నందిగామ, నేటి పత్రిక ప్రజావార్త :
నందిగామలో మహానేత విగ్రహాలకు ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వై.యస్.రాజశేఖర్ రెడ్డి 12 వ వర్ధంతి సందర్భంగా నందిగామ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, గాంధీ సెంటర్లో, 18 వ వార్డులో, 9 వ వార్డులో ఆయన విగ్రహానికి శాసనసభ్యులు డాక్టర్.మొండితోక.జగన్ మోహన్ రావు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి ప్రజల గుండెల్లో చిరస్థాయిగా బతికే ఉన్నారన్నారు. సంక్షేమ అనే మాటకు అర్థం తెలిసేలా పరిపాలన కొనసాగించిన ఏకైక నాయకుడు వైయస్ రాజశేఖర్ రెడ్డి అని ,తెలుగునేలపై సిరుల పంట పండించిన మహానేత వై.యస్.రాజశేఖర్ రెడ్డి ఎప్పటికీ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారన్నారు,దివంగత నేత పరిపాలన కాలంలో రైతన్నలు, అక్కచెల్లెమ్మలు ,పేద, బడుగు,బలహీన వర్గాల ప్రజలు ధైర్యంగా జీవించారని సంక్షేమం అనే మాటకు అర్థం తెలిసేలా మహానేత పరిపాలన చేశారని తెలిపారు, ఆరోగ్యశ్రీ ,ఫీజు రీయింబర్స్మెంట్ ,రైతు రుణమాఫీ ,పావలా వడ్డీ ,జలయజ్ఞం వంటి పథకాలతో ఆనాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిలిచిందన్నారు ,ఆయన స్ఫూర్తితో నేడు ముఖ్యమంత్రి వైయస్.జగన్మోహన్ రెడ్డి పరిపాలనను కొనసాగిస్తున్నరన్నారు..ఈ కార్యక్రమంలో నగర పంచాయతీ కౌన్సిల్ మరియు కోఆప్షన్ సభ్యులు, వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు,అభిమానులు పాల్గొన్నారు ..
Tags nandigama
Check Also
ఎక్సైజ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష
-గీత కులాలకు 10 శాతం మద్యం షాపుల కేటాయింపుపై నిర్ణయం -340 షాపులు ఇచ్చేందుకు వారం రోజుల్లో నోటిఫికేషన్ -రిటైల్ …