Breaking News

బిఎస్‌ఎన్‌ఎల్‌ మిగులు భూములు విక్రయం

-ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బిఎస్‌ఎన్‌ఎల్‌ నెట్‌వర్క్‌ విస్తరణ మౌలిక సదుపాయాలు, పెట్టుబడులు పెట్టేందుకు మిగులు భూములు బిల్డింగ్‌ ఆస్తులు మానిటైజేషన్‌ చేస్తున్నామని టెలికం ఏపీ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.శేషాచలం తెలిపారు. చుట్టుగుంటలోని బీఎస్‌ఎన్‌ఎల్‌ భవన్‌లో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… మిగులు భూములను విక్రయించడం ద్వారా గత సంవత్సరంలో రూ 40 కోట్ల ఆదాయం వచ్చిందని, అలాగే ఆంధ్రప్రదేశ్‌ అంతటా ప్రధాన ప్రదేశాలలో మిగులు నిర్మాణాల స్థలాలను లీజుకు ఇవ్వడం ద్వారా సుమారు 10 కోట్ల ఆదాయం లభించిందన్నారు. దేశ వ్యాప్తంగా ప్రముఖ ప్రాంతాల్లో 27 మిగులు భూములను ఎంఎస్‌టిసి ద్వారా ఈ-వేలంలో ఉంచామని అన్నారు. తుని, బ్యాంక్‌ కాలనీలో ఉన్న 6,377 చదరపు మీటర్లకు రిజర్వు ధర రూ.12.94 కోట్లు, పాలకొల్లు టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ దగ్గర, 13వ వార్డు, స్టోర్‌ యార్డ్‌ కాంపౌండ్‌లో 4,180 చదరపు మీటర్ల స్థలానికి రిజర్వు ధర రూ.11.19 కోట్లు, కొండపల్లి, టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌ కాంపౌండ్‌, డో.నెం.7`150/1 ఆరు వేల చదరపు మీటర్ల స్థలానికి రిజర్వు ధర రూ.11.02 కోట్లు రిజర్వు ధర నిర్ణయించినట్లు వివరించారు. పూర్తి వివరాల కోసం షషష.పంఅశ్రీ.షశీ.ఱఅ/శీజూవఅషఎష/పంఅశ్రీ/దీూచీూ/ ఙఱత్‌ీబaశ్రీబిసa్‌aతీశీశీఎ వెబ్‌సైట్‌ను సందర్శించాలని సూచించారు. మరిన్ని వివరాలకు 94901000722 సంప్రదించాలని కోరారు. ఈ-బిడ్డింగ్‌ జూలై ఒకటో తేదీతో ముగుస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కృష్ణాజిల్లా ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ వై.రవీంద్రనాథ్‌, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ హెన్‌ఆర్‌ అండ్‌ అడ్మిన్‌ కే వెంకట సత్యప్రసాద్‌, సీనియర్‌ జనరల్‌ మేనేజర్‌ ఫైనాన్స్‌ యం.రత్నబాబు, ప్రిన్సిపల్‌ జనరల్‌ మేనేజర్‌ సర్కిల్‌ కార్యాలయం బి.రవీకుమార్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *