Breaking News

500 కుటుంబాలకు న్యాయం చేయాలి…

-ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్ సివిలియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ ప్రెస్ క్లబ్ లో గురువారం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు వై.చిట్టి బాబు మాట్లాడుతూ జనవరి 2020 లో ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ సివిలియన్ గా, 2156 మంది ని తీసుకున్నారని, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా 2022 మార్చి 31న తీసివేశారు. మేము పోలీస్ శాఖలు విధులు నిర్వహించామని, బోర్డర్ చెక్పోస్టుల్లో అక్రమ మద్యం పట్టుకునే డ్యూటీ మాది అని, అలాగే ఇసుక, గంజాయి, ఎస్ ఈ బి పార్టుమెంటుకి అనుబంధంగా ఉండే వాళ్ళమని అన్నారు. మమ్మల్ని తీసివేసిన తర్వాత మరల ఉద్యోగాలు ఇవ్వాలని, గత ప్రభుత్వం లో అధికారులు కలిశామని, ఎలాంటి జీవో లేకుండా విధుల నుంచి తొలగించారని, మమ్మల్ని జీవో ద్వారానే విధులకు తీసుకున్నారని అన్నారు. మేము అధికారంలోకి వస్తే కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ప్రభుత్వం వచ్చి ఆరు నెలలైనా మమ్మల్ని పట్టించుకోవడంలేదని, సీఎం గారిని, డిప్యూటీ సీఎం ని కలిసామని, మేము లెటర్ పంపిస్తాం డీజీపీ గాని కలవమన్నారని డిజిపి ని కలిసిన ఏమి పట్టించుకోవటం లేదని అన్నారు. ఈగల్ టీమ్ అని కొత్తగా పెట్టారని అందులోనైనా మమ్మల్ని తీసుకోవాలని, 2156 ఉన్న మా సభ్యులు అందరూ వివిధ పనిలోకి పోగా సుమారుగా 500 మంది ఉన్నారని, ఈ 500 మంది కైనా ఉద్యోగాలు ఇచ్చి మా కుటుంబాలను ఆదుకోవాలని, సీఎం ని, డిప్యూటీ సీఎంని, లోకేష్ ని, హోం మినిస్టర్ ని 500 కుటుంబాలకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం అన్నారు.

కె. ధర్మచందు మాట్లాడుతూ… రాష్ట్రంలో ఉన్న 500 మంది స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ను కొత్తగా ఏర్పర్చిన ఈగల్ టాస్క్ ఫోర్స్ లో విలీనం చేసి 500 మంది కుటుంబాలను ఆదుకోవాలని, కనీసం జిల్లాకు 20మందిని అయినా స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ తీసుకొని ఆదుకోవాలని, ప్రభుత్వానికి విన్నవిస్తున్నాము. కరోనాలో కూడా ప్రాణాలు విడిచి లెక్కచేయకుండా డ్యూటీలు చేశామని, రాష్ట్రంలో ఉన్న 26 జిల్లాల్లో ఉన్న 500 మందిని స్పెషల్ పోలీస్ ఆఫీసర్స్ ఈగల్ టాస్క్ పోలీసులు విలనం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకుంటున్నామని అన్నారు.

ఈ సమావేశంలో కె.ధర్మచందు, రాష్ట్ర సెక్రటరీ, .A. లక్ష్మీ ప్రశాంత్ ,స్టేట్ వైస్ ప్రెసిడెంట్, విల్స్ కుమార్, సభ్యులు తది తరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

యునైటెడ్ తెలుగు కిచెన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా శానిటరీ సిబ్బందికి ప్రత్యేక విందు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : యునైటెడ్ తెలుగు కిచెన్ (యూటీకే) 5వ వార్షికోత్సవం సందర్భంగా సీనియర్ తెలుగుదేశం పార్టీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *