ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో కొలువైయున్న జగన్మాతకు రాష్ట్రంలోని వివిధ దేవాలయాల నుంచి సారె సమర్పించడం ఒక సంప్రదాయం. ఇందులో భాగంగా సోమవారం తిరుపతి జిల్లాలోని శ్రీ కాళహస్తీశ్వర దేవస్థాన ప్రతినిధులు ఇంద్రకీలాద్రికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించారు. శ్రీ మహా చండీ దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకుని వేద పండితుల ఆశీర్వచనం తీసుకున్నారు. ఈవో ఎస్.ఎస్.చంద్రశేఖర్ ఆజాద్ నేతృత్వంలోని అధికారులు, వేద …
Read More »Tag Archives: indrakiladri
లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదు
– అత్యంత నాణ్యత ప్రమాణాలతో లడ్డు ప్రసాదం తయారీ. – మూలా నక్షత్రం రోజు కోసం రెండున్నర లక్షల లడ్డూలు సిద్ధం. – ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డా. జి.సృజన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : లడ్డు ప్రసాదం నాణ్యత విషయంలో రాజీ పడేది లేదని.. అత్యంత నాణ్యతా ప్రమాణాలను పాటిస్తూ అమ్మవారి లడ్డు, అన్న ప్రసాదాలను తయారు చేయడంతో పాటు భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఎప్పటికప్పుడు అవసరమైన లడ్డూలను అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. …
Read More »మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షన
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఇంద్రకీలాద్రిపై భక్తులకు చేసిన ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఎక్కడా ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా సామాన్య భక్తులకు సాఫీగా అమ్మ దర్శన భాగ్యం కల్పించేలా సేవలు అందించాలని అధికారులను ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. భక్తులతో మాట్లాడి అభిప్రాయాలు తీసుకున్నారు. దివ్యాంగులు, వృద్ధులకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. భక్తుల అభిప్రాయాలను తీసుకున్నారు. అనంతరం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి అలంకృత అమ్మవారిని దర్శించుకొని వేదపండితుల ఆశీర్వచనం తీసుకున్నారు.
Read More »జగజ్జనని పాదాల చెంత కళావైభవం
-మనోరంజకంగా సాగుతున్న సాంస్కృతిక ప్రదర్శనలు -వైభవోపేతంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : జగన్మాతను శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి రూపంలో దర్శించుకునేందుకు వస్తున్న భక్తులను ఆధ్యాత్మిక తరంగాలలో విహరింపజేసే కళా ప్రదర్శనలు రంజింప చేస్తున్నాయి. శరన్నవరాత్రి ఉత్సవాలలో పాల్గొని అమ్మవారిని కనులారా చూడాలని వస్తున్న భక్తులు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కళా ప్రదర్శనలు తిలకించి భక్తులు మైమరచిపోతున్నారు. ప్రతిరోజు కళావేదికపై నిత్య నూతనమైన స్వర, నృత్య ప్రదర్శనలు ఆహ్లాదకరంగా సాగుతున్నాయి. నవరాత్రి …
Read More »నిరంతర పర్యవేక్షణతో భక్తజన సంద్రానికి ఏర్పాట్లు
– సౌకర్యాలు పరంగా ఎక్కడ లోటు ఉన్నా వెంటనే గుర్తించి సరిదిద్దుతున్నాం. – సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అమ్మవారి దర్శన ఏర్పాట్లు. – జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.సృజన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో వైభవంగా దుర్గా నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి. భక్త జనసంద్రాన్ని ముందే ఊహించి చేసిన ఏర్పాట్లతో సామాన్య భక్తులకు సంతృప్తికరంగా అమ్మవారి దర్శన భాగ్యం లభిస్తోంది. జిల్లా కలెక్టర్ సృజన ఆదివారం పోలీస్ కమిషనర్ రాజశేఖర్ …
Read More »ఇంద్రకీలాద్రికి పోటెత్తిన భక్తులు
-పాలు, మజ్జిగ, మంచినీళ్లు నిరంతరం సరఫరా. -వేగంగా కదులుతున్న క్యూలైన్లు -సీఎం చంద్రబాబు ఆదేశాలతో పటిష్టమైన ఏర్పాట్లు -నిరంతర పర్యవేక్షణలో దేవాదాయశాఖ మంత్రివర్యులు ఆనం రామనారాయణరెడ్డి, ప్రిన్సిపల్ సెక్రటరీ సత్యనారాయణ, కలెక్టర్ డా. సృజన, ఈవో రామరావు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గా దేవి దసరా మహోత్సవాలు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం వైభవంగా నిర్వహిస్తోంది. నాలుగో రోజు ఆదివారం అమ్మవారు శ్రీ లలితా త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకు దర్శనమిస్తున్నారు. దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు …
Read More »ఆలయ ఈవో కె ఎస్ రామారావు ఆకస్మిక తనిఖీలు
-అనదికార దర్శనాల కట్టడికి చర్యలు -వృద్దులు, వికలాంగుల వసతుల క్షేత్ర స్థాయి పరిశీలన -ఏర్పాట్లపై భక్తులతో అభిప్రాయ సేకరణ -సంతృప్తి వ్యక్తపరచిన భక్తులు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా మహోత్సవములు సందర్బంగా ఇంద్రకీలాద్రి పై జగన్మాత ను దర్శించుకొనుటకు వివిధ ప్రాంతముల నుండి భక్తులు వేలాదిగా తరలివస్తున్నారు. ఈరోజు అనగా తేదీ 06.10.2024 న 4 వ రోజు అమ్మవారు శ్రీ లలితా త్రిపుర సుందరి దేవిగా దర్శనమిస్తుండగా ఉదయం 3 గం. ల నుండి భక్తులు విశేషముగా విచ్చేసి అమ్మవారిని …
Read More »4రోజున అమ్మవారు శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపం
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై నాల్గవ రోజుకు చేరుకున్న దసరా ఉత్సవాలు. దసరా వేడుకల్లో అమ్మవారు 4రోజున శ్రీలలితా త్రిపురసందరీదేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. ఇంద్రకీలాద్రిపై పెరిగిన భక్తుల రద్దీ… ఆదివారం కావడంతో పెద్ద సంఖ్యలో తరలివస్తున్న భక్తులు. ఉదయం నాలుగు గంటలకే కిక్కిరిసిన క్యూ లైన్లు. శ్రీచక్ర అధిష్టాన దేవతగా.. పంచదశాక్షరీ మంత్రాధిదేవతగా కొలిచే భక్తులకు అమ్మవారు వరప్రదాయినిగా నిలుస్తారు. అమ్మను ఈరోజు సేవిస్తే సర్వ విధ సౌభాగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ప్రకృతిశక్తికి ప్రతీక లలితాదేవి. మన చుట్టూ …
Read More »మూడవ రోజు అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సకల ప్రాణికోటికి జీవనాధారం అన్నం. అందుకే అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. ఈ రూపంలో అమ్మ రసపాత్రను ధరించి దర్శనమిస్తుంది. ఆధిభిక్షువైన ఈశ్వరుడికి భిక్షపెట్టిన దేవత అన్నపూర్ణాదేవి. ఈమెను ధ్యానిస్తే మేధాశక్తి వృద్ధి చెందుతుంది. మధుర భాషణం, సమయస్ఫూర్తి, వాక్ సిద్ధి, శుద్ధి, భక్తిశ్రద్ధలు, ఐశ్వర్యం కలుగుతాయి. మానవుణ్ణి సకల సంపూర్ణుడిగా ఈ దేవి అనుగ్రహిస్తుంది. ప్రపంచ సృష్టి పోషకురాలు ‘ అమ్మ‘ అనే అంతరార్థం ఈ అవతారంలో కనిపిస్తుంది. అమ్మ ధరించిన రసపాత్ర అక్షయ శుభాలను …
Read More »సామాన్య భక్తులకు త్వరితగతిన అమ్మవారి దర్శనం కల్పిస్తున్నాం…
-ఏర్పాట్లపై నిరంతర పర్యవేక్షణ -లోటుపాట్లను సవరించి సంతృప్తికరమైన దర్శన భాగ్యం -ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న రాష్ట్ర పండుగ దసరా శరన్నవరాత్రి ఉత్సవాలలో వివిధ శాఖల మధ్య కొన్ని సందర్భాలలో సమన్వయం లోపించడం వల్ల తలెత్తిన లోటుపాట్లను గుర్తించి, చక్కదిద్దామన్నారు. ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. సృజన అన్నారు. నవరాత్రి ఉత్సవాలలో రెండో రోజైన శుక్రవారం ఘాట్ రోడ్డులోని క్యూలైన్లను సమగ్రంగా పరిశీలించి, క్యూ లైన్ లో …
Read More »
Prajavartha Online Telugu News