-9041 క్లస్టర్స్ పరిథిలో 5128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే పంపిణి పంపిణీ
-తొగుమ్మి గ్రామంలో దివ్యంగ తల్లి కొడుకులకు ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి
కొవ్వూరు, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు గోదావరి జిల్లా పరిథిలో 17 కేటగిరి ల కింద 2,37,389 మందికి రూ.101 కోట్ల 63 లక్షల 33 వేల రూపాయల ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రత పెన్షన్ల పంపిణీ కి ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి తెలిపారు. శనివారం ఉదయం కొవ్వూరు మండలం తొగుమ్మి గ్రామంలో ఆర్డీవో రాణి సుస్మిత తో కలిసి ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కలెక్టరు పాల్గొన్నారు.
డిసెంబర్ 1 వ తేదీ ఆదివారం ప్రభుత్వ సెలవు దినం నేపథ్యంలో నవంబర్ 30 వ తేదీ శనివారం ఉదయం పెన్షన్ లు ఇంటి వద్దనే అందజేయడం జరుగుతుంది అని పేర్కొన్నారు. ఇందుకోసం జిల్లా వ్యాప్తంగా 18 రూరల్ మండలాల్లో, 3 పట్టణ ప్రాంతాల్లో 9041 క్లస్టర్స్ పరిథిలో 5128 మంది సిబ్బందిచే ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణి చేయనున్నట్లు కలెక్టరు ప్రశాంతి తెలియ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, తొగుమ్మీ గ్రామంలో దివ్యాంగులైన తల్లి కొడుకులకు తామరపల్లి నూకరత్నం, తామరపల్లి సంతోష్ లు ఒక్కొక్కరికి 15 వేల రూపాయలు చొప్పున పెన్షన్ పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనుకోని కారణాల వలన పెన్షన్ పంపిణీ అందుకోలేని పెన్షన్ తీసుకోని పింఛనుదారులకు మూడు నెలల వరకు పెన్షన్ బకాయిలు చెల్లించబడతాయని పేర్కొన్నారు. పింఛనుదారులు 3 నెలలు నిరంతరంగా పింఛను తీసుకోని వారిని శాశ్వత వలసగా పరిగణించి వారి పెన్షన్ నిలిపివేయబడుతుందని, అభ్యర్థనను తేదీ నుండి 3 నెలల లోగా ఎలాంటి బకాయిలు లేకుండా రోల్‌బ్యాక్ పింఛను విడుదల చేస్తామని కలెక్టర్ తెలియ చేశారు. కుటుంబ పోషణ కోసం ప్రతి నెలా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పొందే పెన్షనర్ మరణిస్తే జీవిత భాగస్వామి పెన్షన్ ప్రామాణిక ఆపరేటింగ్ విధానం లో పెన్షన్ మంజూరు చెయ్యడం జరుగుతుందని తెలిపారు. ఉదయం 11 గంటలకి జిల్లా లో 237389 మంది పెన్షన్ దారులకు గాను 215424 (90.75 శాతం) ఇంటి వద్దనే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ పూర్తి చేసి నట్లు తెలిపారు.
ఆర్డీవో రాణి సుస్మిత మాట్లాడుతూ, కొవ్వూరు మండలం, అర్బన్ ప్రాంతంలో 536 క్లస్టర్ ఏరియాలో 265 మంది సిబ్బంది ద్వారా 14,048 మందికి పింఛన్లు పంపిణి చేసేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.