మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా నిష్పక్షపాతంగా, పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ ఎన్నికల వ్యయ నియంత్రణ బృందాలను ఆదేశించారు.
కృష్ణా- గుంటూరు శాసనమండలి పట్టభద్రుల ఎన్నిక నేపథ్యంలో జిల్లాలో నిర్వహించే ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించేందుకు సోమవారం కలెక్టరేట్ పిజిఆర్ఎస్ (మీకోసం) గ్రీవెన్స్ హాలులో ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిక్ సర్వేలెన్సీ టీమ్స్ (ఎస్ఎస్ టి), వీడియో సర్వేలెన్స్ టీమ్‌లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ డీకే బాలాజీ మాట్లాడుతూ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నాటి నుండి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలులోకి వచ్చిందన్నారు. ఎం.సి.సి లో ఎఫ్.ఎస్.టి, వి.ఎస్.టిలు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లఘించిన వారిపై తీసుకున్న చర్యలపై రోజువారీ నివేదికలను నిర్దేశించిన ప్రొఫార్మాలో నమోదు చేయాలన్నారు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాలను, నియమావళిని క్షుణంగా చదివి అర్థం చేసుకోవాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అప్రమత్తంగా ఉండాలని, వారిని జి.పి.ఎస్ ట్రాక్ సిస్టం ద్వారా నిరంతరాయంగా పరిశీలిస్తామని కలెక్టర్ తెలిపారు. ఎటువంటి సంఘటనలు జరిగినా సీసీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తామని తెలిపారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా అక్రమ నగదు, మద్యం, పట్టుబడ్డ సమయంలో ఫ్లయింగ్ స్క్వాడ్, సర్వేలెన్స్ వీడియో రికార్డ్ తప్పనిసరిగా చేయాలన్నారు. రాజకీయ పార్టీల మీటింగ్స్, బ్యానర్లు మొదలైన సామాగ్రి పై వీడియో సర్వేలెన్స్ టీమ్‌లు రికార్డు చేయాలని తెలిపారు. ఏ వ్యక్తి ఆధారాలు లేకుండా తమ వెంట పరిమితికి మించి నగదును ఉంచుకోరాదన్నారు. ఫ్లయింగ్ స్కాడ్ టీమ్ లు తగిన ఆధారాలను పరిశీలించి నేరారోపణ లేకపోతే ఆ నగదును సంబంధిత వ్యక్తులకు అందజేస్తారన్నారు. ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజలు 50 వేల లోపు నగదు మాత్రమే అనుమతి ఉన్నదని, 50వేలకు పైబడి ఉన్న నగదుకు సంబంధిత పత్రాలు చూపించాల్సి ఉంటుందని తెలిపారు. రాజకీయ పార్టీ నాయకులు ప్రజలను ప్రలోబాలకు గురి చేయకుండా ప్రజలకు అవగాహన కల్పించాలని తెలిపారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా ఉండాలని తెలిపారు. ప్రభుత్వ వాహనాలను కూడా చెక్ చేసే అధికారం ఉన్నదని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.
జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు మాట్లాడుతూ ఫ్లయింగ్ స్కాడ్ టీం (ఎఫ్ఎస్ టి ) స్టాటిక్ సర్వైలెన్స్ టీం (ఎస్ ఎస్ టి) వీడియో సర్వేలను టీం( వి ఎస్ టి) లు సమన్వయంతో విధులు నిర్వహించాలన్నారు. ఎప్పటికప్పుడు తగిన సమాచారం అందించాలన్నారు. జిల్లాలో ఆరు చోట్ల అంతర్ జిల్లా చెక్ పోస్టుల వద్ద నిఘా ఉంచామన్నారు.
సహాయ రిటర్నింగ్ అధికారి, జిల్లా రెవెన్యూ అధికారి కే. చంద్రశేఖర రావు మాట్లాడుతూ జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో 30 మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీములు, 14 ఎఫ్ ఎస్ టి, 14 ఎస్ ఎస్ టి, 7 విఎస్టి టీములను ఏర్పాటు చేశామని వివరించారు.
ఎన్నికల వ్యయ నియంత్రణ టీములకు డిస్ట్రిక్ట్ ఆడిట్ ఆఫీసర్ వై. సూర్య భాస్కరరావు పవర్ పాయింట్ ద్వారా శిక్షణ ఇచ్చారు.
Prajavartha Online Telugu News