-జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
డా. బీఆర్ అంబేద్కర్ అడుగుజాడల్లో పయనిస్తూ దేశాభివృద్ధికి కృషిచేద్దామని జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
బాబాసాహెబ్ డా. బి.ఆర్.అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం ఎన్‌టీఆర్ జిల్లా కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. డా. బీఆర్ అంబేద్కర్ దేశానికి అందించిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి చేయడంతో పాటు మహోన్నతమైన రాజ్యాంగాన్ని దేశానికి అందించిన మహనీయుడు డా. బీఆర్ అంబేద్కర్ అని కలెక్టర్ పేర్కొన్నారు. భారతరత్న డా. బి.ఆర్.అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా జిల్లా, రాష్ట్రం, దేశ ప్రగతికి మనవంతు కర్తవ్యాన్ని నిర్వర్తించవలసిన బాధ్యత ఉందని అన్నారు. కార్యక్రమంలో కలెక్టరేట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.