తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఏపీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, మహారాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ దామా శేషాద్రి నాయుడు, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు స్వామివారి సేవలో పాల్గొన్నారు. ప్రముఖులకు ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేసిన తితిదే అధికారులు.. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో కరోనా ప్రభావం …
Read More »Tag Archives: tirumala
టీటీడీ చైర్మన్ గా వైవి సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల తిరుపతి దేవస్థానాల చైర్మన్ వైవి సుబ్బారెడ్డి బుధవారం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయంలో బంగారు వాకిలి వద్ద ఈవో డాక్టర్ కెఎస్ జవహర్ రెడ్డి, సుబ్బారెడ్డి తో ప్రమాణం చేయించారు. అనంతరం ఆయన కుటుంబ సభ్యులతో స్వామి వారిని దర్శించుకున్నారు. రంగనాయకుల మండపంలో పండితులు వేద ఆశీర్వచనం చేశారు. ఈవో డాక్టర్ జవహర్ రెడ్డి చైర్మన్ ని శాలువతో సన్మానించి స్వామివారి ప్రసాదం, చిత్రపటం అందించారు. పలువురు ప్రజాప్రతినిధులు చైర్మన్ ని …
Read More »తిరుమలలోని పలు ప్రాంతాల్లో ఈవో తనిఖీలు…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్‌రెడ్డి శుక్రవారం తిరుమలలోని పలు ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. గతంలో తనిఖీల సందర్భంగా సూచించిన పలు పనుల ప్రగతిని పరిశీలించారు. అనంతరం ఈవో మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో ఖాళీగా ఉన్న ప్రదేశాల్లో పచ్చదనం పెంచి భక్తులకు ఆహ్లాదకరంగా ఉండేలా తీర్చిదిద్దేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. దక్షిణ మాడ వీధిలో పచ్చదనం పెంచేలా, అవసరమైన ఇతర ప్రాంతాలు, కాటేజీల మధ్యభాగంలో ఉద్యానవనాలు పెంచేలా చర్యలు చేపట్టామని తెలిపారు. భక్తులు నడిచే ఫుట్‌పాత్‌లలో విరిగిన టైల్స్ స్థానంలో …
Read More »శ్రీవారి భక్తులకు సులభంగా, త్వరిత గతిన వసతి : టిటిడి ఈవో
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : తిరుమల శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు సులభంగా, త్వరిత గతిన వసతి సౌకర్యం కల్పించాలని టిటిడి ఈవో డాక్టర్ కె.ఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. టిటిడి పరిపాలనా భవనంలోని తన ఛాంబర్‌లో గురువారం ఆయన వసతిపై నూతనంగా రూపొందించిన సాఫ్ట్‌వేర్‌పై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ టిటిడి ఐటి విభాగం నూతనంగా రూపొందించిన అకామిడేషన్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ బాగుందన్నారు. విఐపి సిఫారసు లెటర్లు, శ్రీవాణి ట్రస్టు భక్తులకు కూడా సాఫ్ట్‌వేర్ ఉపయోగపడేలా చేయాలన్నారు. తిరుమలలో …
Read More »జులై 28న తిరుమలలో పల్లవోత్సవం…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : మైసూరు మహారాజు జన్మించిన ఉత్తరాభాద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తిరుమలలో జులై 28వ తేదీ బుధవారం పల్లవోత్సవం జరుగనుంది. ఇందులో భాగంగా సహస్రదీపాలంకారసేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేస్తారు. కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పిస్తారు. మైసూరు మహారాజు జ్ఞాపకార్థం దాదాపు 300 సంవత్సరాల నుండి పల్లవోత్సవాన్ని టిటిడి నిర్వహిస్తోంది. మొదట్లో ఈ ఉత్సవాన్ని తోటోత్సవం అనేవారు. …
Read More »20న రూ. 300 టీటీడీ దర్శన కోటా టికెట్ల విడుదల…
తిరుమల, నేటి పత్రిక ప్రజావార్త : శ్రీవారి భక్తులకు ఇది శుభవార్తే. ఈ నెల 20న ఆగస్టు నెలకు సంబంధించిన రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లను విడుదల చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. 20న ఉదయం 9 గంటల నుంచి టీటీడీ అధికారిక వెబ్‌సైట్ తిరుపతిబాలాజీ.ఏపీ.జీవోవీ.ఇన్ (tirupatibalaji.ap.gov.in) తోపాటు ‘గోవిందా’ యాప్‌లోనూ టికెట్లు అందుబాటులో ఉంటాయని టీటీడీ తెలిపింది. కరోనా నేపథ్యంలో ప్రస్తుతం 5 వేల టికెట్లను మాత్రమే విడుదల చేస్తుండగా మున్ముందు మరిన్ని టికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది.
Read More »
Prajavartha Online Telugu News