Breaking News

‘శ్రీ దుర్గామల్లేశ్వరుల సన్నిధిలో విశేషాలు’

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
పవిత్ర ఇంద్రకీలాద్రి క్షేత్రంలో కొలువైన శ్రీ దుర్గా మల్లేశ్వరులకు, పరివార దేవతలకు ఈరోజు విశేష నిత్య పూజలు వైభవంగా జరిగాయి.

శుక్రవారం సందర్బంగా ఆది దంపతుల సన్నిధిలో వివిధ ఆర్జిత సేవల్లో భక్తులు విసృతంగా పాల్గొన్నారు.
లక్ష కుంకుమార్చన, శ్రీ చక్ర నవావరణార్చన, శాంతి కళ్యాణం,చండీ హోమం తదితర పూజల్లో విశేషరీతిలో భక్తులు పాల్గొన్నారు.
కార్యనిర్వహణధికారి వి.కె.శీనానాయక్ దర్శనం టికెట్ స్కానింగ్ పాయింట్, టికెట్ కౌంటర్లను పరిశీలించారు.
ప్రధాన ఆలయంలో భక్తుల రద్దీ క్రమబద్దీకరించి, అందరికి శ్రీ అమ్మవారి సత్వర దర్శనం అయ్యేలా అన్ని క్యూ లైన్లు త్వరగా నడిచేలా చర్యలు తీసుకున్నారు.
వివిధ క్యూ మార్గాల ద్వారా భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని దేవస్థానం అందిస్తున్న ఉచిత ప్రసాదము, నిత్య అన్నప్రసాదమును భక్తి శ్రద్దలతో స్వీకరించారు.
కొంగు ముడితో అమ్మవారి సన్నిధికి వచ్చిన నూతన జంటలకు అమ్మవారి దర్శనం, ఆశీర్వచనం అందజేయడమైనది.

ఆర్జిత సేవల కేంద్రం ను కార్యనిర్వహణాధికారి వి.కె.శీనానాయక్ పరిశీలించారు. వివిధ సేవలు గురించి, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు గురించి అక్కడ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక ఉపయోగించి ఇంకా పెద్ద స్థాయిలో భక్తులకు సేవలందించే దిశగా సిబ్బంది నైపుణ్యం పెంచుకోవాలని కార్యనిర్వాహణాధికారి సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలి

గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త : పదవి తరగతి సప్లమెంటరీలో ప్రతి విద్యార్థి ఉత్తీర్ణత సాధించాలని జిల్లా కలెక్టర్ సి.యం.సాయి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *