Breaking News

పటిష్ట ప్రణాళికతో ఎన్నిక నిర్వహణకు సిద్ధం కండి….

-ఎలక్షన్ కమిషన్ మార్గదర్శకాల పై పూర్తి అవగాహన కలిగి ఉండండి…..
-అధికారులు సమన్వయంతో విధులు నిర్వర్తించండి……
-జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అధికారులు సమన్వయంతో శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గ ఎన్నికను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ అన్నారు.

కృష్ణా- గుంటూరు జిల్లాల శాసనమండలి పట్టభద్రుల నియోజవర్గానికి జిల్లాలో నిర్వహించే పోలింగ్ నేపథ్యంలో సోమవారం జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ, జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావుతో కలిసి నోడల్ అధికారులతో కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం మార్గ దర్శకాలు, నియమ నిబంధనలను పాటిస్తూ పక్కా ప్రణాళికతో లోటు పాట్లకు తావు లేకుండా ఎన్నికల ప్రక్రియను విజయవంతం చేయాలన్నారు. సాధారణ ఎన్నికలకు వర్తించే నిబంధనలు శాసనమండలి ఎన్నికలకు వర్తిస్తాయన్నారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యం వహించకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. పూర్తిగా బ్యాలెట్ విధానంలో నిర్వహించే ఎన్నికకు పోలింగ్ కేంద్రాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి సిద్ధం చేయాలన్నారు.
నామినేషన్ల స్వీకరణ, లెక్కింపు ప్రక్రియ గుంటూరులో నిర్వహిస్తారని, పోలింగ్ నిర్వహణలో భాగంగా జిల్లాలో నిర్వహించే పోలింగ్ కు 77 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పట్టభద్రుల ఎన్నికలకు 63 వేల 114 మంది ఓటర్లుగా నమోదై ఉన్నారని వీరిలో 36,321 మంది పురుషులు 27,789 మంది మహిళలు, నలుగురు ఇతర కేటగిరీకి చెందినవారుగా ఉన్నారన్నారు. ఈనెల 27 న నిర్వహించే పోలింగ్ కు చేయవలసిన ఏర్పాట్లను సమావేశంలో చర్చించారు. జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్ పరిధిలో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మచిలీపట్నం రెవెన్యూ డివిజన్ కు మచిలీపట్నం నోబుల్ కళాశాల, గుడివాడ రెవెన్యూ డివిజన్ కు రెవెన్యూ డివిజనల్ కార్యాలయం గుడివాడ, ఉయ్యూరు రెవెన్యూ డివిజన్లో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ఉయ్యూరులో డిస్ట్రిబ్యూషన్, రిసెప్షన్, టెంపరరీ స్ట్రాంగ్ రూమ్ లు ఉంటాయన్నారు ఆయా కేంద్రాల్లో పోలింగ్ మెటీరియల్ ను పోలింగ్ స్టేషన్లకు తరలించేందుకు రూట్ మ్యాప్ సిద్ధం చేసుకోవాలన్నారు. 77 పోలింగ్ కేంద్రాల్లో నిర్వహించే పోలింగ్ కు 250 బ్యాలెట్ బాక్సులను సిద్ధంగా ఉంచామన్నారు. 77 మంది ప్రిసైడింగ్ అధికారులు, 77 మంది సహాయ ప్రిసైడింగ్ అధికారులు, 154 మంది ఇతర పోలింగ్ ఆఫీసర్లు, రిజర్వుడిగా ఉంచిన 77 మందితో కలిపి మొత్తం 462 మందిని నియమించడం జరిగిందన్నారు. వీరందరికీ ఈనెల 12వ తేదీన శిక్షణ ఇవ్వటం జరుగుతుందన్నారు.
డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ కేంద్రాలకు మెటీరియల్ తరలింపు, పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను టెంపరరీ స్ట్రాంగ్ రూమ్స్ తరలించేటప్పుడు అధికారులు అత్యంత జాగరూ కతతో ఉండాలన్నారు. ఎటువంటి చిన్న పొరపాట్లకు తావు లేకుండా జిల్లాలో పోలింగ్ ప్రక్రియను విజయవంతం చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డీకే బాలాజీ నోడల్ అధికారులను ఆదేశించారు.

జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు మాట్లాడుతూ ఈనెల 27న నిర్వహించే పోలింగ్ కు పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. నోటిఫికేషన్ జారీ తేదీ నుండి ప్రవర్తన నియమావళిని పటిష్టంగా అమలు చేస్తున్నామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కాంటాక్ట్ అమలు చేసేందుకు ప్రత్యెక టీమ్స్ లతో పాటు, ఫ్లయింగ్ స్క్యాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వేలెన్సు టీమ్స్, వీడియో సర్వేలెన్స్ టీమ్లను ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తున్నామన్నారు. సబ్ డివిజన్ వారీగా ఇంటర్ డిస్టిక్ చెక్ పోస్ట్ లను ఏర్పాటు చేసి గట్టి నిఘా ఉంచామన్నారు. క్రిటికల్ పోలింగ్ స్టేషన్ల గా గుర్తించిన వాటిలో పటిష్ట బందోబస్తు తో పాటు, ఎటువంటి అవకతవకలు జరగకుండా కొట్టుదిట్టమైన నిఘా ఏర్పాటు చేస్తున్నామని జిల్లా ఎస్పీ ఆర్. గంగాధర్ రావు అన్నారు.

సహాయ రిటర్నింగ్ అధికారి,జిల్లా రెవెన్యూ అధికారి కె. చంద్రశేఖర రావు మాట్లాడుతూ పోలింగ్ మెటీరియల్ పంపిణీతో పాటు పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్స్ లను టెంపరరీ స్ట్రాంగ్ రూముల కు తరలించేటప్పుడు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఉదయం ఎనిమిది గంటలకు ప్రారంభం అయ్యే పోలింగ్ కు ఏర్పాట్లను ముందుగానే సిద్ధం చేసేలా అధికారులను ఆదేశించామన్నారు. పోలింగ్ సిబ్బందికి ఈనెల 12వ తేదీన శిక్షణ ఇచ్చి సిద్ధం చేస్తున్నామని డిఆర్ఓ అన్నారు.

సమావేశంలో జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ, ఆర్డీవోలు జి. బాలసుబ్రమణ్యం, కె.స్వాతి, బిఎస్ హెలా షేరన్, అడిషనల్ ఎస్పీ వి. వి. నాయుడు, నోడల్ ఆఫీసర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త నియమావళి ప్రకారం నగరంలోని నాలుగు రంగుల చెత్తబుట్టలను ఏర్పాటు చేయండి

-విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త : సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ 2026 కొత్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *