Breaking News

Tag Archives: indrakiladri

దుర్గాదేవి చెంత సాంస్కృతిక శోభ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీశ్రీశ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు అమ్మవారు శ్రీ దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై కళాకారులు ప్రదర్శనలు భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. వెంకటరమణ బృందం, శ్రీదేవి భజన సంకీర్తన, సత్యవతి సాహితీ కళారూపం, రవికుమార్ భక్తిరంజిని రవికుమార్ భక్తి రంజని వీక్షికులను మంత్రముగ్ధుల్ని చేశాయి. మనోజ్ఞ, ఉషా మాధవి, శ్రావ్య, అరుణ కళ్యాణి, మహతి, పుణ్య శ్రీ తదితర కళాకారుల నృత్య ప్రదర్శనలు అలరించాయి …

Read More »

శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని గురువారం ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావు దర్శించుకున్నారు. దర్శనం అనంతరం వేద పండితులు మహబూబ్ మండపం వద్ద వేద ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలను అందజేశారు. మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు సూచనల మేరకు శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా జిల్లా యంత్రాంగం అద్భుతమైన ఏర్పాట్లు చేసిందని ఆయన తెలిపారు. సామాన్య భక్తుల సైతం …

Read More »

అమ్మవారి అనుగ్రహంతోనే శాసన సభ్యునిగా ఎన్నికయ్యాను

-భక్తులందరికీ సులభతర దర్శనం -దివ్యాంగులు, వృద్ధుల దర్శనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు -లోటుపాట్లను సరి చేసుకుంటాం -వచ్చే ఏడాది మరింత అద్భుతంగా నిర్వహిస్తాం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గత దశాబ్ద కాలంలో ఇంద్రకీలాద్రి పర్వతంపై ఉన్న శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానంలో ప్రతి ఏడాది జరిగే శరన్నవరాత్రి మహోత్సవాలలో ఈ ఏడాది దసరా ఉత్సవాలలో అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తుల అభిప్రాయం ప్రకారం 95 శాతం మంది భక్తులు రాష్ట్ర దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏర్పాట్లు అద్భుతమని …

Read More »

మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవదాన్ని అదృష్టంగా భావిస్తున్నాను…

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం శ్రీ సరస్వతీ దేవి అలంకృత అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన అనంతరం ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడారు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశ విదేశాల్లోని దుర్గమ్మ భక్తులందరికీ నమస్కారం. అత్యంత విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోవదాన్ని అదృష్టంగా భావిస్తున్నాను. దుర్గమ్మపైన ఉండే భక్తిభావంతో పెద్దఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి వస్తున్నారు. ఒక్కోసారి లక్షమందికి పైగా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. …

Read More »

కనక దుర్గమ్మ అమ్మ వారికి పట్టువస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చంద్రబాబు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న కనకదుర్గమ్మను రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం సతీ సమేతంగా కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు. సతీమణి నారా భువనేశ్వరి, లోకేశ్‌, బ్రాహ్మణి, దేవాన్ష్‌తో కలిసి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. దుర్గమ్మకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు సమర్పించారు. శరన్నవరాత్రుల ఉత్సవాలలో విశిష్టమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ సరస్వతి దేవి అలంకరణ లో ఉన్న కనక దుర్గ అమ్మవారికి ప్రభుత్వం తరఫున సంప్రదాయంగా పట్టు వస్త్రాలను సమర్పించేందుకుగాను వచ్చిన …

Read More »

జగన్మాత చెంత కళావైభవం

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : మూలా నక్షత్రం రోజైన బుధవారం శ్రీ సరస్వతి దేవి అలంకారంలో జగన్మాత భక్తులకు దర్శనమిచ్చారు. ఇంతటి పుణ్యదినాన అమ్మవారికి భజన సంకీర్తనలు, సంగీతం, నృత్యం, హరికథలతో కళాకారులు పూజించారు. కనకదుర్గ నగర్ లోని కళావేదికపై నాగమణి బృందం, మీనాక్షి శ్రీనివాస్, సింధు బృందం, సాత్విక్ మహదేశ్వర్ ఆలపించిన భజన సంకీర్తనలు భక్తులను సమ్మోహన పరిచాయి. సిహెచ్ అజయ్ కుమార్,సింధూ నాగేశ్వరి బృందం ఆలపించిన సంగీత విభావరి అమ్మవారి భక్తులను పులకింపచేసింది. సిహెచ్ ఆనంద్, ఏం పావని, సంతోష్, …

Read More »

యేర్పాట్లు భేష్…

-క్యూ లైన్ లలో భక్తులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేసిన రాష్ట్ర హోం శాఖ మాత్యులు వంగలపూడి అనిత ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని రాష్ట్ర హోంశాఖ మాత్యులు  వంగలపూడి అనిత దర్శించుకున్నారు. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం అమ్మవారి తీర్థ ప్రసాదాలు శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం ఆమె మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం …

Read More »

భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : బుధవారం అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం రోజు భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్ నిరంతర పర్యవేక్షణ. మీడియా పాయింట్ వద్ద జిల్లా కలెక్టర్ జి సృజన మాట్లాడుతూ దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో అత్యంత విశేషమైన అమ్మవారి జన్మ నక్షత్రం మూలా నక్షత్రం రోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు సరస్వతీ దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఎంతో విశేషమైన మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకుంటే సకల భోగాలు కలుగుతాయని …

Read More »

సరస్వతీ దేవి అవతారాన్ని దర్శించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ మూల నక్షత్రం పర్వదిన రోజున ఇంద్రకీలాద్రిపై కొలువైన సరస్వతీ దేవి అలంకారంలో ఉన్న జగన్మాతను తన కుమార్తె ఆద్య తో కలిసి బుధవారం దర్శించుకున్నారు. దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి కెఎస్ రామరావులు ఆలయ అధికారులు, వేద పండితులు శాస్త్రోక్తంగా మేళ తాళాలతో స్వాగతం పలికారు. దర్శనానంతరం రాష్ట్ర హోమ్ శాఖ మంత్రి వంగలపూడి అనిత, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాధ్ లతో కలిసి దేవాదాయ …

Read More »

అమ్మ అనుగ్రహంతో… అమరావతి, పోలవరం పూర్తి చేస్తాం…

-నవరాత్రి ఉత్సవాలపై 92% భక్తుల సంతృప్తి -సామాన్య భక్తులకే తొలి ప్రాధాన్యం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తమపై ఎంతో నమ్మకంతో గెలిపించిన రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అయిన అమరావతి, పోలవరం నిర్మాణాలు అమ్మ అనుగ్రహంతో నిర్దేశిత సమయంలో పూర్తి చేస్తామని జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు అన్నారు. మూల నక్షత్ర పర్వదినమైన బుధవారం సరస్వతీ దేవి అవతారంలో కొలువుతీరిన జగన్మాతను సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కె. ఎస్. రామారావు, దేవాలయ అధికారులు …

Read More »