మ‌న‌మిత్ర ఆలోచ‌న అద్భుతం

-తుపాన్ స‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌లు స్వీక‌రించ‌డం బాగుంది
-ఆర్టీజీఎస్ నుంచి విప‌త్తుల నిర్వ‌హ‌ణ విధానం భేష్‌
-ఏపీ చొవ‌ర మిగిలిన రాష్ట్రాల‌కూ ఆద‌ర్శం కావాలి
-కేంద్ర బృందం ప్ర‌శంస‌లు
-కేంద్రం నుంచి త‌గినంత సాయం అందేలా కృషి చేస్తామ‌న్న అధికారులు
-తుపాన్ తీరం దాటే వ‌ర‌కు నిరంత‌రం ప్ర‌జ‌ల‌ను అప్ర‌మ‌త్తం చేశాం
-తుపాన్ స‌మ‌యంలో ఎవ‌ర్నీ ఇళ్లు దాటి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించాం
-ముంద‌స్తు జాగ్ర‌త్త‌ల‌తో ప్రాణన‌ష్టం త‌గ్గించ‌గ‌లిగాం
-అర్న‌బ్ తుపాన్ వ‌ల్ల రూ.రూ.4764 కోట్ల మేర న‌ష్టం వాటిల్లిన‌ట్లు ప్రాథ‌మిక అంచ‌నా
-కేంద్ర బృందానికి ఆర్టీజీఎస్ అధికారుల ప‌వ‌ర్‌పాయింట్ ప్ర‌జంటేష‌న్

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ఒక వినూత్న ఆలోచ‌న‌, ఇప్ప‌డు చ‌దువురాని వారు కూడా వాట్సాప్ సుల‌భంగా ఉప‌యోగిస్తున్నారు. తుపాన్ లాంటి విప‌త్తుల వేళ వాట్సాప్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి ఎప్ప‌టిక‌ప్పుడు స‌మస్య‌లు తెప్పించుకోవాల‌నే ఆలోచ‌న అద్భుతంగా ఉంది. ఈ స‌మ‌స్య‌ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ఆర్టీజీఎస్ నుంచి ప‌రిష్కరించిన విధానం కూడా బాగుంది. ఇది చాలా మంచి చొర‌వ‌. దీన్ని అన్ని రాష్ట్రాలు అనుస‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. ఈ విధానాన్ని అన్ని రాష్ట్రాలు అనుస‌రించేలా సిఫార‌సు చేయ‌మ‌ని కేంద్రానికి నివేదిస్తాం.

-చిత్త‌రంజ‌న్ దాస్‌, సంయుక్త కార్య‌ద‌ర్శి, కేంద్ర హోం మంత్రిత్వ శాఖ‌

అమ‌రావ‌తి: అర్న‌బ్ తుపాన్ క‌లిగించిన న‌ష్టాన్ని అంచ‌నా వేయ‌డానికి కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిశీల‌నా బృంధం రాష్ట్రానికి వ‌చ్చింది. ఇందులో భాగంగా శ‌నివారం ఈ బృందం స‌చివాలయంలోని రియ‌ల్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ సొసైటీ (ఆర్టీజీఎస్‌) కేంద్రాన్ని సంద‌ర్శించింది. ఆర్టీజీ కార్య‌ద‌ర్శి కాటంనేని భాస్క‌ర్‌, ఆర్టీజీఎస్ సీఈఓ ప్ర‌ఖ‌ర్ జైన్ లు ఈ బృందానికి స్వాగ‌తం ప‌లికారు. అర్న‌బ్ తుపాన్ వ‌ల్ల రాష్ట్రానికి జ‌రిగిన న‌ష్టం గురించి కేంద్ర బృందానికి ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ద్వారా వివ‌రించారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ సంయిక్త కార్య‌ద‌ర్శి చిత్త‌రంజ‌న్ దాస్ నేతృత్వంలో ఏడుగురు స‌భ్యుల‌తో కూడిన బృందం రాష్ట్రానికి వ‌చ్చింది. ఈ సంద‌ర్భంగా ఆర్టీజీఎస్ అధికారులు తుపాన్ స‌మ‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం చేప‌ట్టిన ముంద‌స్తు స‌న్న‌ద్ద‌త చ‌ర్య‌ల గురించి కేంద్ర బృందానికి వివ‌రించారు.

ప్రాణ‌న‌ష్టం త‌గ్గించ‌గ‌లిగాం

అర్న‌బ్ గురించి ఆరు రోజుల ముందు నుంచే ప్ర‌జ‌ల‌ను నిరంత‌రం అప్ర‌మ‌త్తం చేశాం, ఆర్టీజీఎస్ నుంచి, ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర విప‌త్తుల నిర్వ‌హ‌ణ సంస్థ (ఏపీఎస్‌డీఎంఏ) నుంచి ప్ర‌జ‌ల‌కు నిరంత‌రం తుపాన్ హెచ్చ‌రిక‌లు జారీ చేశామ‌ని ఆర్టీజీఎస్ అధికారులు తెలిపారు. 7.23 కోట్ల మంది మొబైల్ వినియోగ‌దారుల‌కు నిరంత‌రం తుపాన్‌కు సంబంధించి హెచ్చ‌రిక‌లు జారీ చేశాం. తుపాన్ తీరం దాటే స‌మ‌యంలో ప్ర‌జ‌లు ఎవ్వ‌రూ కూడా త‌మ ఇళ్ల నుంచి బ‌య‌ట‌కు రాకుండా చేయ‌డంతో పాటు ర‌హ‌దారుల‌పై వాహ‌నాల రాక‌పోక‌ల‌ను నిలిపేశాం, త‌ద్వారా ప్రాణ న‌ష్టం పెద్ద‌గా వాటిల్లకుండా చేయ‌గ‌లిగాం. తుపాన్ ప‌రిస్థితుల‌ను స‌మర్థ‌వంతంగా ఎదుర్కోవ‌డానికి వివిధ‌శాఖ‌ల మ‌ధ్య స‌మ‌న్వ‌యంతో ప‌నిచేసేలా ఆర్టీజీఎస్ నుంచి ప‌ర్య‌వేక్షించాం. వివిధ శాఖ‌లు తుపాను స‌హాయ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డానికి జిల్లా, మండ‌ల స్థాయిలో 3,455 కంట్రోలు రూములు ఏర్పాటు చేసుకున్నాయి, 3,918 నోడ‌ల్ అధికారుల‌ను నియ‌మించాం. 2,199 తుపాన్ షెల్ట‌ర్ల‌ను 20 జిల్లాలో ఏర్పాటు చేశాం. 34,716 మందిని ఈ షెల్ట‌ర్ల‌కు త‌ర‌లించాం. స‌హాయ‌క చ‌ర్య‌ల కోసం 16 ఎన్డీఆర్ ఎఫ్‌, 11 ఎస్‌డీఆర్ ఎఫ్ బృందాల‌ను 14 జిల్లాల‌కు త‌ర‌లించాం, అత్య‌వ‌స‌ర వైద్య సేవ‌ల కోసం 1,355 అంబులెన్సు వాహ‌నాల‌ను సిద్ధం చేసి ఉంచాం, ముంద‌స్తు జాగ్ర‌త్త చర్య‌ల్లో భాగంగా 3,012 మంది గ‌ర్భిణిలను ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించాం. తుపాన్ స‌మ‌యంలో ప్ర‌జ‌లకు ఎక్క‌డైనా స‌మ‌స్య‌లు ఎదురైతే అత్య‌వ‌స‌ర సాయం కోసం మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా ఆ స‌మ‌స్య‌ల‌ను ప్ర‌భుత్వానికి షేర్ చేసే స‌దుపాయం క‌ల్పించాం. వ‌చ్చిన స‌మ‌స్య‌ల‌ను వ‌చ్చిన‌ట్లే ప‌రిష్క‌రించాం. మ‌న‌మిత్ర ద్వారా వ‌చ్చిన అర్న‌బ్ తుపాన్ సంబంధిత స‌మ‌స్యల్లో 95 శాతానికిపైగా ప‌రిష్క‌రించ‌గలిగాం. మ‌త్స్య‌కారులెవ్వ‌రూ కూడా చేప‌ల వేట కోసం స‌ముద్రంలోకి వెళ్ల‌కుండా ముంద‌స్తుగానే నిలువ‌రించ‌గ‌లిగాం. మ‌త్స్య‌కారుల‌కు చెందిన 30,043 ఫిషింగ్ బోట్లు రేవుల‌కే ప‌రిమిత‌మ‌య్యేలా చేశామ‌ని ఆర్టీజీఎస్ అధికారులు నివేదించారు.

రూ.4,764 కోట్ల న‌ష్టం

అర్న‌బ్ తుపాన్ వ‌ల్ల రాష్ట్రంలో రూ.4,764 కోట్ల మేర న‌ష్టం వాటిల్లింద‌ని ప్రాథ‌మికంగా అంచ‌నా వేసిన‌ట్లు అధికారులు కేంద్ర బృందానికి తెలిపారు. 4.63 ల‌క్ష‌ల మంది రైతుల‌కు చెందిన 3.52 ల‌క్ష‌ల హెక్టార్ల‌లో పంట‌లు దెబ్బ‌తిన్నాయి. 23,383 హెక్టార్ల‌లో ఉద్యాన‌వ‌న పంట‌లు దెబ్బ‌తిన్నాయి. 2,491 కిలోమీట‌ర్ల మేర రాష్ట్ర ప్ర‌ధాన ర‌హ‌దార్లు దెబ్బ‌తిన్నాయ‌ని అధికారులు చెప్పారు. 7,382 ఇళ్లు దెబ్బ‌తిన్నాయి. 12 జిల్లాల్లో తుపాన్ వ‌ల్ల న‌ష్టం వాటిల్లింద‌ని అయితే కోన‌సీమ‌, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలు దారుణంగా దెబ్బ‌తిన్నాయని చెప్పారు. విద్యుత్తు రంగానికి భారీగా న‌ష్టం వాటిల్లింద‌ని చెప్పారు.

మ‌న‌మిత్ర ఆలోచ‌న అద్భుతం

తుపాన్ ప్ర‌భావిత ప్రాంతాల్లో మ‌న‌మిత్ర వాట్సాప్ గ‌వర్నెన్స్ ద్వారా ప్ర‌జ‌ల నుంచి స‌మ‌స్య‌ల‌ను స్వీక‌రించి వాటిని ఎప్ప‌టిక‌ప్పుడు ప‌రిష్క‌రించిన విధానం కేంద్ర బృందాన్ని అమితంగా ఆకట్టుకుంది. ఈ ఆలోచ‌న అద్భుత‌మ‌ని, దీనివ‌ల్ల ప్ర‌జ‌లు సుల‌భంగా వాట్సాప్ ద్వారా త‌మ స‌మ‌స్య‌లు ప్ర‌భుత్వానికి చేర‌వేయ‌డానికి వీలైంద‌ని, ఈ త‌ర‌హా విధానం ఇత‌ర రాష్ట్రాల‌కు ఆద‌ర్శ‌ప్రాయ‌మ‌ని, అంద‌రూ మ‌న‌మిత్ర లాంటి స‌దుపాయాన్ని త‌మ రాష్ట్రాల్లో ఏర్పాటు చేసుకునేలా సిఫార‌సు చేయ‌మ‌ని కేంద్రానికి నివేదిస్తామ‌ని కేంద్ర బృందం తెలిపింది. రిల‌య్ టైమ్ గ‌వ‌ర్నెన్స్ ద్వారా విప‌త్తుల నిర్వ‌హ‌ణ రియ‌ల్ టైమ్‌లో ప‌ర్య‌వేక్షించిన విధానాన్ని కూడా కేంద్ర బృందం ప్ర‌శంసించింది. అర్న‌బ్ తుపాన్ న‌ష్టంపై ఆర్టీజీఎస్ అధికారులు ఇచ్చిన ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జంటేష‌న్ ప‌ట్ల కేంద్ర బృందం సంతృప్తిని వ్య‌క్తం చేసింది. కేంద్రం నుంచి త‌గినంత సాయం రాష్ట్రానికి అందేలా త‌మ వంతు కృషి చేస్తామ‌ని చిత్త‌రంజ‌న్ దాస్ తెలిపారు. విప‌త్తు నుంచి బ‌య‌ట‌ప‌డేలా ఏపీకి త‌క్ష‌ణ సాయం అందించేలా కేంద్రానికి సిఫార‌సు చేస్తామ‌న్నారు.