Breaking News

సీఎం చంద్రబాబుకి కృతజ్ఞతలు తెలిపిన ‘కురుబ సంఘం’

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సార్వత్రిక ఎన్నికల్లో చారిత్రాత్మక విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుకు రాష్ట్ర కురుబ తరుపున అభినందనలు తెలుపుతున్నామని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర కురుబ సంఘ నాయకులు తెలిపారు. అదివారం గాంధీనగర్‌ని ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎపి రాష్ట్ర కురుబ సంఘ నాయకులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమ కురుబ కులాన్ని గుర్తించి హిందూపురం పార్లమెంటు స్థానాన్ని వీకే పార్థసారథికి, కర్నూల్‌ పార్లమెంటు స్థానాన్ని పంచలింగాల నాగరాజుకి, పెనుగొండ శాసనసభ స్థానం ఎస్‌.సవితాకి కేటాయించడం జరిగిందని చెప్పారు. తమ అభ్యర్థులు అందరూ విజయం సాధించడం జరిగిందని సవితని రాష్ట్ర ముఖ్యమంత్రిగా క్యాబినెట్‌లో స్థానం కల్పించడం జరిగిందన్నారు. ప్రత్యేకంగా రాష్ట్ర కురుబ సంఘం తరపున ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పంలో జరిగిన కనకదాస విగ్రహం బహుకరించి ఆవిష్కరించిన సభలో కురుబ కులాన్ని ఆర్థికంగా సామాజికంగా రాజకీయంగా అభివృద్ధిలోకి తీసుకొస్తామని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. రాజకీయంగా తమకు ఎమ్మెల్సీ, టిటిడి దేవస్థానం బోర్డు మెంబర్‌గా అవకాశం కల్పిస్తామని అన్నారని తెలిపారు. కనకదాస పీఠం ఏర్పాటుకు సహకరిస్తామని, గుడి పూజారులకు గౌరవ వేతనం, గొర్రెల సబ్సిడీ లోన్స్‌, గొర్రెల కాపరులకు జీవిత భీమా, విద్యాభివృద్ధికి సహకరిస్తామని ఇచ్చిన హామీలను కూడా పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు పి.నాగభూషణం, బి.ఆంజనేయులు, ఎన్‌.ఈశ్వరయ్య, బి.మురళి మనోహర్‌, బి.రెడ్డి ప్రసాద్‌, కె.శ్రీనివాసరావు, ఆవులరెడ్డి శేఖర్‌, బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

Check Also

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాను : దేవినేని అవినాష్

విజ‌య‌వాడ‌, నేటి పత్రిక ప్రజావార్త : తూర్పు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *