నవంబర్ 30తేది (నేడు) మధ్యాహ్నం నుండి జిల్లా లోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడీ కేంద్రాలకు, జూనియర్ కళాశాలకు సెలవు

-జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్

తిరుపతి, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అక్టోబర్ 30వ తేది (నేడు) శనివారం తిరుపతి జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, అన్ ఎయిడెడ్ విద్యాసంస్థలకు, అంగన్వాడి కేంద్రాలకు, జూనియర్ కళాశాలలకు మధ్యాహ్నం నుండి సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎస్. వెంకటేశ్వర్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగాళా ఖాతంలో ఏర్పడిన అల్పపీడనం పెంగాల్ తుఫాన్ గా మారడం వలన జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో మరియు వాతావరణ శాఖ, విపత్తు నిర్వహణ శాఖ హెచ్చరికల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా తిరుపతి జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు, అంగన్వాడి కేంద్రాలకు, అన్ని జూనియర్ కళాశాలలకు నేడు నవంబర్ 30న శనివారం మధ్యాహ్నం సెలవు దినముగా ప్రకటిస్తూ, ఈ ఉత్తర్వులను సంబంధిత యాజమాన్యాలన్నీ విధిగా పాటించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో ఆదేశించారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ప్రజలందరికీ సురక్షితమైన, స్వచ్ఛమైన తాగు నీరందించేలా చర్యలు

-నీటి సరఫరాలో నాణ్యతా లోపాలు లేకుండా నిరంతర పర్యవేక్షణ -⁠ఆధునీకరించి నాగులాపల్లి సమగ్ర రక్షిత మంచి నీటి పథకాన్ని ప్రారంభించిన …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *