శ్రీ మహంకాళీ అమ్మవారి హుండీ ఆదాయం రూ.32.40 లక్షలు

-గత ఏడాదితో పోలిస్తే రూ.3 లక్షలు పెరిగిన ఆదాయం

అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త:
గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం కంఠంరాజుకొండూరులో కొలువై ఉన్న శ్రీ మహంకాళీ అమ్మవారి దేవస్థానానికి భక్తులు సమర్పించిన హుండీ కానుకలను శనివారం (31-10-2026) లెక్కించారు. మూడు నెలల 24 రోజుల అనంతరం హుండీలను తెరిచి లెక్కించగా ప్రధాన హుండీల ద్వారా రూ.32,40,863 ఆదాయం సమకూరింది. గత ఏడాది 2025తో పోలిస్తే రూ.3 లక్షల ఆదాయం పెరిగింది. అన్నదాన హుండీ ద్వారా మరో రూ.34,887 ఆదాయం లభించింది. దేవాదాయ శాఖ గుంటూరు ఇన్‌స్పెక్టర్ సీహెచ్ వెంకట శ్రీనివాసులు పర్యవేక్షణలో హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవస్థాన వ్యవస్థాపక ధర్మకర్త డి. రంగప్రసాద్, దేవస్థాన సిబ్బంది, అర్చకులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.