గుంటూరు, నేటి పత్రిక ప్రజావార్త :
గుంటూరు నగరపాలక సంస్థ పరిధిలో నివాసాల మధ్యలో ప్రజలకు దోమలు, డ్రైనేజి సమస్యలకు కారణమైన ఖాళీ స్థలాల యజమానులకు నోటీసులు ఇవ్వాలని, స్పందించకుంటే చట్ట పరమైన చర్యలు తీసుకోవాలని నగర కమిషనర్ పులి శ్రీనివాసులు ఐఏఎస్ ప్రజారోగ్య అధికారులు, శానిటేషన్ కార్యదర్శులకు స్పష్టం చేశారు. శనివారం కమిషనర్ విష్ణు నగర్, సీతయ్య డొంక, కాకాని రోడ్, పండరీపురం తదితర ప్రాంతాల్లో పర్యటించి, అభివృద్ధి, పారిశుధ్య పనులను, ఆక్యుపెన్సీ దరఖాస్తులను పరిశీలించి, అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ గారు మాట్లాడుతూ నివాసాల మధ్యలో ఉండే ఖాళీ స్థలాల్లో దోమలు, వ్యాధికారక క్రిమి కీటకాలు పెరిగి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పటికే పలు ఫిర్యాదులు కూడా అందాయన్నారు. వార్డ్ సచివాలయాల వారీగా శానిటేషన్ కార్యదర్శులు ఖాళీ స్థల యజమానులకు స్థలం శుభ్రం చేసుకోవాలని నోటీసులు ఇవ్వాలని, నోటీసులకు స్పందిచని వారి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే డ్రైన్లలో గ్యాంగ్ వర్క్ ద్వారా పూడిక తీత పనులు ఎప్పటికప్పుడు చేపట్టాలన్నారు. ఇంజినీరింగ్ అధికారులు కూడా ప్రజల అవసరాలు తగిన విధంగా అభివృద్ధి పనులను సిద్దం చేయాలన్నారు. అనంతరం పండరీపురం, కాకాని రోడ్ లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాలను పరిశీలించి, బహుళ అంతస్తు భవనాలు తప్పనిసరిగా డ్రైనేజికి తగిన ఏర్పాట్లు చేసుకోవాలని, ర్యాంప్ లను నిబందనలకు తగిన విధంగా నిర్మాణం చేసుకోవాలన్నారు. నిర్దేశిత ప్రభుత్వ నిబందనలు పాటించని భవనాలకు ఓసి మంజూరు చేయబోమన్నారు. పర్యటనలో కార్పొరేటర్ కె.కోటేశ్వరరావు, డిసిపి సూరజ్ కుమార్, ఏసిపిలు రెహ్మాన్, మల్లికార్జున, డిఈఈ రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. పర్యటనలో ఈ.ఈ. కోటేశ్వరరావు, డిఈఈ మధుసూదన్, ఏసిపి మల్లికార్జున, ఏఈలు, శానిటరీ ఇన్స్పెక్టర్లు, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.
Tags guntur
Check Also
డిసెంబరు 30 న రాజానగరం ఎంపీడీవో కార్యాలయంలో జాబ్ మేళా
రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ మరియు జిల్లా ఉపాధి సంస్థ ఆధ్వర్యంలో తూర్పుగోదావరి …