పశ్చిమలో గెలుపే లక్ష్యంగా కూటమి అభ్యర్థుల జోరు..

-కూటమి అభ్యర్థులకు మద్దతుగా తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త:
పశ్చిమ లో మున్సిపల్ ఎన్నికల ప్రచారం శుక్రవారం ముమ్మరంగా సాగింది. 34 వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పొనుగుపాటి విజయలక్ష్మి కు మద్దతుగా తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి శ్రేణులతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. డివిజన్ లో ఇంటింటి ప్రచారం నిర్వహించి బీజేపీ, జనసేన పార్టీ బలపరిచిన టీడీపీ అభ్యర్థి పొనుగుపాటి విజయలక్ష్మి ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.

గెలుపే లక్ష్యంగా సాయి శరత్ విస్తృత ప్రచారం.

36 వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి ఏలూరు సాయి శరత్ విస్తృత ప్రచారం చేశారు.
తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్ పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు. విద్యాధికుడు, యువకుడు, అందరికీ అందుబాటులో ఉండే వ్యక్తి ఏలూరు సాయి శరత్ కు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.
మాజీ కార్పొరేటర్ గుడివాడ నరేంద్ర రాఘవ కూటమి నేతలు పాల్గొన్నారు.

50 వ డివిజన్ లో టీడీపీ అభ్యర్థి షేక్ ఆషా ఎన్నికల ప్రచారం ముమ్మరంగా సాగింది. ఆషా కు మద్దతుగా తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్ ,పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రచారంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆర్ డి విల్సన్ మాట్లాడుతూ రెండున్నర ఏళ్ల కూటమి ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని చూసి ఎన్డీయే కూటమి నేతలను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
చెప్పాం. చేసాం నినాదంతో ప్రజల్లోకి వచ్చామన్నారు

ఎమ్మెల్యే సుజనా చౌదరి పశ్చిమ లో అవినీతిరహిత , పారదర్శక పాలన అందిస్తున్నారని తెలిపారు.
మరింత అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలని కోరారు.

35 వ డివిజన్ టీడీపీ అభ్యర్థి కప్పగంతు శ్రీ మణి జ్యోతి,
38 వ డివిజన్ టీడీపీ అభ్యర్థి పత్తి నాగేశ్వరరావు, 52 వ డివిజన్ బీజేపీ అభ్యర్ధి దాడి అప్పారావు తరపున తెలుగు సంస్కృత అకాడమి చైర్మన్ ఆర్ డి విల్సన్, పశ్చిమ ఎమ్మెల్యే కార్యాలయ కార్యదర్శి ప్రత్తిపాటి శ్రీధర్ కూటమి నేతలతో కలిసి ప్రచార ర్యాలీలో పాల్గొన్నారు. అవినీతిరహిత , సుపరిపాలన కూటమి ప్రభుత్వం తోనే సాధ్యమని మరింత అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు.