Breaking News

నగరంలో “ఓ.ఎస్.ఎం” ఆటో మోటివ్ షోరూమ్ ప్రారంభం..


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరంలో స్థానిక ఓల్డ్ఆటో నగర్ 100 ఫీట్ రోడ్డు లో”ఓ ఎస్ ఎం ” ఆటోమోటివ్ షోరూం నిర్వాహకులు చేతుల మీదుగా శుక్రవారం ప్రారంభోత్సవం జరిగింది. ఈ సందర్భంగా షోరూం అధినేత చంద్రశేఖర్ మాట్లాడుతూ పేరు ప్రఖ్యాతలు గల “ఓ ఎస్ ఎం” ఆటో మోటివ్ షోరూమ్ ప్రారంభించడం నాకు చాలా ఆనందంగా ఉందని, మా వద్ద ఆటోస్, బాక్స్ టాప్, ఓపెన్ టాప్ , ఎలక్ట్రిక్ వాహనాలు, సిఎన్జి, డీజల్, తో కాకుండా ఎలక్ట్రికల్ తో నడిచే వాహనాలని 2 ,3 గంటలు చార్జింగ్ తో 140 ,170 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చు అని వాహ నదారులకు ఎంతో ఖర్చు తక్కువతో అత్యధిక అత్యాధునికటెక్నికల్ తో మెటల్ బాడీతో కూడిన వాహనాలు సప్లై ఇస్తామని, చాలా తక్కువ డౌన్ పేమెంట్ తో వాహనం సప్లై చేస్తామని , ట్రైనింగ్ టెక్నీషియన్స్ ద్వారా సకాలంలో సర్వీసింగ్ చేసి ఇస్తామని అన్నారు. ఆటో డ్రైవర్లు, వాహన యజమానులు ఈఎంఐ సులభంగా చెల్లించవచ్చని అన్ని బ్యాంకులు ద్వారా లోన్ సౌకర్యం ఉందనిఆయన అన్నారు. ఈ సందర్భంగా నేషనల్ సేల్స్ హెడ్ ఎస్హర్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఇది ఏడవ బ్రాంచ్ అని విజయవాడలో తొలి బ్రాంచ్ ఆటోనగర్ లోప్రారంభించడం మాకు చాలా ఆనందంగా ఉందని క్వాలిటీ మెటల్ బాడీ తో తయారు చేయబడినవని ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కలదని , వాహనమును బట్టి 3 ,5 సంవత్సరములు వారంటీసౌకర్యం కలదని అనంతరం రీజనల్ మేనేజర్ ఫయాజ్ ఖాన్ మాట్లాడుతూ 8 యూనిట్లు ఎలక్ట్రికల్ చార్జింగ్ చేస్తే 140 నుండి 170 కిలోమీటర్లు ప్రయాణం చేయవచ్చని ఆంధ్ర ప్రదేశ్ లో విజయవంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారని ఆటో డ్రైవర్లు ఎంతో లాభ సాటిగా మాకు ఉందని అన్నారనిఅన్నారు. ఈ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు, షోరూం సిబ్బంది తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

కళాకారులకు చేయూత… కొండపల్లి బొమ్మలకు కొత్త దిశ

– ఎక్స్‌పీరియ‌న్స్ సెంట‌ర్‌ను సంద‌ర్శించిన క‌లెక్ట‌ర్ ల‌క్ష్మీశ‌ విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : జిల్లా క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *