విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడలో కొనసాగుతున్న ఆరవ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల్లో సుజనా ఫౌండేషన్ చేసిన భోజన ఏర్పాట్లు అతిధులను, ఆహ్వానితులను ఆకట్టుకుంటున్నాయి. రచయితల మహాసభలకు వచ్చినవారు సంతృప్తిగా భోజనం చేస్తున్నారు. రెండో రోజైనా ఆదివారం మహాసభలు జరుగుతున్న కేబీఎన్ కళాశాలలోని భోజనం ఏర్పాట్లను ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ పర్యవేక్షించారు. ప్రతి ఒక్కరినీ ఆత్మీయంగా పలకరిస్తూ భోజనం ఏర్పాట్లను దగ్గరుండి చూసుకున్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఆదేశాలతో సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇస్కాన్ సహకారంతో సమిష్టిగా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Prajavartha Online Telugu News