-ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పశ్చిమలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేసి పేదలకు సేవ చేయడం అభినందనీయమని ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. బ్లూ మింక్ హెల్త్ కేర్, కార్తీక్ హార్ట్ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో ఊర్మిళా నగర్ లోని హెచ్ ఒ కన్వెన్షన్ సెంటర్ నందు ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఎన్టీఆర్ జిల్లా బిజెపి అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ ముఖ్య అతిథులుగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ వైద్య శిబిరంలో వందమందికి పైగా గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన వ్యాధులకు చికిత్సను అందించి అవసరమైన వారికి మందులను పంపిణీ చేశారు. సమాజ సేవలో భాగస్వామ్యమైన డాక్టర్ విశ్వనాధ కార్తీక్ ను నిర్వాహకులు అభినందించారు. కార్యక్రమంలో బిజెపి నాయకులు దుర్భేసుల హుస్సేన్, షేక్ సోహెల్, దుర్బేసుల మీరా వలి సాయి తదితరులు పాల్గొన్నారు.