Breaking News

నిరంతరం భక్తుల్లోనే..

-భక్తులతో మమేకమవుతూ ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకుంటూ..
-సమస్య ఏదైనా ఉంటే అక్కడికక్కడే సరిదిద్దుతూ..
-భక్తుల మన్ననలు పొందుతున్న జిల్లా కలెక్టర్ లక్ష్మీశ
-దసరా మహోత్సవాలకు చేసిన ఏర్పాట్లు బాగున్నాయా.. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా..
ఇలా భక్తులతో మాట్లాడుతూ.. ఏవైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు ఇచ్చి సరిదిద్దుతూ ముందుకు సాగుతున్నారు.. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ..

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
అప్పుడు ఇప్పుడు అని కాదు. ఆ ప్రాంతం ఈ ప్రాంతం అని కాదు.. ప్రతిచోటకు చురుగ్గా కదులుతూ క్యూ లైన్ లలో సైతం భక్తులతో కలసి అడుగులు వేస్తూ ఏర్పాట్లపై అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. సమస్యలు ఏవైనా అక్కడికి అక్కడే పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ప్రతిఒక్కరికి సంతృప్తికరంగా అమ్మను దర్శించుకునేలా దిశా నిర్దేశం చేస్తున్నారు. 11 రోజులపాటు కొనసాగే శరన్నవరాత్రి ఉత్సవాలలో భక్తులకు ఎటువంటి సమస్యలు తలెత్తకుండా అక్కడికక్కడే…అప్పటికప్పుడే… శాశ్వత పరిష్కారం కోసం జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను భక్తులు ప్రశంసిస్తున్నారు. ప్రధానంగా దర్శనం కోసం భక్తులు వేచి చూచే సమయం తగ్గించడం… దర్శనానంతరం… లడ్డు ప్రసాదాల.. విక్రయ కేంద్రాల వద్ద రద్దీని నివారించడం… అన్న ప్రసాదం నిర్వహించే కేంద్రాలలో ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతమైన వాతావరణంలో భక్తులు అన్న ప్రసాదం స్వీకరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. 36 సెక్టార్లలో వందల మంది సిబ్బంది మధ్య సమన్వయం సాధించి మహోత్కృష్టమైన రాష్ట్ర పండుగను అమ్మవారిని దర్శించుకున్న ప్రతి ఒక్కరూ ఏడాది పొడవునా గుర్తుంచుకునేలా నిర్వహించడమే లక్ష్యంగా జిల్లా కలెక్టర్ తీసుకుంటున్న చర్యలను ప్రతి భక్తుడు అభినందించడం విశేషం.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఇంటి గోడపై జనాభా లెక్కల గుర్తులు, అంకెలు వేయుటకు సహకరించండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో జనగణన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *