధ దశమి రోజున అమ్మవారు రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తారు. శరన్నవరాత్రులలో ఆశ్వయుజ శుద్ధ దశమి(విజయ దశమి) రోజున అమ్మవారు శ్రీ రాజరాజేశ్వరీ దేవిరూపంలో దర్శనమిస్తుంది. నవరాత్రులలో ఈరోజే ఆఖరిరోజు. ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న కనకదుర్గ ఆలయంలో అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. ఈరోజును విజయదశమిగా అమ్మవారు చిద్రూపిణి. వరదేవతగా అలరారుతుంది. పరమేశ్వరుని అంకమును ఆసనముగా చేసుకుని, చేతిలో చెరకుగడతో, చిరుమందహాసంతో శోభాయమానమై ప్రకాశించే జగన్మాతను భక్తితో పూజించుకోవాలి. అనంత శక్తి స్వరూపిణి అయిన ఈ తల్లి …

Read More »

శరన్నవరాత్రుల ముగింపు పూర్ణాహుతి కార్యక్రమం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా ఉత్సవాల సందర్భంగా శనివారం విజయ దశమి రోజున శ్రీ రాజరాజేశ్వరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులతో, భవానీ మాలధారులతో ఇంద్రకీలాద్రి జనసంద్రమైంది. జై భవాని, జై జై భవాని.. జై దుర్గా, జై జై దుర్గా జయజయధ్వానాలతో హోరెత్తింది. ఆధ్యాత్మిక పరిమళాలతో సుగంధ భరితమైంది. శరన్నవరాత్రుల కార్యక్రమాల ముగింపు రోజు శాస్త్రోక్తంగా నిర్వహించే పూర్ణాహుతి కార్యక్రమం వేద పండితుల మంత్రోచ్ఛరణల మధ్య అత్యంత వైభవంగా జరిగింది. విజయదశమి కావడంతో సాధారణ భక్తులతో పాటు …

Read More »

శ్రీ మహిషాసుర మర్దిని దుష్ట శక్తులపై విజయం సాధించిన దేవత

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని సీతారాంపురం ఇజ్జాడ వారి వీధి నందు శుక్రవారం దసరా నవరాత్రులలో భాగంగా నేడు శ్రీ శ్రీ శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి పంచలోహ తురన ప్రభ మహోత్సవ కమిటీ వారు ఏర్పాటుచేసిన  “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారిని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా సిద్దార్థ దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం …

Read More »

మహిషాసుర మర్ది దేవి అందరికీ శక్తి, ధైర్యం మరియు విజయాన్ని ప్రసాదించాలని కోరుకుందాం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రులలో భాగంగా శుక్రవారం “మహార్నవమి సందర్భంగా” ఇంద్రకీలాద్రిపై  నందు “శ్రీ మహిషాసుర మర్దిని” గా దర్శనమిచ్చిన అమ్మవారినీ తెలుగుదేశం పార్టీ యువ నాయకులు, ప్రముఖ న్యాయవాది బొండా రవితేజ  దర్శించుకుని ఆ అమ్మవారి చల్లని దీవెనలు ప్రజలందరిపై సెంట్రల్ నియోకవర్గం పై ఉండాలని కోరుకుంటూ నవరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం బొండా సిద్ధార్థ మాట్లాడుతూ ఈరోజు 9వ రోజు దేవి శరన్నవరాత్రుల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్దిని దేవి అమ్మవారి అలంకరణ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు …

Read More »

తిరుమల తిరుపతి దేవస్థానం తరపున పట్టు వస్త్రాల సమర్పణ…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఏడుకొండల పై కొలువై ఉన్న దేవ దేవుడు కలియుగ దైవం పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి తిరుమల తిరుపతి దేవస్థానం తరపున శుక్రవారం కనకదుర్గమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. సహాయ కార్య నిర్వహణ అధికారి బి. దొరస్వామి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు తోడుకొని వచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు, సిబ్బందికి ఇంద్రకీలాద్రి కార్యనిర్వహణాధికారి కె.ఎస్. రామరావు, ఉప కార్యనిర్వహణాధికారి రత్నరాజు, ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాస శాస్త్రి స్వాగతం పలికారు. వేద పండితులు మేళ …

Read More »

అర్చకసభలో వైభవంగా మంత్రార్చన

-అర్చకసభల సంప్రదాయం కొనసాగిస్తాం -ఆలయ ఈవో కెఎస్ రామరావు వెల్లడి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : వివిధ ఆలయాల అర్చకులు ఏకకంఠంతో జగన్మాత చెంత చేసిన పారాయణం భక్తి జ్ఞానంతో మారుమోగింది. ఇంద్రకీలాద్రి అమ్మవారి ఆలయంలో దసరా వేడుకల్లో భాగంగా శ్రీ మహిషాసుర మర్ధిని అవతారంలో కొలువైన అమ్మవారిని దర్శించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. శుక్రవారం శ్రీ మల్లికార్జున స్వామి మహామండపం లోని ఆరవ అంతస్తు లో అర్చక సభ వైభవోపేతంగా జరిగింది. పంచప్రాణాల్లో మొదటిది అర్చకుడి ప్రాణం. నడిచే హరి …

Read More »

మహిషాసురమర్ధని అలంకృత జగజ్జననిని దర్శించుకున్న శాసనసభ్యులు హరిప్రసాద్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దుర్గా శరన్నవరాత్రులు తొమ్మిదవ రోజు శ్రీ మహిషాసుర మర్ధిని దేవి (మహర్నవమి) అలంకృత అమ్మవారిని శాసనమండలి సభ్యులు హరిప్రసాద్ దర్శించుకున్నారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయని.. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాలకు అనుగుణంగా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. క్యూ లైన్లలో కూడా గందరగోళం తలెత్తకుండా చర్యలు తీసుకున్నట్టు తెలిపారు. రాష్ట్ర ప్రజలందరూ …

Read More »

మహిషాసుర మర్దని అలంకృత దుర్గమ్మను దర్శించుకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాల్లో భాగంగా 9వ రోజు దుర్గమ్మ శ్రీ మహిషాసుర మర్దినిదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీరబ్ కుమార్ ప్రసాద్ సతీసమేతంగా దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఈవో రామారావు నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు స్వాగతం పలికారు. దుర్గమ్మ దర్శనం అనంతరం ఆశీర్వచన మండపంలో నీరబ్ కుమార్ ప్రసాద్ దంపతులకు వేద పండితులు వేద ఆశీర్వచనం చేసారు. అనంతరం ఈఓ రామారావు అమ్మవారి చిత్రపటం, శేష వస్త్రం, అమ్మవారి ప్రసాదం …

Read More »