Breaking News

పేరెంట్స్ కమిటి సమావేశాలను విజయవంతం చేయండి

-భాగస్వామ్యం అవ్వడం ద్వారా విలువైన సూచనలు సలహాలు ఇవ్వండి
-జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ పాఠశాలలో మరింత మెరుగైన విద్యా బోధనకు పేరెంట్స్ కమిటీ సమావేశాలు వేదికగా నిలవాలని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పిలుపునిచ్చారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీ ప్రశాంతి ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో మరింత మెరుగైన విద్యా బోధనకు, సమర్ధవంతంగా వాటిని చేపట్టడం లో తల్లితండ్రుల ను భాగస్వామ్యం కావాలని కోరడం జరిగిం దన్నారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 7 నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో పేరెంట్స్ కమిటి సమావేశా లను నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలు  చదువుతున్న పాఠశాలల్లో వసతులు, విద్యాబోధనను మెరుగు పరిచే నిమిత్తం ఈ మెగా పేరెంట్-టీచర్స్ సమావేశా లను ఒక చక్కటి వేదిక అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా పేరెంట్స్ కమిటి సమావేశాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీటిలో స్వచ్ఛందంగా భాగస్వామ్యం కావాలని విజ్ఞప్తి చేశారు.

అవగాహనతో కూడి ఆహ్లాదకరమైన వాతావరణంలో పేరెంట్స్ మీట్ కు ఏర్పాట్లు. ఉద‌యం 9.00 నుంచి ఉ.9.30  త‌ల్లితండ్రులు, పూర్వ విద్యార్ధులు, అతిధుల‌కు స్వాగత కార్యక్రమం పాల్గొననున్నారు. ఉపాధ్యాయులతో కలిసి త‌ర‌గ‌తి గ‌దుల్లో విద్యార్ధులు, త‌ల్లితండ్రులతో స‌మావేశాలు. ఉపాధ్యాయులు ఒక్కో విద్యార్ధిపై సంపూర్ణమైన ప్రగతి నివేదిక. త‌ల్లితండ్రుల‌కు రంగోళి, ట‌గ్ ఆఫ్ వార్ పోటీలు. పాఠ‌శాల మైదానంలో సంయుక్త‌ స‌మావేశం, సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు. పాఠ‌శాల ప్ర‌ధానోపాధ్యాయుడు స్కూల్ ప్రగతి నివేదిక అంద చేస్తారు. సైబ‌ర్ క్రైమ్ గురించి ఉపాధ్యాయులు లేదా మ‌హిళా పోలీస్ అవ‌గాహ‌న కార్యక్రమం. ఉన్న‌త స్థానం సాధించిన పాఠ‌శాల పూర్వ విద్యార్ధులు, త‌మ విజ‌య గాధ‌ల‌ను వివరిస్తారు.

Check Also

డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *