Breaking News

Tag Archives: indrakiladri

శ్రీ కాత్యాయని దేవిగా శ్రీ కనకదుర్గమ్మ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దేవీ మహాత్మ్యంలో దుర్గామాత తొమ్మిది రూపాలలో ఒక రూపం కాత్యాయనీ దేవి. పురాణాల ప్రకారం ఈ అవతారం మహర్షి కాత్యాయనుడు చేసిన దీర్ఘ తపస్సు ఫలితంగా ప్రత్యక్షమైంది. అశుభశక్తుల వినాశనం, సత్యధర్మాల స్థాపన కోసం శక్తి స్వరూపిణి కాత్యాయనీ అవతరించింది. కాత్యాయనీ అవతారం – పురాణ విశేషాలు: మహిషాసురుడు అనే రాక్షసుడు లోకాలను జయించి, దేవతలను తరిమికొట్టాడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు అతని మీద యుద్ధం చేయలేకపోయారు. అప్పుడు వారి శక్తులన్నిటినీ సమన్వయించి కాంతిరూపిణిగా కాత్యాయనీని సృష్టించారు. …

Read More »

పలు విజ్ఞప్తుల మేరకు విఐపి దర్శన వేళల్లో మార్పులు

-కేటాయించిన సమయాల్లో వీఐపిలు అమ్మవారిదర్శనం చేసుకోవాలి -మూడవరోజు సాయంత్రానికి 31 లక్షల ఆదాయం -దుర్గగుడి ఈవో శీనా నాయక్ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : అమ్మవారిని దర్శించుకునేందుకు దేవస్థానానికి విచ్చేయుచున్న వివిఐపీలు, వీఐపీలు వారికి కేటాయించిన సమయాల్లోనే అమ్మవారిని దర్శించుకోవాలని దుర్గగుడి ఈవో శీనా నాయక్ విజ్ఞప్తి చేశారు.బుధవారం జరిగిన కార్యక్రమాలపై ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఈవో మాట్లాడుతూ… ప్రస్తుతం ప్రతి రోజు ఉదయం 7 నుండి 9 వరకు, సాయంత్రం 3 నుండి 5 వరకు ప్రోటోకాల్ …

Read More »

శ్రీకాళహస్తి దేవస్థానం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : అన్నపూర్ణ దేవిగా దర్శనమిస్తున్న దుర్గా అమ్మవారికి శ్రీకాళహస్తి దేవస్థానం తరపున పట్టు వస్త్రాలను, సారెను శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థాన ఈవో టి. బాపిరెడ్డి సమర్పించారు. శ్రీ జ్ఞాన ప్రసూనాంబిక సమేత శ్రీకాళహస్తీశ్వర ఆలయం నుంచి అమ్మవారికి పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం ఆనవాయితీ అని శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ కుమార్ రెడ్డి తెలిపారు. వేద పండితులు, మహిళలతో కలిసి పట్టు వస్త్రాలు, సారె సమర్పించడం ఆనందంగా ఉందని చెప్పారు. …

Read More »

అమ్మవారి ఆశీస్సులతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో సాగాలి

-అమ్మవారిని దర్శించుకోవడం దివ్యమైన అనుభూతి -దేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న నగరాలలో విజయవాడ ఒకటి -భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దసరా శరన్నవరాత్రులలో మూడవ రోజు అయిన బుధవారం అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తున్న అమ్మవారిని భారత ఉపరాష్ట్రపతి శ్రీ సిపి రాధాకృష్ణన్ సతీ సమేతంగా దర్శించుకున్నారు. ఉపరాష్ట్రపతికి రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ, విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, దేవాదాయ శాఖ కమిషనర్ రామచంద్ర మోహన్, …

Read More »

ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షన

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా తెలంగాణ, కర్ణాటక తదితర ప్రాంతాల నుంచి కూడా భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకునేందుకు తరలివస్తున్నారు. వచ్చిన ప్రతి ఒక్కరికి అమ్మ దర్శనం ఆధ్యాత్మిక వాతావరణంలో సంతృప్తికరంగా జరిగేలా చేసిన ఏర్పాట్లు విజయమంతమవుతున్నాయి. అమృతతుల్యమైన అన్నప్రసాదాన్ని అందించడంలో ఎక్కడా ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఇందులో భాగంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్. ఇలక్కియ అన్న ప్రసాదం తయారీ, అందజేయడంపై తనిఖీలు నిర్వహిస్తున్నారు. నాణ్యత విషయంలో రాజీ పడకుండా …

Read More »

నిరంతరం భక్తుల్లోనే..

-భక్తులతో మమేకమవుతూ ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకుంటూ.. -సమస్య ఏదైనా ఉంటే అక్కడికక్కడే సరిదిద్దుతూ.. -భక్తుల మన్ననలు పొందుతున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ -దసరా మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయా.. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా.. ఇలా భక్తులతో మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ.. ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : అప్పుడు ఇప్పుడు అని కాదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు.. ప్రతిచోటకు చురుగ్గా కదులుతూ …

Read More »

రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలని… దుర్గామాతను వేడుకున్నాను…

-పలాస శాసన సభ్యురాలు గౌతు శిరీష ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ భక్తుల దర్శనాలకి పెద్దపీట వేస్తున్నామని మాటల్లో కాకుండా చేతల్లో చూపుతున్న కూటమి ప్రభుత్వం నవరాత్రి ఉత్సవాలకు చేసిన ఏర్పాట్ల పట్ల ప్రజలు చాలా ఆనందంగా ఉన్నారని పలాస శాసనసభ్యురాలు గౌతు శిరీష అన్నారు. ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాతను ఆమె బుధవారం దర్శించుకున్నారు.

Read More »

శరన్నవరాత్రి ఉత్సవాల ఏర్పాట్లు బాగున్నాయి…

-జగన్మాతను దర్శించుకున్న రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురామకృష్ణరాజు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, కమిషనర్ రామచంద్ర మోహన్, దేవస్థానం కార్యనిర్వహణాధికారి శీనా నాయక్ నేతృత్వంలో నవరాత్రి ఉత్సవ నిర్వహణ ఏర్పాట్లు చాలా బాగా చేశారని రాష్ట్ర శాసనసభ ఉపసభాపతి కనుమూరి రఘురాం కృష్ణరాజు అన్నారు. బుధవారం ఆయన శ్రీ అన్నపూర్ణాదేవి అలంకృత జగన్మాతను దర్శించుకున్నారు. దర్శనానంతరం అమ్మవారి చిత్రపటం, తీర్థ ప్రసాదాలను వేద పండితులు అందజేశారు. ఆయనతోపాటు చిత్తూరు శాసనసభ్యులు గురజాల జగన్మోహన్ కూడా …

Read More »

ఇంద్రకీలాద్రిపై శ్రీ అన్నపూర్ణాదేవి అలంకృత అమ్మవారిని దర్శించుకుంటున్న భక్త జనం

-సాఫీగా సాగుతున్న క్యూ లైన్లు. -జై దుర్గా భవాని నామస్మరణతో అమ్మ దర్శనానికి వడివడిగా అడుగులేస్తున్న భక్తులు ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజు దుర్గమ్మ… శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో దర్శనమిస్తున్నారు. ఆశ్వయుజ మాసం ఆరంభంలో నిర్వహించే శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జగన్మాతను వివిధ అలంకారాల్లో ఆరాధిస్తారు. ఇంద్రకీలాద్రిపై నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దుర్గమ్మ రోజుకో అలంకారంలో దర్శనమిస్తుంది. మొదటి రోజు బాలా త్రిపుర సుందరి, రెండో …

Read More »

దసరా ఉత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు ఏర్పాట్లు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సెప్టెంబర్ 22 నుండి అక్టోబర్ 02 వరకు 11 రోజులు జరిగే దసరా ఉత్సవాలలో భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనకు రాష్ట్ర ప్రభుత్వం, ప్రజా ప్రతినిధుల ఆకాంక్షలకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి వి.కె.శీనానాయక్ తెలిపారు. ఆదివారం ఉదయం దసరా ఏర్పాట్లు పర్యవేక్షణ చేశారు. సి. వి. రెడ్డి చారిటీస్ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన నమూనా క్యూ లైన్ ను పరిశీలించి, కొన్ని మార్పులను ఈవో సూచించారు. భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించడానికి గతం …

Read More »