Breaking News

రూ. 4.23 కోట్ల నిధులతో నిర్మించిన పూలే అంబేద్కర్ భవన్ మొదటి అంతస్తు ప్రారంభోత్సవం మరియు ఇతర సౌకర్యాల శంకుస్థాపన

-గోదావరి రివర్ ఫ్రంట్ వ్యూ సుందరీకరణ  మరియు హేవెలాక్  బ్రిడ్జి  అభివృద్ధికి కృషి
-పార్లమెంట్ సభ్యురాలు దగ్గుపాటి పురందేశ్వరి
-ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు)

రాజమహేంద్రవరం, నేటి పత్రిక ప్రజావార్త :
శుక్రవారం ఉదయం గోదావరి గట్టు కరెంట్ ఆఫీస్ సమీపంలో పూలే, అంబేద్కర్ భవనం ప్రారంభ కార్యక్రమంలో , ఇతర మౌలిక సదుపాయాలు కల్పన శంఖుస్థాపన కార్యక్రమం లో రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధేశ్వరి , ఇతర ప్రజా ప్రతినిధులు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలుత జ్యోతిరావ్ పూలే విగ్రహానికి ప్రజా ప్రతినిధులు పూల మాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి మాట్లాడుతూ ఎందరో మహనీయులు సమాజ శ్రేయస్సు కొరకు తన జీవితాలను త్యాగం చేసిన మహనీయుల పేర్లను మాత్రమే నామకరణం చేయాలని సుమారు రూ. 4.23 కోట్ల నిధులతో నిర్మించిన భవనానికి పూలే అంబేద్కర్ భవన్ గా నామకరణం చేయడం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ భవనం భవిష్యత్ తరాల వారికి ఆదర్శవంతంగా ఉంటుందని ఆమె తెలియజేశారు.

రాజమహేంద్రవరం జిల్లా పర్యాటకానికి మంచి భవిష్యత్తు ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. గోదావరి ఫ్రంట్ వ్యూ ను సుందరీకరణం చేయడంతోపాటు బ్రిడ్జి పునర్నిర్మాణానికి అన్ని చర్యలు చేపడతామన్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయ్యేంతవరకు అహర్నిశలు కృషి చేస్తామని ఆమె అన్నారు. రాజమహేంద్రవరం సంస్కృతి , మత సామరస్యత కలపోత కలిగి ఉందని, అందుకు అనుగుణంగా చర్యలు తీసుకుని ప్రత్యేక గుర్తింపు ఇవ్వాలని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖామర్త్యులను కోరటం జరిగిందన్నారు. హేవలాక్ బ్రిడ్జి బ్రిటిష్ వారు నిర్మించారని, వంద సంవత్సరాలు పూర్తయినందున డి కమిషన్ చేయడం జరిగిందని ఆమె అన్నారు. బ్రిటిష్ వారు ముడి సరుకులు కలకత్తా నుంచి చెన్నై వరకు ఈ బ్రిడ్జి మీద నుంచి తీసుకువెళ్లే వారని దీనికి అంత ప్రాచీన చరిత్ర ఉందని ఆమె తెలియజేశారు. ఈ ప్రాంతంలో టూరిజాన్ని అభివృద్ధి చేయటం వలన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు నగరానికి మంచి ఆదాయం కూడా లభిస్తుందన్నారు. తద్వారా ఇక్కడి ప్రజల జిడిపి వృద్దిరేటు పెరుగుతుందని ఆమె అన్నారు. పర్యాటక రంగంలో అభివృద్ధి పనులు చేపట్టడం ద్వారా ఆర్థికంగా బలపడేందుకు, వ్యాపారాలు వృద్ధికి అవకాశాలు పెరుగుతాయని పేర్కొన్నారు. 2027 పుష్కరాలు నాటికి అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పూర్తి చేసి రాజమహేంద్రవరాన్ని టూరిజం స్పాట్ గా ప్రధాన కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఆమె అన్నారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణ అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో దృష్టి కేంద్రీకరించడం జరిగిందని ఆమె తెలియజేశారు. సందర్శనకు వచ్చిన పర్యాటకులు రెండు రోజులు పాటు ఇక్కడే నివాసం ఉంచగలిగితే పర్యాటక రంగం ద్వారా అభివృద్ధి పై దృష్టి పెట్టడం జరుగుతుందని పేర్కొన్నారు. జిల్లా లో అన్ని రకాలుగా అభివృద్ధి చేయుటకు ఎప్పటికప్పుడు అధికారులతో చర్చించి ఒక ప్రణాళిక తయారు చేసి ఆ మేరకుఅమలు చేసే దిశలో ముందుకు సాగటం జరుగుతుందని, అందుకు కేంద్ర ప్రభుత్వ సహకారం తప్పక ఉంటుందని, ఆమేరకు తన వంతుగా సహకారం అందిస్తామని ఆమె తెలియజేశారు. రివర్ ఫ్రంట్ మీద ఉన్న విగ్రహాలను తొలగించబోమని, వాటిని అక్కడే అందంగా పునః ప్రతిష్టిస్తామని విషయమై నగరవాసులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. పూలే అంబేద్కర్ వంటి భవనాలకు ఆదర్శ పురుషులు పేరుతో ఇటువంటి భవనాలు పేరు పెట్టుకుంటే రాబోయే తరాలకు ఆదర్శంగా ఉంటుందని ఆమె తెలియజేశారు. జ్యోతిరావు పూలే తన జీవితాన్ని బీసీ కుల అభివృద్ధికి అంకితం చేశారని ఆమె అన్నారు. మహిళలను సంస్కరించాలని ఆనాడే మహిళ స్కూల్స్ ను స్థాపించి దేశంలోనే మొట్టమొదటి స్కూల్ గా పేరుగావించాలని ఆమె ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ భవనంలో లైబ్రరీ, స్టడీ సెంటర్ ఏర్పాటు కూడా కృషి చేస్తానని ఆమె తెలియజేశారు. సమాజంలో అన్ని వర్గాలు, కులాలు కు చెందిన ప్రజల అభ్యున్నతే తమ కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు.

ఎమ్మెల్సీ సోము వీర్రాజు మాట్లాడుతూ వెనుకబడిన తరగతుల సామాజిక వర్గాల వారికి సంబంధించి ఇటువంటి కమ్యూనిటీ భవనాలను నిర్మించడం జరుగుతున్నదన్నారు. రివర్ ఫ్రంట్ సుందరీకరణ మరియు హెవెలాక్ బ్రిడ్జి పునః నిర్మాణాన్ని పూర్తిచేసి జాతికి అంకితం చేయనున్నట్లు ఆయన తెలియజేశారు. నగర ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించి పర్యాటకంగా అభివృద్ధి చేయడంలో కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని ఆయన తెలియజేశారు. ఉభయ గోదావరి జిల్లాలను అనుసంధానం చేస్తూ హెవెలాక్ బ్రిడ్జి వారధిగా ఉంటుందని ఆయన అన్నారు. భవిష్యత్తులో లంక ప్రాంతాలలో టూరిజం స్పాట్లను గుర్తించి అభివృద్ధి చేయటం జరుగుతుందని ఆయన తెలియజేశారు.

సభకు అధ్యక్షత వహించిన రాజమండ్రి సిటీ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) మాట్లాడుతూ అధిక శాతం మధ్యతరగతి దిగువ తరగతి నివసిస్తున్న నగరంలో ఇటువంటి కమ్యూనిటీ హాల్ ఉండటం వలన పెళ్లిళ్లు, శుభకార్యాలు, ఇతర సమావేశాలు నిర్వహించుకోవడానికి అనువుగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. పూలే అంబేద్కర్ భవన్ నిర్మాణానికి ఎంపీ లాడ్స్ నుంచి నిధులు మంజూరు చేయటం శుభపరిణామం అని ఆయన తెలియజేశారు. సచివాలయ వ్యవస్థను సర్దుకుంటూ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ తీసుకురావటం జరుగుతున్నదని ఆయన అన్నారు. గోదావరి రివర్ ఫ్రంట్ సుందరీకరణలో భాగంగా అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు పనులు ప్రారంభించడం జరుగుతున్నదని ఆయన అన్నారు. ప్రాజెక్టు పనులు పూర్తికి ఒక ప్రణాళికను తయారు చేసుకొని డిపిఆర్ సిద్ధం చేసుకోవాలని, దీని ద్వారా ముందుకు సాగాలని ఆయన సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మరింత బాధ్యతగా రాజమహేంద్రవరం నగర అభివృద్ధికి పాటుపడటం జరుగుచున్నదని , ఈ విషయాన్ని ప్రజలు గుర్తించవలసినదిగా ఆయన కోరారు. రివర్ ఫ్రంట్ వ్యూ దేశ చరిత్రలోనే ఒక తలమానికంగా మారిపోతుందని ఆయన తెలియజేశారు.

తొలుత జ్యోతిరావు పూలే విగ్రహానికి పార్లమెంటు సభ్యురాలు దగ్గుబాటి పురందరేశ్వరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం భవనం శంకుస్థాపన చేయడం జరిగింది. కార్యక్రమంలో ఆర్ ఎమ్ సి, ఇతర సమన్వయ శాఖల అధికారులు , స్థానిక ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజక వర్గాల పునర్విభజన అధ్యయనానికి జనసేన కమిటీ

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త : ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు, నియోజకవర్గాల పునర్విభజన (డీ లిమిటేషన్) జరిగే …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *