Breaking News

లోక్ నాయక్ పౌండేషన్ నుండి ప్రతి ఏటా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులు

-పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్
-విజయవాడలో ఘనంగా నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతి వేడుకలు
-ముగ్గురు పాత్రికేయిలకు ఒక్కొక్కరికీ రూ.50వేలు నగదు పురస్కారం

విజ‌య‌వాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పాత్రికేయ జగత్తు దృవతార దివంగత నార్ల వెంకటేశ్వరరావు పేరిట ఇకపై ప్రతి సంవత్సరం ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందించనున్నట్లు పద్మ భూషణ్, అచార్య యార్లగడ్డ లక్ష్మి ప్రసాద్ తెలిపారు. పత్రికా సంపాదకీయలను ఒక ఉద్యమంగా, సామాజిక సంస్కరణలకు స్పూర్తిగా ఉపయోగించిన నార్ల, పత్రికా సమాజానికి దిక్సూచి వంటి వారని కొనియాడారు, నార్ల వెంకటేశ్వరరావు 116వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆయన విగ్రహం వద్ద నివాళి అర్పించారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ఈ కార్యక్రమం జరగగా పలువురు సాహితీ వేత్తలు, రచయితలు, పాత్రికేయిలు నార్ల విగ్రహానికి పుష్పర్చన గావించారు. ఈ సందర్భంగా అచార్య యార్లగడ్డ మాట్లాడుతూ ఆధునిక తెలుగు జర్నలిజానికి ఆద్యునిగా వినతి కెక్కిన నార్ల వెంకటేశ్వరరావు నీతి, నిజాయితే తన ఆభరణంగా వ్యవహరించారన్నారు. అనాడు అధికార దుర్వీనియోగంపై ఎక్కు పెట్టిన ఎన్నో సంపాదకీయాలు నేటి తరానికి మార్గదర్శిగా నిలుస్తాయన్నారు. లోక్ నాయక్ ఫౌండేషన్ నేతృత్వంలో ఇకపై ప్రతి సంవత్సరం ముగ్గురు జర్నలిస్టులకు ఒక్కొక్కరికీ రూ.50వేల నగదు పురస్కారంతో విజయవాడ వేదికగా నార్ల ఉత్తమ పాత్రికేయ అవార్డులను అందిస్తామన్నారు. గ్రామీణ, పట్టణ, నగర ప్రాంతాల నుండి ఒక్కొక్కరిని ఎంపిక చేస్తామని, ఇందుకోసం లబ్దప్రతిష్టులతో కమిటీని ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. అవార్డుల ప్రధానం ప్రతి సంవత్సరం డిసెంబరు 1 వతేదీన క్రమం తప్పకుండా జరగుతుందని అచార్య యార్లగడ్డ స్పష్టం చేసారు. లోక్ నాయక్ పౌండేషన్ గత 21వ సంవత్సరాలుగా విశాఖ వేదికగా ఉత్తమ సాహితీ వేత్తలకు రూ.2 లక్షల పురస్కారం, ముగ్గురు సామాజిక సేవకులకు జీవన సాఫల్య పురస్కారాలుగా ఒక్కొక్కరికి లక్ష వంతున రూ.3 లక్షలు, మొత్తంగా రూ.5 లక్షల నగదు బహుమతితో క్రమం తప్పకుండా అందచేస్తూ వస్తుందన్నారు. తాజాగా పాత్రికేయిలకు కూడా పురస్కారాలు అందించాలని నిర్ణయించామన్నారు. కార్యక్రమంలో ఆంధ్ర నాటక కళా సమితి అధ్యక్షులు గోళ్ల నారాయణరావు, ప్రముఖ కవి బండ్ల మాధవరావు, ప్రముఖ విద్యావేత్త గుమ్మా సాంబశివరావు, సుంకర నాగభూషణం తదితరులు పాల్గొన్నారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *