Breaking News

Tag Archives: indrakiladri

ఇంద్రకీలాద్రిపై త్వరలో నూతన క్యూ కాంప్లెక్స్ : స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానానికి నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మించేందుకు ముఖ్యమంత్రి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని స్వచ్ఛ్ ఆంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. దసరా శరన్నవరాత్రులలో పదవ రోజైన బుధవారం శ్రీ మహిషాసుర మర్దిని గా దర్శనమిస్తున్న అమ్మవారిని పట్టాభిరామ్ దర్శించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ… దుర్గగుడి అభివృద్ధికి ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోందని చెప్పారు. భక్తుల సౌకర్యార్థం నూతన క్యూ కాంప్లెక్స్ నిర్మాణానికి ముఖ్యమంత్రి అంగీకరించారని …

Read More »

అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి

-టీటీడీ బోర్డు సభ్యులు సుచిత్ర ఎల్లా, నన్నపనేని సదాశివరావు -టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాల సమర్పణ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇరు తెలుగు రాష్ట్రాలపై అమ్మవారి ఆశీస్సులు ఉండాలని తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలు సుచిత్ర ఎల్లా అన్నారు. బుధవారం ఇతర బోర్డు సభ్యులు నన్నపనేని సదాశివరావు, టి. జానకి దేవి, ఏ. రంగశ్రీ లతో కలిసి టీటీడీ తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా సుచిత్ర ఎల్లా మాట్లాడుతూ…. అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం …

Read More »

దసరా మహోత్సవములు సందర్భంగా విజయవాడ దుర్గమ్మకు టీటీడీ పట్టువస్త్రాలు సమర్పణ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీ దుర్గా మల్లేశ్వరస్వామి దేవస్థానం, ఇంద్రకీలాద్రి, విజయవాడలో జరిగే దసరా శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని, తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తరఫున ప్రతి ఏటా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించడం సంప్రదాయం. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల మధ్య ఉన్న ఈ ఆధ్యాత్మిక బంధాన్ని ఈ అర్పణ చాటిచెబుతుంది. శరన్నవరాత్రి ఉత్సవాల సమయంలో టి. టి. డి దేవస్ధాన తరుపున ఎక్స్-అఫీషియో సభ్యులు రామచంద్ర మోహన్ గారు (Commissioner of Endowments Department ) టీటీడీ సభ్యులు ఎన్. సదాశివ …

Read More »

మనసంతా అమ్మతో..

-భవానీల రాకతో కొండపై పెరిగిన రద్దీ… -పకడ్బందీ ఏర్పాట్లతో అందరికీ సంతృప్తికర దర్శనం -అధికార యంత్రాంగంపై భక్తుల ప్రశంసల వర్షం ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : సాధారణ భక్తులకు తోడుగా… భవాని మాలధారుల రాకతో ఇంద్రకీలాద్రి పర్వతం జై భవాని నినాదాలతో మార్మోగుతోంది. రైల్వే స్టేషన్, బస్టాండ్ ప్రాంతాల నుంచే అధికార యంత్రాంగం ఒక నిర్ణీత పద్ధతిలో ఎక్కడా భక్తుల రద్దీ కారణంగా ట్రాఫిక్ అవరోధాలు ఎదురుకాకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ, నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, …

Read More »

శ్రీ మహిషాసుర మర్దినీదేవి అవతారం – శక్తి వైభవం..

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : నవరాత్రి ఉత్సవాల్లో మహిషాసుర మర్దిని అవతారం విశిష్టత విశేషంగా పరిగణించబడుతుంది. మహిషాసుర మర్దిని రూపం అతి ప్రధానమైనది. ఈ అవతారం శక్తి, ధైర్యం, న్యాయం, ధర్మ పరిరక్షణలకు సంకేతంగా నిలుస్తుంది. పురాణ కథనం ప్రకారం.. మహిషాసురుడు అనే అసురుడు కఠిన తపస్సు చేసి బ్రహ్మదేవుని ఆశీర్వాదంతో అమోఘ శక్తులు పొందాడు. దేవతలు, ఋషులు, మానవులను దౌర్జన్యాలకు గురి చేస్తూ లోకాన్ని కలవరపరిచాడు. ఆ సమయంలో దేవతల సమిష్టి శక్తి నుంచి వెలిసిన దుర్గామాతే మహిషాసుర మర్దిని. సింహ …

Read More »

వీనుల విందుగా చతుర్వేద పారాయణ సభ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి ప్రత్యేక కుంకుమార్చన మంటపంలో మంగళవారం జరిగిన చతుర్వేద పారాయణ సభ వీనుల విందుగా సాగింది. బ్రహ్మశ్రీ చింతపల్లి ఆంజనేయ ఘనపాటి అధ్యక్షతన జరిగిన ఈ పండిత సన్మాన సభకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన 450 మంది వేద పండితులు, వేద విద్యార్థులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన దుర్గగుడి ఈవో శీన నాయక్ మాట్లాడుతూ… గత 50 సంవత్సరాలుగా దసరా మహోత్సవాలలో చతుర్వేద పారాయణ సభ జరుగుతోందని చెప్పారు. …

Read More »

లక్షలాది భక్తులకు అలుపెరగని సేవలు

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : విజయవాడ ఇంద్రకీలాద్రి దసరా నవరాత్రులలో అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుంచే కాక దేశంలోని సుదూర ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు అవసరమైన సేవలందించడానికి దేవస్థానం, జిల్లా యంత్రాంగం, స్వచ్ఛంద సంస్థలతో కలిసి పలు ఏర్పాట్లు చేశాయి. చిన్నారులకు వేడి పాలు, బిస్కెట్లు అందిస్తున్నారు. రద్దీగా ఉండే క్యూలైన్లలో ప్రతి ఒక్కరికి అందేలా విశేష కృషి చేస్తున్నారు. మొదటి ఎనిమిది రోజులలో 1,75,000 బిస్కెట్ ప్యాకెట్లను, మూడు లక్షల అరవై వేల మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. …

Read More »

ప్రశాంత దర్శనం…భక్తుల సంతోషం..

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి దసరా మహోత్సవాలలో తొమ్మిదో రోజు మంగళవారం అమ్మలగన్నయమ్మ ముగ్గురమ్మల మూలపుటమ్మ జగన్మాత శ్రీ దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఇంద్రకీలాద్రి ఆలయ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా యంత్రాంగం, పోలీస్ శాఖ, నగర పాలక సంస్థ… ఇతర శాఖల సమన్వయంతో చక్కగా పనిచేస్తుండడంతో ప్రతిఒక్కరూ ఆహ్లాదకర దర్శన భాగ్యం పొందుతున్నారు. భక్తుల రాకతో దేవస్థానం పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో అలారారుతున్నాయి.

Read More »

శ్రీ దుర్గా దేవి అలంకారం విశిష్టత… భక్తులను కట్టిపడేస్తున్న దివ్య శోభ

ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : శరన్నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైన క్షణం నుంచి ఇంద్రకీలాద్రిపై వెలసిన కనకదుర్గ అమ్మవారి ఆలయం భక్తుల రద్దీతో కిక్కిరిసి పోతుంది. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేక అలంకారంలో దర్శించేందుకు భక్తులు దూరదూరాల నుంచి తరలి వస్తున్నారు. అమ్మవారి అలంకార దర్శనం కేవలం భక్తి పరంగా మాత్రమే కాక, పురాణాలు, ఆధ్యాత్మికత, సాంప్రదాయం కలగలిసి ఉన్న ఒక దివ్య అనుభూతిగా నిలుస్తోంది. పురాణ మూలాలు – దేవతల సమ్మేళనం పురాణాల ప్రకారం మహిషాసురుడు అనే రాక్షసాధిపతి దుర్మార్గాలను అరికట్టడానికి సకల …

Read More »

శ్రీ సరస్వతి దేవి అలంకృత దుర్గామాతను దర్శించుకోవడం సంతోషకరం

-కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇంద్రకీలాద్రి, నేటి పత్రిక ప్రజావార్త : ఇంద్రకీలాద్రి పర్వతంపై కొలువైవున్న దుర్గామాతను దర్శించుకోవడం తనకు ఎంతో సంతోషంగా ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ అన్నారు. అమ్మవారి జన్మ నక్షత్రమైన మూలా నక్షత్రం శుభ ఘడియల్లో ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ వేద పండితులు సంప్రదాయ బద్ధంగా స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద ఆశీర్వచనం అందజేశారు. అనంతరం అమ్మవారి తీర్థ ప్రసాదాలు, చిత్రపటం, శేష వస్త్రాన్ని స్వీకరించారు. దర్శనం అనంతరం మీడియా పాయింట్ వద్ద …

Read More »