-బంగారు వీణతో భక్తులకు చదువుల తల్లి సాక్షాత్కారం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రుల్లో భాగంగా 7వ రోజైన బుధవారం (ఆశ్వయుజ శుద్ధ సప్తమి) నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ శ్రీసరస్వతీదేవిగా దర్శనమిస్తుంది. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రానికి శరన్నవరాత్రుల్లో ఎంతో విశిష్టత ఉంది. అందుకే ఆశ్వయుజ శుద్ధ సప్తమి నాడు చదువుల తల్లిగా కొలువుదీరే దుర్గమ్మను దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తుతారు. త్రిశక్తి స్వరూపిణి నిజస్వరూపాన్ని సాక్షాత్కారింపజేస్తూ శ్వేత పద్మాన్ని అధిష్టించిన దుర్గామాతా తెలుపు రంగు చీరలో బంగారు వీణ, …
Read More »Tag Archives: indrakiladri
మూలా నక్షత్రం పవిత్ర రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు…
ఇంద్రకీలాద్రి మీడియా పాయింట్ వద్ద రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ.. ఆరో రోజు శ్రీ మహాలక్ష్మీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారని.. బుధవారం మూలా నక్షత్రం పవిత్ర రోజున అమ్మవారిని దర్శించుకునేందుకు లక్షలాది మంది ఎదురుచూస్తున్నారని.. ముఖ్యంగా సామాన్య భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. 13 శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. వేకువజామున మూడు గంటల నుంచి రాత్రి 11, 11.30 గంటల వరకు అమ్మవారి దర్శన భాగ్యం …
Read More »మూల నక్షత్రం రోజున సరస్వతి మాతకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పణ
-ముఖ్యమంత్రి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించే సమయంలోనూ మూడు క్యూ లైన్ల ద్వారా అనుమతుల మేరకు అమ్మవారి దర్శనానికి వెసులుబాటు -అందరికీ సర్వదర్శనమే -వీఐపి, వీవీఐపీ, అంతరా లయ దర్శనాల బంద్ -సమయానుకూలంగా ట్రాఫిక్ నియంత్రణ -సామాన్య భక్తులకు ఇబ్బందులు ఉండవు -దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూలా నక్షత్రం తిధి సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు …
Read More »మహాలక్ష్మి అవతారాన్ని దర్శించుకున్న డీజీపీ ద్వారక తిరుమలరావు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ మంగళవారం మహాలక్ష్మి రూపంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. డీజీపీ ద్వారకాతిరుమల రావు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. దేవస్థానం అధికారులు సాంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వేద పండితులు వేద ఆశీర్వచనం, తీర్థ ప్రసాదాలు, అమ్మవారి చిత్ర పటం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్య భక్తులకు సులభతర దర్శనమే లక్ష్యంగా పోలీసు శాఖ పనిచేస్తుందని వివరించారు. విఐపి దర్శనాల కోసం వస్తున్న భక్తులు …
Read More »శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న రాష్ట్ర మంత్రి అనగాని సత్యప్రసాద్
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై వేంచేసియున్న శ్రీ కనకదుర్గ అమ్మవారు “”శ్రీ మహాలక్ష్మి దేవి”” రూపంలో దర్శనమిస్తున్నారు. రాష్ట్ర రెవెన్యూ, రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ శాఖామాత్యులు అనగాని సత్యప్రసాద్ సతీసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ఆశీర్వచన మండపంలో వేద పండితులు ఆశీర్వచనాలు, అమ్మవారి తీర్థ ప్రసాదాలు, శేష వస్త్రాలు అందజేశారు. అనంతరం అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తులకు క్యూ లైన్ ల అందిస్తున్న సౌకర్యాలపై అధికారులను మంత్రి అనగాని సత్య ప్రసాద్ అడిగి తెలుసు కున్నారు.
Read More »మహాలక్ష్మి అలంకారంలో దుర్గమ్మ దర్శనం.. రేపు మూలా నక్షత్రం..
-సతీసమేతంగా పట్టువస్త్రాలు సమర్పించనున్న సిఎం చంద్రబాబు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసర నవరాత్రి ఉత్సవాలు ఆరో రోజుకు చేరాయి. ఈ రోజు మంగళవారం మంగళకరంగా దుర్గాదేవి కాత్యాయనీ దేవీ అవతారంలో దర్శనం ఇస్తోంది. అదే సమయంలో ఇంద్రకీలాద్రి పై కొలువైన కనక దుర్గాదేవి నేడు మహా లక్ష్మి దేవి అలంకారం లో భక్తులకు దర్శనం ఇస్తున్నారు. అమ్మలగన్న అన్న ముగ్గురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మని దర్శించుకునేందుకు తెల్లవారు జామున 4 గంటల నుంచి భక్తులు బారులు దీరారు. మహాలక్ష్మిదేవి అలంకారంలో ఉన్న అమ్మవారి …
Read More »దుర్గమ్మ అమ్మవారిని దర్శించుకున్న డాక్టర్ తరుణ్ కాకాని
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రముఖ బిజెపి నాయకులు మరియు అమరావతి బోటింగ్ క్లబ్ CEO డాక్టర్ తరుణ్ కాకాని సోమవారం కుటుంబ సమేతంగా శ్రీ కనక దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానాన్ని సందర్శించి మహాచండీ దేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకున్నారు. విజయవాడ పీఠాధిపతి మండప ఆశీర్వచనం ఆశీస్సులు పొందారు. అనంతరం ఆలయ దసరా ఉత్సవాల ఏర్పాట్లపై, మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆలయ ఉత్సవ కమిటీ సభ్యుల సేవలను కొనియాడారు. వృద్ధలకు వీల్ చైర్ ఏర్పాటు, భక్తులకు త్రాగు …
Read More »శాస్త్రోక్తంగా.. భక్తి ప్రపత్తులతో సువాసిని పూజ…
-ముత్తయిదువులను స్వయంగా పూజా మందిరంలోకి తోడ్కోని వెళ్లిన ఆలయ ఈవో కె.ఎస్.రామరావు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా నవరాత్రుల సమయంలో అమ్మవారి వివిధ రూపాలకు అనుగుణంగా ఏటా ఇంద్రకీలాద్రిపై నిర్వహించే సువాసినీ పూజ సోమవారం వేదపండితుల ఆధ్వర్యంలో సంప్రదాయబద్దంగా జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి కె.ఎస్.రామరావు స్వయంగా ముత్తయిదువులను పూజా మందిరానికి తోడ్కోని వెళ్లారు. బాల..కుమారి.. సువాసిని… పూజలు ఈ సందర్భంలోనే జరుగుతుంటాయి. సువాసినీ పూజలో ముత్తయిదువులను అమ్మవారిగా భావించి అలంకరించడం, పూజించడం ఆనవాయితీగా వస్తుంది. పూజానంతరం తరువాత వారికి దక్షిణ తాంబూలం …
Read More »మహా చండీ దేవికి నృత్య హారతి
-ఆకట్టుకున్న చిన్నారుల కళా ప్రదర్శనలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా కళాకారులు అమ్మవారికి కళాభిషేకం చేస్తున్నారు. ఐదో రోజు అమ్మవారు మహా చండీ దేవి అలంకరణలో దర్శనమిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు కళా ప్రదర్శనలు తిలకించి పరవశించిపోతున్నారు. సోమవారం కనకదుర్గ నగర్ లోని కళావేదికపై రామాంజనేయుల బృందం, దీపిక, పార్థసారథి ఆలపించిన భజన సంకీర్తనలు వీనుల విందుగా ఓలలాడించాయి. కళాకారులు దుర్గేష్, నందిని సంగీత …
Read More »ఏర్పాట్లు ఘనం.. దర్శనం అపురూపం..
-నిరంతరం పర్యవేక్షిస్తున్న జిల్లా కలెక్టర్ డా. జి.సృజన -దసరా ఏర్పాట్లపై భక్తుల సంతృప్తి -శాఖల మధ్య సమన్వయంతో దర్శనం సులభతరం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిపై జరుగుతున్న దసరా శరన్నవరాత్రులు నేటికి 5వ రోజు ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సామాన్య భక్తులకు సులభతరమైన దర్శనం అందించాలన్న సంకల్పంతో దేవాదాయ శాఖ, పోలీస్, రెవెన్యూ, నగరపాలక సంస్థ శాఖల ఉన్నతాధికారులు నిరంతరం భక్తులకు అవసరమైన ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. ప్రధానంగా అమ్మ దర్శనం కోసం కొండపైకి వచ్చే వేలాది మంది …
Read More »
Prajavartha Online Telugu News