విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల సన్నిధిలో వైదిక కార్యక్రమాలు మరింత వైభవంగా జరుపుట, నిత్య పూజలు శాస్త్రోక్తంగా నిర్వహించుట, ఆషాఢ, శ్రావణ మాసములలో ఏర్పాట్లు తదితర విషయాలుపై ఆలయ కార్యనిర్వహణాధికారి వి.కె. శీనానాయక్ ఈరోజు సాయంత్రం దేవస్థానం వైదిక కమిటీ, ప్రధాన అర్చకులు, వేద పండితులుతో సమావేశం నిర్వహించారు. ఇటీవల దేవదాయ శాఖ కార్యదర్శి, కమిషనర్ నిర్వహించిన సమావేశంలో నిర్దేశం చేసిన అంశాలను వైదిక సభ్యులకు వివరించారు. ప్రతీ పౌర్ణమిరోజున శ్రీ కనకదుర్గ అమ్మవారు స్వర్ణ కవచంతో …
Read More »Tag Archives: indrakiladri
‘శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో విశేషాలు’
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి. శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు. లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం,చండీ హోమం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు. కార్యనిర్వహణధికారి వి.కె.శీనానాయక్ దర్శనం టికెట్ స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్లను పరిశీలించారు. ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ క్రమబద్దీకరించి, అందరికి శ్రీ …
Read More »“శ్రీ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన”
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన 06.04.2025 ఆదివారం శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన మంత్రపూర్వకంగా జరిగింది.చామంతి, సంపంగిపూల తో, దేవస్థానంలో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభం అయింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ అర్చకులు, సిబ్బంది అర్చన ప్రాంగణంకి వెదురు …
Read More »“ఇంద్రకీలాద్రి పై శ్రీరామ కళ్యాణం”
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీరామనవమిని పురస్కరించుకొని ఇంద్రకీలాద్రిపై శ్రీ సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. రాజగోపురం ప్రాంగణంలోని కళావేదిక పై ఈరోజు ఉదయం 10 గంటల నుండి పూజా క్రతువులు ప్రారంభం అయ్యాయి. ఆలయ స్థానాచార్య శివ ప్రసాద్ శర్మ, ప్రధాన అర్చకులు దుర్గా ప్రసాద్ ఆధ్వర్యంలో కార్యక్రమంనిర్వహించడమైనది. పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, సీతారామ కళ్యాణం వీక్షించారు. ఉపాలయం అయిన సీతానగరం శ్రీ మధ్విరాంజనేయ స్వామి వారి దేవస్థానం శ్రీ సీతారామ కళ్యాణం వైభవంగా జరిగింది.
Read More »శ్రీ దుర్గమ్మకు ప్రత్యేక పుష్పార్చన
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర వసంత నవరాత్రుల్లో ఏడవ రోజైన 05.04.2025 శనివారం శ్రీ కనక దుర్గ అమ్మవారికి ప్రత్యేక పుష్పార్చన మంత్రపూర్వకంగా జరిగింది.ఎర్ర తామర పూలు, ఎర్ర గన్నేరు పూలు, సన్న జాజులుతో నూతనంగా నిర్మించిన పూజా మండపం ( నటరాజ స్వామి ఆలయ ప్రాంగణం)లో ఉదయం 9 గంటల నుండి పుష్పార్చన వైభవంగా ప్రారంభం అయింది. శ్రీ కనకదుర్గ అమ్మవారి ప్రధాన ఆలయం నుండి పుష్పాలతో మంగళ వాయిధ్యాలు, వేద మంత్రాలు నడుమ ఆలయ అర్చకులు, …
Read More »ఇంద్రకీలాద్రి క్షేత్ర పాలక ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విశ్వావసు నామ సంవత్సర చైత్ర శుద్ధ అష్టమి ని పురస్కరించుకొని 05.04.2025 శనివారం ఇంద్ర కీలాద్రి క్షేత్ర పాలకుడైన ఆంజనేయ స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిగాయి. ఉదయం 6 గంటలనుండి శ్రీ అమ్మవారి ప్రధాన ఆలయ ప్రాంగణంలో కొలువై ఉన్న స్థిత క్షేత్ర పాలక శ్రీ ఆంజనేయ స్వామి కి, ఘాట్ రోడ్ లో గల ఉపాలయం లో కొలువైన స్వామి కి, శ్రీ అమ్మవారి పాత మెట్లు వద్ద గల ఆలయం లో కొలువైన …
Read More »ఇంద్రకీలాద్రి పై శాస్త్రోక్తముగా శ్యామలా నవరాత్రులు..
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవస్థానం లో తేదీ.30-01-2025, మాఘ శుద్ధ పాడ్యమి నుండి మాఘ శుద్ధ దశమి, తేది 07-02-2025 వరకు శ్రీ శ్యామల నవరాత్రి ఉత్సవాలు ఆగమోక్తముగా జరిగినవి. ఇందులో భాగముగా ఈరోజు 07-02-2025 న ఉదయం 9-30 గం లకు యాగశాల నందు మహా పూర్ణాహుతి కార్యక్రమంతో కార్యక్రమం పూర్తి అయినది. ఈరోజు ఈ పూర్ణహుతి కార్యక్రమం నందు ఆలయ డిప్యూటీ ఈవో ఎం. రత్నరాజు గారు పాల్గొన్నారు. దేవస్థానం నందు ఆలయ …
Read More »ఇంద్రకీలాద్రి హుండీ లెక్కింపు
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : గురువారం ఇంద్రకీలాద్రి, శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము హుండీ లెక్కింపు… నగదు: రూ. 2,28,81,128/- లు, కానుకల రూపములో – బంగారం: 328 గ్రాములు, – వెండి: 3 కేజీల 480 గ్రాములు విదేశీ కరెన్సీ: USA – 158 డాలర్లు, సౌదీ – 5 రియాల్స్, UAE – 130 దిర్హమ్స్, కేనేడా – 115 డాలర్లు, సింగపూర్ – 55 డాలర్లు, ఇంగ్లాండ్ – 65 పౌండ్లు, ఖతర్ – 1 రియాల్, …
Read More »దుర్గమ్మవారిని దర్శించుకున్నడిజిపి ద్వారకా తిరుమల రావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ అమ్మవారి దర్శనార్థం గురువారం రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ద్వారకా తిరుమల రావు, IPS దంపతులు ఆలయమునకు విచ్చేయగా అదనపు కమీషనర్ మరియు ఆలయ ఈవో కే. రామచంద్ర మోహన్ ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, అమ్మవారి దర్శనం కల్పించారు. అనంతరం ఆలయ వేదపండితులుచే వీరికి వేదాశీర్వచనం కల్పించగా, ఆలయ ఈవో శ్రీ అమ్మవారి శేషవస్త్రం, ప్రసాదములు, చిత్రపటం అందజేశారు. అనంతరం వీరు సంక్రాంతి సందర్బంగా దేవస్థానం నందు ఏర్పాటు చేసియున్న బొమ్మల కొలువు, …
Read More »ఇంద్రకీలాద్రి పై సంక్రాంతి వేడుకలు 2 వ రోజు…
ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : తేదీ. 13-01-2025 నుండి తేదీ. 15-01-2025 వరకు సంక్రాంతి వేడుకలు సందర్బంగా మంగళవారం ‘సంక్రాంతి’ రోజున ఆలయ ప్రాంగణములు వివిధ వర్ణముల పూలతో అలంకరించడం జరిగినది. సంక్రాంతి సందర్బంగా భక్తులు ఆలయమునకు విశేషముగా విచ్చేసి అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకున్నారు మరియు ఆర్జిత సేవలలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మహమండపం 7 వ అంతస్తులోని పెద్ద రాజగోపురం ఎదురుగా ఏర్పాటు చేసిన బొమ్మల కొలువు, చెక్క బండి తదితర కళాకృతులు భక్తులను విశేషముగా ఆకర్షింపజేస్తున్నాయి.
Read More »
Prajavartha Online Telugu News